Monday 30 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (18)



సాయి.బా.ని.. డైరీ -  1994 (18)
22.06.1994

నిన్నటిరోజున రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధా - ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయాలి అని ఉంది. మరి నాలోని లోటుపాట్లు నాకు తెలియచేయి నేను సరిదిద్దుకొంటాను" అని వేడుకొన్నాను.   

Sunday 29 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (17)

సాయి.బా.ని..  డైరీ - 1994  (17)

28.05.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, సాయిబంధువులకు సందేశము ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు

Saturday 28 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (16)


 
సాయి.బా.ని..  డైరీ -  1994 (16)

15.05.1994

నిన్న రాత్రి కలలో శ్రీ సాయిని నా నిజ స్థితిని చూపించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి విచిత్రమైన సంఘటనలను చూపించినారు.  వాటి వివరాలు 

Friday 27 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (15)



సాయి.బా.ని.. డైరీ - 1994  (15)
01.05.1994

నిన్నటిరోజున ఆఫీసులో జరిగిన సభలో నన్ను ఎవరు గుర్తించలేదు అనే బాధతో యింటికి వచ్చి చాలా ఆలోచించినాను.  శ్రీ సాయి బా.ని.. గా మారిన తర్వాత కూడా గుర్తింపు అనే వ్యామోహముని వదలించుకోలేకపోతున్నానే -  

Thursday 26 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (14)


సాయి.బా.ని..  డైరీ - 1994  (14)

23.04.1994

నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి, అన్న మాటలు - "కాలము అనేది భగవంతుడు మనకు యిచ్చిన వరము.  దానిని వ్యర్ధము చేసుకోకుండ జాగ్రత్తగా మంచి కార్యాలకు వినియోగించుకొంటు, శరీరాన్ని భగవంతుని సేవలో ఉపయోగించుకొంటు జన్మను సార్ధకము చేసుకోవాలి."
  

Wednesday 25 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (13)



సాయి.బా.ని.. డైరీ -  1994  (13)

12.04.1994

నిన్నటిరోజున కుటుంబ సభ్యులు నాకు చాలా చికాకు కలిగించినారు.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను. 

Monday 23 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (12)


 
                                                 

సాయి.బా.ని..  డైరీ - 1994  (12)
07.04.1994

నిన్నటిరోజున మనిషి పుట్టుక, చనిపోవటము జన్మ ఎత్తటములోని ముఖ్య ఉద్దేశము - గురువు యొక్క ఆవశ్యకతపై ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్ర పోయినాను. 


Sunday 22 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (11)


సాయి.బా.ని.. డైరీ - 1994 (11)

21.03.1994

నిన్నటి రాత్రి శ్రీ సాయికి నమస్కరించి - "బాబా నాకు ఆజ్మీరులోని దర్గాను దర్శించటానికి - రణతంబోరులో శ్రీ గణేష్ మహరాజ్ ని దర్శించటానికి అనుమతిని ఆశీర్వచనాలను ప్రసాదించు" అని వేడుకొన్నాను

Saturday 21 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (10)




సాయి.బా.ని.. డైరీ - 1994  (10)

నిన్న రాత్రి కొందరు మితృలను భోజనానికి పిలిచినాను.  భోజన సమయములో మా ఆఫీసులో పని చేసి  రిటైరు అయిన ఉన్నత ఉద్యోగిని దూషించినాను.  మితృలుకూడా నాతో కలసి ఉన్నత ఉద్యోగిని దూషించినారు.   


Wednesday 18 January 2012

సాయి బా ని స డైరీ - 1994 (9)



19.01.2012  గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బా ని స డైరీ - 1994  (9)

05.03.1994

నిన్నటిరోజున నాకుమారుడు వ్యవహారము నా మనసులో అశాంతిని రేకెత్తించినది 

Saturday 14 January 2012

సాయి బా ని స డైరీ - 1994 (8)

 

 14.01.2012  శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు

సాయి బా ని డైరీ  -  1994 (8)

01.03.1994

నిన్నటిరోజున భార్య పిల్లల మీద విసుగు కలిగినదిరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఈసంసారము మధ్య ఉంటు సంసారముపై వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపు తండ్రీ" అని వేడుకొన్నానుశ్రీ సాయి కలలో చూపించిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినదివాటి వివరాలు.


Thursday 12 January 2012

సాయి బా ని స డైరీ 1994 (7)


 

13.01.2012  శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

సాయి బంధువులందరూ కూడా మన బ్లాగులో సభ్యులుగా చేరండి.  బ్లాగులో ప్రచురణ అయినప్పుడెల్లా మీ మైల్ కి సందేశం వస్తుంది.  


Wednesday 11 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1994 (6)





12.01.2012  గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని..  డైరీ  1994  (6)

17.02.1994

నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి సూచనలు"  యివ్వమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి అన్నారు.



Tuesday 10 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 ( 5 )




 

11.01.2012  బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్స్లు

సాయి.బా.ని.. డైరీ - 1994 5 . భాగము

05.02.1994

నిన్నటిరోజున కూడ మనసులో చాలా చికాకు కలిగినదిమనసుకు కొంచము సంతోషము కలిగించమని  శ్రీ సాయిని వేడుకొన్నానుశ్రీ సాయి  రాత్రి  కలలో చూపిన దృశ్యము, ఆయన యిచ్చిన సూచనలు మనసుకు సంతోషము కలిగించినది.



Monday 9 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 నాలుగవ భాగము



10.01.2012  మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1994  నాలుగవ భాగము 


25.01.1994 


నిన్నటిరోజునుండి తిరిగి శ్రీ సాయి సత్ చరిత్ర తెలుగు నిత్యపారాయణ ప్రారంభించినాను శుభ సందర్భములో శ్రీ సాయిని ఆశీర్వదించమని వేడుకొన్నాను


Sunday 8 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 మూడవ భాగము



 
09.01.2012  సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.. డైరీ -  1994 

మూడవ భాగము

నిన్నటి రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు నన్ను చాలా ఆకట్టుకొన్నాయి.  దృశ్యాలు చూసిన తర్వాత శ్రీ సాయి చెప్పిన మార్గములో నడుస్తానని మాట యిచ్చినాను.  శ్రీ సాయి నా ఆఫీసు జీవితములో నాకు యిష్ఠము లేని ఉన్నత అదికారి రూపములో దర్శనము యిచ్చి తన యింటికి రమ్మనమని ఆహ్వానించినారు. 


Saturday 7 January 2012

సాయిబానిస డైరీ - 1994 రెండవభాగము





 08.01.2012  ఆదివారము
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని..  డైరీ - 1994 

రెండవ భాగము

11.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగానికి మార్గము చూపమని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. -  "ఆధ్యాత్మిక రంగములో పయనించటానికి అడవిలోనికి వెళ్ళి తపస్సు చేసుకోవలసిన అవసరము లేదు.  నీవు చక్కగా సంసార జీవితము సాగించుతు ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకొంటు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయవచ్చును.  మతాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చాటి చెప్పు.  యితర మతాల జోలికి పోవద్దు.  మతం మారిపిడిని ప్రోత్సహించవద్దు.  పండగలన్నిటిలోను పసిపిల్లలకు జరిపే అన్నపాశన పండగ అంటే నాకు చాలా యిష్ఠము.  

13.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి - సాయి శక్తి గురించి చెప్పమని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో అన్ఞాత వ్యక్తి రూపములో కనిపించి అన్నారు.  1) నీ జీవితములో నిన్ను ఉన్నత స్థానానికి చేర్చగల శక్తి సాయి శక్తి.  2) పదిమందిలోను ధైర్ర్యముగా మాట్లాడగల శక్తి సాయి శక్తి 3) నీ యింట దారిద్ర్యాన్ని పారద్రోలే శక్తి సాయి శక్తి 4) జీవితములో క్రమ శిక్షణ యివ్వగల శక్తి సాయి శక్తి 5) చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయగల అమృత శక్తి సాయిశక్తి 6) నీ జీవితము నడకలో నిన్ను కాపాడే శక్తి సాయి శక్తి.   


17.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను.  కలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు కనువిప్పు కలిగించినవి.  నేను జీవితములో "మంచి" "చెడు" అనే యిద్దరు స్నేహితులతో ప్రయాణము   చేస్తున్నాను.  చెడు స్నేహితుడు చాలా బలవంతుడు.  మంచి స్నేహితుడు బలహీనుడు.   
 

ప్రయాణము మధ్యలో చెడు స్నేహితుడు మంచి స్నేహితుని బాధలు పెట్టసాగినాడు.  నేను అన్యాయాన్ని చూడలేక మంచి స్నేహితునికి సహాయము చేస్తాను.  చెడు స్నేహితుడు నన్ను ప్రలోభపరచి నా చేతికి కత్తిని యిచ్చి మంచి స్నేహితుని చంపమంటాడు.   
 
నేను ప్రలోభాలకు లొంగను.  అపుడు మంచి స్నేహితుడుని రక్షించటానికి నేను కత్తితో చెడు స్నేహితుని పొట్టలో పొడుస్తాను.  చెడు స్నేహితుడు చనిపోవడు.  మంచి స్నేహితుడు నా దగ్గరకు వచ్చి చెడు స్నేహితుని గొంతులో అతని  ప్రాణము యుంది అందుచేత గొంతులో పొడవమని సలహా యిస్తాడు.  నేను ధైర్యముగా చెడు స్నేహితుని గొంతులో కత్తితో పొడుస్తాను.  చెడు స్నేహితుడు చనిపోతాడు.  చుట్టూ చేరిన ప్రజలు   పోలీసులను పిలుస్తారు.  నేను పోలీసులకు లొంగిపోవాలని ఆలోచించుతూ ఉంటాను.  అపుడు మంచి  స్నేహితుడు నా దగ్గరకు వచ్చి పోలీసులకు లొంగిపోతే నీవు అనవసరమైన కష్ఠాలలో యిరుక్కొని పోతావు.  అందుచేత దూరంగా ఉన్న పవిత్ర స్థలానికి పారిపో అంటాడు.  నేను పవిత్ర స్థలానికి వెళ్ళటానికి బస్సు కోసము ఎదురు చూడసాగినాను.  బస్సు స్టాప్ లో చాలామంది ముసలి దంపతులు ఉన్నారు.  వారు బస్సు కోసము ఎదురు చూస్తున్నారు. 




నా భార్య నాకు తోడుగా రాలేదు.  బస్సు స్టాప్ లో అజ్ఞాత వ్యక్తి వచ్చి నా చేతికి నాలుగు బ్యాటరీ లైట్లు యిస్తాడు.  నేను సంతోషముగా స్వీకరించుతాను --- నిద్రనుండి మెలుకువ వచ్చి కల గురించి ఆలోచిచినాను.  మంచి, చెడు అనే స్నేహితులు నాలోని మంచి, చెడు ఆలోచనలకు ప్రతిరూపము.  చెడు స్నేహితుని చంపటము మంచి ఆలోచనలను పెంచుకోవటము పోలీసులు అంటే సంసార బంధాలు.  ముసలి దంపతులు అందరు సాయి భక్తులు.  బస్సు ప్రయాణములో నాకు తోడుగా నా భార్య రాదు అంటే సంసార బంధాలు నుండి నేను ఒక్కడిని విడివడి ఆధ్యాత్మిక  ప్రయాణము సాగించాలి.  అజ్ఞాత వ్యక్తి శ్రీ సాయి.  ఆయన యిచ్చిన బ్యాటరీ లైటు - జీవితములో నాలుగు వైపులనుండి కమ్ముకొనే చీకట్లని పారత్రోలటానికి ఉపయోగ పడే సాధనము, ఆశీర్వచనాలు అని భావించినాను.   

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు