Monday, 29 October 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 4వ.భాగము

29.10.2012  సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 4వ.భాగము
                                               
                                                         


సాయి.బా.ని.స. చెపుతున్న శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి 
మరలా ఇప్పుడు భాగవతంలోకి వద్దాము. ధృవుడు ఎంతో ధైర్యంగా యక్షులతో పోరాడినందుకు కుబేరుడు ప్రశంసించాడు.

Saturday, 27 October 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 3

27.10.2012  శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులుసాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా సాయి
శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 3

మనమిప్పుడు భాగవతాన్ని ఒక్కసారి సమీక్షిద్దాము.

పరీక్షిన్మహారాజుకు  శుకమహర్షి ఏడు రోజులలో భాగవతాన్ని వినిపించి సద్గతిని కలిగించారు. సాయి సత్చరిత్రలో ఇటువంటి సంఘటనే ఎక్కడయినా ఉన్నదా అని మనము పరిశీలించినపుడు 31వ. అధ్యాయములో కనపడుతుంది. 

Friday, 26 October 2012

శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి


26.10.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. చెప్పే శ్రీకృష్ణునిగా సాయి వినండి...


                                         
                           


శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి  -  2


గర్భవతిగా ఉన్న ఉత్తరను శ్రీకృష్ణ పరమాత్ములవారు ఎట్లు రక్షించినారో  మనకందరకూ తెలుసు.  అశ్వథ్థామ ఆమె గర్భంలో ఉన్న శిశువును  బ్రహ్మాస్త్రంతో నాశనం చేద్దామనుకున్నాడు.  


Thursday, 25 October 2012

శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి


25.10.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుండి సాయి.బా.ని.స. గారు చెప్పే శ్రీకృష్ణునిగా సాయి వినండి.
శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయిఓం శ్రీగణేశాయనమహఓం శ్రీసరస్వ్వత్యైనమహఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమహ. 

శ్రీసాయి సత్చరిత్ర 10, 15వ. అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని,  అందరి హృదయాలలోను నివసిస్తున్నానని  చెప్పారు. నాయజమానియైన సాయి మీ బానిస అయినపుడు నేను కూడా మీబానిసనే.

Sunday, 21 October 2012

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము
                                                

21.10.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము 

మన హృదయాలను పరిపాలించేది భగవంతుని చరణకమలాలే అని రామాయణం ద్వారా మనకు అర్ధమవుతుంది. 

శ్రీరామచంద్రులవారు రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళారు. ప్రీతిపాత్రుడయిన రాముని యొక్క వియోగాన్ని భరించలేక దశరధ మహారాజు స్వర్గస్తులయారు .

తాను లేని సమయంలో తల్లి మూర్ఖత్వం వల్ల ఇటువంటి విపరీత పరిణామాలన్ని జరిగడంతో భరతుడు చాలా దుఖించాడు. అరణ్యానికి వెళ్ళి రాములవారిని ఒప్పించి తిరిగి రాజ్యానికి తీసుకుని వచ్చి పరిపాలనా బాధ్యతలను రామునికి అప్పగిద్దామనుకున్నాడు. శ్రీరామచంద్రులవారు తనకు బదులుగా తన పాదుకలను అయోధ్యకు తీసుకొనివెళ్ళి సిం హాసనం మీద పెట్టి పరిపాలనా బాధ్యతలను నిర్వహించమని భరతుడిని ఒప్పించారు.  దీనివల్ల రామాయణంలో పాదుకలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. భరతుడు తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని అయోధ్యకు తీసుకొని వచ్చారు. అయోధ్యకు చేరిన తరువాత, పాదుకలను సిం హాసనం మీద పెట్టి భరతుడు శ్రీరాములవారి తరఫున పరిపాలనా బాధ్యతలను చేపట్టారు.

శ్రీ సాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయములో మనకు ఇటువంటివే కనపడతాయి.  

బాబా షిరిడీలో ప్రవేశించిన దానికి అనుగుణంగా బాయి కృష్ణజీ, దీక్షిత్ లు బాబా పాదుకలను షిరిడీకి తీసుకొనివచ్చి వేప చెట్టుక్రింద ప్రతిష్టించారు. 

పాలరాతి పాదుకలను వారు ఉపాసనీ మహారాజుగారి చేత ప్రతిష్టించ దలచి ఆయనను ఆహ్వానించారు.  ఉపాసనీ మహరాజు పాదుకలను 1912 వ సంవత్సరములో  శ్రావణ పూర్ణిమ రోజున వేపచెట్టుక్రింద ప్రతిష్టించి దానికి "గురుస్థాన్" అని పేరు పెట్టారు. 


బాబా అక్కడకు వచ్చి "ఇవి భగవంతుని పాదుకలు" అన్నారు.  

బాబా ఎప్పుడూ వాటిని  తన పాదుకలు అని చెప్పుకోలేదు.  "ఈ భగవంతుని పాదుకలను పూజించండి. గురు శుక్రవారములలో ఈ పాదుకలకు అగరుబత్తీలను, సాంబ్రాణి ధూపం వేసినచో భగవంతుని అనుగ్రహమును పొందగలరు" అని బాబా చెప్పారు. దీనిని బట్టి  పాదుకలకు మనము ఎంతటి ప్రాముఖ్యాన్నివ్వాలో అటు రామాయణం ద్వారా, ఇటు సాయి సత్చరిత్ర ద్వారా గ్రహించగలము.     

శ్రీ సాయి సత్చరిత్ర 43, 44 అధ్యాయముల ద్వారా భాగవతము, రామ విజయముల యొక్క గొప్పతనము తెలుస్తుంది. సాయినాధుని మహాసమాధికి వాటికి సంబంధం ఉంది. సామాన్య మానవులు జీవిత ఆఖరి క్షణాలలొ భాగవతం వింటూ మోక్షాన్ని పొందగలరు. సాధు సత్పురుషులు తమ ఆఖరి క్షణాలలో మహా సమాధి అయేముందు రామవిజయాన్ని వింటారు. శ్రీరామచంద్రులవారి అవతార పరిసమాప్తి అయేముందే రామవిజయం యొక్క ప్రస్తావన వస్తుంది. శ్రీరాములవారికి మరణం లేదు. బాబా మహా సమాధి అయే సమయములో తన భక్తుడయిన వాఝే చేత రామ విజయాన్ని చదివించుకోవడానికి బహుశా ఇదే కారణమయి ఉంటుంది. ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి శ్రీరాములవారు తన అవతారాన్ని ఎట్లా చాలించారో మనము తెలుసుకొందాము.         

శ్రీరాములవారు తన కుమారులయిన లవ కుశులకు పట్టాభిషేకం చేశారు. సీతామాత ఎన్నోకష్టాలను అనుభవించి ఇక తన పాత్రను ముగించుకుందామని నిశ్చయించుకొన్నది. తాను 
ఎక్కడినుంచయితే జన్మించిందో ఆపుడమి తల్లి ఒడిలోకే 
చేరుకొన్నది.
 
ఇక శ్రీరామచంద్ర్రలవారికి ఏమి మిగిలింది? లక్ష్మీదేవి అప్పటికే 
విష్ణులోకానికి వెళ్ళిపోయింది.  

ఆమె ప్రక్కన ఉండటానికి తను కూడా వెళ్ళాలి. అందరూ చూస్తుండగా, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, నలుగురూ కూడా సరయూ నదిలోకి ప్రవేశించి అదృశ్యమయ్యారు. సరయూ నదిలోనించి, శంఖు చక్ర గదా ఆయుధాలను ధరించి ఆదిశేషునిపై పవ్వళించి శ్రీమహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇదంతాకూడా రామాయణంలో వర్ణించబడి ఉంది.   

బాబా మహాసమాధి ఎలా చెందారన్న విషయం మనకు శ్రీ సాయి సత్చరిత్ర 43 - 44 అధ్యాయాలద్వారా తెలుస్తుంది. అక్టోబరు 15 వ. తేదీ 1918 సంవత్సరము విజయదశమి  మధ్యాహ్న్నము వేళ దశమి వెళ్ళి ఏకాదశి ఘడియలు సమీపిస్తున్న సమయములో  బాబా ద్వారకామాయిలో తన శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగారు.  రామాయణంలో శ్రీరామ చంద్రులవారు, శ్రీసాయి సత్చరిత్రలో బాబా ఇద్దరూ కూడా  విష్ణులోకానికి చేరుకొన్నారు.  

ఆనాటిశ్రీరాములవారే ఈనాటి  శ్రీ షిరిడీ సాయిరాములవారని తెలియచేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 

రామాయణంలో శ్రీసాయి సమాప్తము

త్వరలో శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీసాయి ....ఎదురు చూడండి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


పాదుకల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను చూడండి. 

http://telugublogofshirdisai.blogspot.in/

Friday, 19 October 2012

రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము


19.10.2012  శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
సాయిబంధువులందరకూ దసరా శుభాకాంక్షలు

రామాయణంలో శ్రీసాయి 8వ. భాగము
నవ విధ భక్తిలో 'కీర్తన ప్రాముఖ్యమైనదని రామాయణంలో కూడా చెప్పబడింది. 

భరతుడుతమ తండ్రి అయిన దశరధమహారాజులవారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తరువాత   శ్రీరామ చంద్రులవారిని ఒప్పించి అయోధ్యకు తిరిగి రప్పించాలనుకున్నాడు. 
 

Friday, 12 October 2012

రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము

13.10.2012 శనివరము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి


మీరు చదువుతున్న రామాయణంలో శ్రీ సాయిపై మీ అభిప్రాయములను తెలియచేయండి.

రామాయణంలో శ్రీసాయి 7 వ.భాగము

రామాయణంలోని అయోధ్య కాండలో,  శ్రీరామచంద్రులవారికి కులమత భేదాలు లేవు అని చెప్పబడింది. 

Thursday, 11 October 2012

రామాయణంలో శ్రీసాయి 6వ. భాగము
12.10.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి

రామాయణంలో శ్రీసాయి 6వ. భాగము

కైకేయి దశరధ మహారాజుతో రామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరింది. 

దశరధ మహారాజు దానికి అంగీకరించారు. దశరధ మహారాజు రాముని వియోగం భరించలేక  మరణించారు.  


ఆసమయంలో ఆయన ప్రక్కన, రాముడుగాని, లక్ష్మణుడు గాని, భరతుడు గాని, శతృఘ్నుడు గాని   లేరు. 

Wednesday, 10 October 2012

రామాయణంలో శ్రీసాయి 5వ. భాగము

10.10.2012  బుధవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి

రామాయణంలో శ్రీసాయి 5వ. భాగము

ఇప్పుడు అయోధ్యకాండను సమీక్షిద్దాము.శ్రీ సుందర చైతన్య స్వామీజీ, పగ తీర్చుకోవడం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని 


Tuesday, 9 October 2012

రామాయణంలో శ్రీ సాయి నాలుగవ భాగము


                                              
                                                           09.10.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.స. చెప్పిన రామాయణంలో శ్రీసాయి

రామాయణంలో శ్రీ సాయి నాలుగవ భాగము 

"తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా, దానికి తగిన శిక్షను అనుభవించవలసినదే" అని   గౌతమ మహర్షి అహల్యకు శాపమిచ్చే సందర్భములో  రామాయణంలో చెప్పారు.  సాయిసత్ చరిత్ర 14వ. అధ్యాయములో కాంతా కనకాలే ఆధ్యాత్మిక పురోగతికి  అవరోధాలని చెప్పబడింది. 

Monday, 8 October 2012

రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)
                                                  
08.10.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సెప్టెంబరు 30 వ. తేదీనుంచి ప్రచురణకు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆటంకం కలిగింది. ఈ రోజు సాయి.బా.ని.స. రామాయణంలో శ్రీ సాయి 3వ.భాగాన్ని అందిస్తున్నాను.


రామాయణంలో శ్రీసాయి (3వ.భాగము)మనము రామాయణంలోని బాలకాండను ఒక్కసారి సమీక్షిద్దాము.  ఇందులో దశరధ మహారాజుకు   పుత్ర సంతానాన్ని అనుగ్రహించిన సందర్భము ఉంది.