Wednesday, 28 November 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 3వ. భాగము.
                                                    
                                               
28.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


రెండు రోజులుగా  బ్లాగులో ఏమీ ప్రచురించకపోవడానికి కారణం కార్తీక పౌర్ణమి గురించి అందరూ చదివి  సత్ఫలితాలను పొందాలనె ఉద్దేశ్యంతో ప్రచురించలేదు.  మరొక కారణం నేత్రవైద్యుడి వద్ద కళ్ళు పరీక్ష చెయించుకున్న కారణంగా , కళ్ళకు శ్రమ ఇవ్వకూడదనే మరొక కారణం.  ఈ రోజు జన్మ, పునర్జ్మల గురించి చదవండి. సాయితో మధురక్షణాలు కూడా ఉంటాయి.  

                                      

మొదటగా ........

శ్రీ విష్ణుసహస్రనామం 9 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:  ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విద్మః క్రమః  

         అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || 


తాత్పర్యము: పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనుస్సు ధరించిన వానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమైన క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెట్టుటకు వీలుకానివాడుగను,  విశ్వాసముగలవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.  


Saturday, 24 November 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము


                         
                                       

24.11.2012  శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ విష్ణుసహస్రనామం 6వ. శ్లోకం మరియు తాత్పర్యము:

శ్లోకం:  అప్రమేయో హృషికేశః పద్మనాభో మర ప్రభుః 

         విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధృవః ||


భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు.  ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు.  అందరికన్నా ఎక్కువ వయస్సు కలవాడు.  తానే ధృవమై స్థిరముగానున్నవాడు.     Thursday, 22 November 2012

జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 1

ఈ రోజునుండి సాయి.బా.ని.స. చెప్పబోయే జనన మరణ చక్రాలపై సాయి ఆలోచనలు అందిస్తున్నాను. 

ఈ రోజు మొదటి భాగం వినండి...జన్మ మరియు పునర్జన్మలపై సాయి ఆలోచనలు  - 1

ఓం శ్రీ గణేషాయనమః, ఓం శ్రీ సరస్వ్వత్యైనమః, ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమః. 

శ్రీ సాయి సత్ చరిత్ర 10 మరియు 15వ. అధ్యాయాలలో తాను తన భక్తులకు బానిసనని, తాను అందరి హృదయాలలో నివసిస్తున్నానని చెప్పారు.  అసలు విషయానికి వచ్చేముందు, సాయి బా ని స గా మీకందరకూ నా ప్రణామములు. 

Thursday, 15 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము


15.11.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి 10వ.భాగము వినoడి.

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము  
శ్రీమహావిష్ణువును పూజిస్తున్నాకూడాఆయన భక్తులు పేదరికంతో ఎందుకని కష్టాలు పడుతున్నారనిపరీక్షిత్  మహారాజు,శుకమహర్షిని ప్రశ్నించాడు. 
అశ్వమేధయాగం చేస్తున్న సందర్భములో ధర్మరాజు కూడా శ్రీకృష్ణులవారిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.

Monday, 12 November 2012

కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము


                                             
                                       
12.11.2012 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
                        మరియు 
            దీపావళి శుభాకాంక్షలు
                                   
సాయి బా ని స చెప్పిన కృఇష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము వినండి.

కృష్ణునిగా శ్రీసాయి 9వ. భాగము 

కృష్ణునికి 12 సంవత్సరాల వయసప్పుడు మరొక సంఘటన జరిగింది. ఇంద్రుడికి యాదవుల మీద క్రోధం కలిగింది. వారిపై సుడిగాలుఉరుములు మెరుపులతో పెద్ద కుంభవృష్టిని కురిపించాడు. గోపికలుఇంకా వృధ్ధులందరూ కూడా కష్ణుని వద్దకు వచ్చి తమను ఆ ప్రకృతి వైపరీత్యాన్నుండి రక్షించమని వేడుకొన్నారు. 

Sunday, 11 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగము                                                     


11.11.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దీపావళి శుభాకాంక్షలు
సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి


శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగముమనమిప్పుడు భాగవతంలోని రంతిదేవ మహారాజు చరిత్రను తెలుసుకొందాము. Friday, 9 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 7వ. భాగము


09.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి సత్ చరిత్ర  చదవడం ఒక ఎత్తయితే దానిని అర్ధం చేసుకోవడం మరొక ఎత్తు.  అందుకనే సత్ చరిత్ర పారాయణ అన్నది ఏదో మొక్కుబడిగా అమ్మయ్య ఇవాళ్టికి పారాయణ అయిపోయింది అనుకుని చదివితే ఏవిధమైన లాభము ఉండదు.  చదివినదాన్ని బాగా జీర్ణించుకోవాలి. అర్ధంచేసుకోవాలి. 


Thursday, 8 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము


08.11.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


                                                     

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయిశ్రీకృష్ణునిగా శ్రీసాయి - 6వ. భాగము

ప్రహ్లాదునికి తన తండ్రి హిరణ్యకశిపుని దుష్ప్రవర్తన చాలా క్షోభ కలిగించింది.  మీరు త్రిలోకాలను జయించారు గాని, మీలో ఉన్న అరిష్డ్వర్గాలను జయించలేకపోయారని తండ్రితో అంటు ఉండేవాడు ప్రహ్లాదుడు.