Monday 18 August 2014

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 5వ.ఆఖరి భాగం

   
        

18.08.2014 సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి 
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు 

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 5వ.ఆఖరి భాగం  

ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న సాయి సందేశాలను (ఆఖరిభాగం) వినండి.

మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు  

 

"ఆధ్యాత్మిక రంగలోనికి ప్రవేశించిన తరువాత నీవు నీభార్యలోను, తల్లిలోను, భగవంతుని చూడగలిగిననాడు నీవు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లే". 

Sunday 17 August 2014

మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 4వ.భాగం




17.08.2014 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు తరువాయి భాగం వినండి.

మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 4వ.భాగం 

"అడవిలో ఎందుకూ పనికిరాని మొక్కగా బ్రతికేకన్నా మానవ జీవితం కొబ్బరిచెట్టులాగ పెరిగి సమాజానికి ఉపయోగపడాలి". 

దీనికి బాపూ సాహెబ్ బూటీ జీవితమే ఒక ఉదాహరణ.  బూటి కోటీశ్వరుడు.  బాబాకు అంకితభక్తుడు.  బాబా యిచ్చిన ఆదేశాలను ఆచరణలో పెట్టి తన స్వంత డబ్బుతో సమాధి మందిరాన్ని నిర్మించి కొబ్బరి చెట్టులాగ, ఈనాడు ఎంతోమంది సాయి భక్తులకు ఆదర్శప్రాయుడయాడు.  

Saturday 16 August 2014

మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 3వ.భాగం

     
 (బుల్లి కృష్ణుడికి వెన్నముద్దతో గులాబీ)
      Butter Rose

16.08.2014 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు  

మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 3వ.భాగం

ఈరోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న ఉపన్యాసం తరువాయి భాగం వినండి.

మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 

'ఆధ్యాత్మిక చింతన అనే నిచ్చెనను కొంతవరకూ ఎక్కిన తరువాత అక్కడే నిలబడి ఉండాలి కాని క్రిందకు జారకూడదు '. 

ఈసందేశాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో చూడగలం. వీ.హెచ్.ఠాకూర్ తో బాబా అన్నమాటలు "ఈదారి అప్పాచెప్పినంత సులభమయినది కాదు.  నానేఘాట్ లోయలో ఎనుబోతునెక్కి స్వారీ చేసినంత సులభమూ కాదు.  ఈ ఆధ్యాత్మిక మార్గం మిక్కిలి కష్టమయినది.  ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే దానికి ఎంతో కృషి, సాధన,అవసరం. సరియైన పధ్ధతిలోనే ఆచరిస్తే తగిన ఫలితం లభిస్తుంది".

Friday 15 August 2014

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 2వ.భాగం

      

15.08.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 2వ.భాగం

ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు గారు చెపుతున్న ఉపన్యాసం తరువాయి భాగం వినండి.

మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు 
    

శ్రీసాయి సత్ చరిత్ర 26వ.అధ్యాయంలో గోపాలనారాయణ అంబడేకర్ జీవితంలో బాధ్యతా రహితంగా ఉండేవాడు.  ఇక ముందు ముందు ఎటువంటి కష్టాలనెదుర్కొనవలసి వస్తుందోననే భయంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.  

Thursday 14 August 2014

మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 1వ.భాగం

    
         

14.08.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 

ఈ రోజునుండి సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారి "మానవ జీవితానికి బాబా వారు ఇచ్చిన సందేశాలు" ఉపన్యాసాలు వినండి.  

సాయి.బా.ని.స. కి బాబా వారు కలలో ఇచ్చిన సందేశాలకు, ఆయన ఆలోచనలకు శ్రీసాయి సత్ చరిత్రలో బాబా వారు తన భక్తులకు ఇచ్చిన సందేశాలను ఉదాహరణలుగ ఆయన చెపుతున్న ఉపన్యాసం.   
     

మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు 

 మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు - 1వ.భాగం 
ఓం శ్రీగణేశాయనమః, ఓంశ్రీసరస్వత్యైనమః, ఓంశ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమః

శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని చెప్పారు.  తాను సర్వజనుల హృదయాలలోను నివసిస్తున్నానని కూడా చెప్పారు.  విషయానికి వచ్చేముందు మీఅందరికీ నాప్రణామములు.

ముందుగా మానవ జన్మయొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకొందాము.  భగవంతుడు ఈవిశ్వంలో కోట్లాది జీవరాశులను సృష్టించాడు.  

అందులో మానవులను కూడా  సృష్టించాడు.  పురాణాల ప్రకారం  జీవరాశులన్నీ కూడా జీవనం సాగించి తమతమ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి గాని నరకానికి గాని చేరుకుంటాయి. 
          
 పుణ్యకార్యాలు చేసి స్వర్గప్రాప్తి పొందినవారు స్వర్గములో పుణ్యఫలాలను అనుభవించిన తరువాత మరలా జన్మనెత్తడానికి ఈలోకంలోకి త్రోసివేయబడతారు.  ఎవరయితే పాపకర్మల ప్రభావంతో నరకానికి వెడతారో వారక్కడ శిక్షలను అనుభవిస్తున్నారు.  ఎవరి పాపపుణ్యములు సమంగా ఉంటాయో వారు మరలా మానవులుగా జన్మిస్తున్నారు.  మానవులకు మాత్రమే మోక్షమును పొందడానికి ప్రత్యేకమయిన అవకాశం ఉంది.  జీవులన్నీటికీ కూడా, భయము,నిద్ర, ఆహారము,మైధునం అన్నీ ప్రధానమయిన కార్యకలాపాలు. అది సాధారణం.