Friday 14 November 2014

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢరహస్యాలు - 3


    

14.11.2014 శుక్రవారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢరహస్యాలు - 3
  


ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                              హైదరాబాద్

ముందుగా సాయిప్రేరణ: ఒక్కసారి నన్ను నీరక్షకుడిగా భావించి చూడు, నిన్ను అన్నిరకముల బాధలనుండి విముక్తుడ్ని చేస్తాను. 


3వ.ప్రశ్న: శ్రీసాయి సత్ చరిత్ర ముప్పదిరెండవ అధ్యాయములో శ్రీసాయి అన్న మాటలు: 

"నాగురువు నన్ను ఒక బావి వద్దకు తీసుకొనివెళ్ళి, నాకాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి, బావిలోని నీళ్ళకు మూడు అడుగులు మీద వ్రేలాడదీసిరి.  నాచేతితోగాని, నోటితో గాని, నీళ్ళను అందుకొనలేకుంటిని.  నన్ను ఈవిధముగా వ్రేలాడగట్టి కొంతసేపు తర్వాత బావిలోనుండి బయటకు తీసి ఎట్లుంటివి అని అడిగిరి" ఈ మాటలకు అర్ధము తెలుపగలరు.

జవాబు: మనము ఈ ప్రపంచములోనికి అడుగుపెట్టేముందు మన తల్లి గర్భములో మనము తొమ్మిది నెలలు గడిపిన పరిస్థితి గుర్తు చేసుకొందాము.  తల్లి గర్భములో శిశువు తలక్రిందులుగా తల్లితో ఒక ప్రేగుతో బంధము కలిగియుంటుంది. 
     
       
 శిశువు తల్లి గర్భములోని నీటిలో తేలుతున్నా ఆనీరును త్రాగదు.  ఆశిశువుకు కావలసిన నీరు, గాలి, ఆహారము తల్లితో బంధము కలిగియున్న  ప్రేగు ద్వారా లభించుతుంది.  అంటే శిశువుకు తొమ్మిది నెలలు తల్లి ప్రేగునుండే శక్తిని పొంది నవమాసాలు తర్వాత బాహ్య ప్రపంచంలోనికి తల్లి ప్రేగును తెంచుకొని బయటకు వస్తుంది.


ఈప్రశ్నలో నుయ్యి అనేది ఆధ్యాత్మిక ప్రపంచం.  ఆనూతి గట్టుమీద చెట్టు మన గురువు. మనము కట్టుకొన్న ఆతాడును మన గురువు చేతికి అప్పగించి తలక్రిందుగా తపస్సు చేసుకొనుచున్నాము.  (పూర్వకాలములో మునులు తలక్రిందులుగా కూడా తపస్సు చేసేవారు).  మన తపస్సు ఫలించిన తర్వాత గురువు సాక్షాత్కరించి ఎట్లాగ యున్నావు అని పలకరించటము మన అదృష్ఠము.

శ్రీసాయికి అంకిత భక్తులము అయి సాయిమాత గర్భము (ఆధ్యాత్మిక ప్రపంచము) లో ప్రశాంతముగా జీవించుతు మన గమ్యస్థానమునకు చేరుకొందాము.

జైసాయిరాం
(సర్వం సాయినాధార్పణమస్తు)

మరలా మన బ్లాగులో ప్రచురణ 15 రోజుల తర్వాత జరుగుతుంది.  అంతవరకూ ఇంతకు ముందు ప్రచురించిన సాయిలీలలను మనసారా చదవండి. 

Thursday 13 November 2014

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహస్యాలు - 2

    
      

13.11.2014 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహస్యాలు - 2



ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్ 

ముందుగా సాయి ప్రేరణ: ఒక్కసారి నా సత్ చరిత్రను మననం చేసి చూడు, నీలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నింపుతాను. 


2వ.ప్రశ్న: శ్రీసాయి సత్ చరిత్ర పదకొండవ అధ్యాయము: శ్రీ సాయి అన్నమాటలు "మశీదులో ఈరోజు మేకను కోసెదము, నీకు మాంసము కావలెనా? లేక రొండి (ఎముకలు) కావలెనా?  లేక కప్పూరములు (వృషణములు) కావలెనా? " ఈ మాటలకు అర్ధము తెలుపగలరు. 

జవాబు: మేకమాంసము తినే మాంసాహార సాయి భక్తులు అందరికి తెలిసిన కొన్ని విషయాలను తెలిపెదను.  మేక మాంసము మన శరీరానికి కావలసిన శక్తిని యిస్తుంది.  అలాగే మేక వృషణాలు మన శరీరములో లైంగికపరమైన కోరికకు జనింపచేస్తాయి.  మరి మేక శరీరములోని ఎముకలు మధ్యయున్న "గుజ్జు" మన శరీరములోని ఎముకలకు శక్తిని ప్రసాదించుతుంది.  మన శరీరములోని కండరాలలో శక్తియున్న, లేక లైంగికపరమైన కోరికలను తీర్చుకొనే శక్తి కలిగియున్న అవి భగవంతుని సేవకి లేదా తోటి మానవసేవకి పనికిరాదు.  మన శరీరములోని ఎముకలలో శక్తియున్ననాడే మనము "సూర్యనమస్కారములు, సాష్టాంగనమస్కారము చేయగలము మరియు తోటిమానవునికి సేవ, సహాయములను చేయగలము.  అందుచేత మనము బాబా కోసిన మేకయొక్క ఎముకలను ప్రసాదముగా స్వీకరించి, మన శరీరములోని ఎముకలకు శక్తిని పొంది "మానవసేవయే మాధవసే" అని నిరూపించుదాము.


జై సాయిరాం. 

(రేపు మరొక ప్రశ్న)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Wednesday 12 November 2014

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహశ్యాలు - 1

   
          

12.11.2014 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ముందుగా సాయి ప్రేరణ: ఒక్కసారి నామాటని నలుగురితో పంచుకొని చూడు, నిన్ను అమూల్యమైన మార్గదర్శకుణ్ణి చేస్తాను

శ్రీసాయి సత్ చరిత్రలోని నిగూఢ రహశ్యాలు - 1


ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్ 

1) ప్రశ్న: శ్రీసాయి సత్ చరిత్ర 10వ.అధ్యాయం. శ్రీసాయి అన్న మాటలు - "బానిసలలో బానిసనగు నేను మీకు ఋణగ్రస్థుడను.  మీయశుధ్ధములో నేను ఒక క్రిమిని"

ఈమాటలకు అర్ధమును తెలపగలరు?

జవాబు: శ్రీసాయి తొమ్మిదవ అధ్యాయము, పదవ అధ్యాయములలో అన్నమాటలు గుర్తు చేసుకొందాము.  "నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటియను ద్వంద్వభావమును, భేదమును విడచి నన్ను సేవింపుము".  "ఎవరైతే ప్రేమతో నాకు భోజనం అర్పించి ఆ శేషభుక్తమును భుజించెదరో వారికి నేను ఋణగ్రస్థుడను" మరి మనము భుజించిన ఆభోజనం మన శరీరములోని పెద్ద ప్రేగులోనికి చేరి మలముగా (యశుధ్ధముగా) మారుతుంది.  మానవ శరీరములోని ప్రాణము పోయిన, మన శరీరము (శవము) లోని మలములోని క్రిములలో ప్రాణము యుంటుంది.  బాబా తాను తన భక్తుల మలములోని ఒక క్రిమిని అని అన్నారు.  ఒకవేళ ఈప్రాణములేని శరీరము (శవము) నకు దహనసంస్కారములు చేయకపోయిన మన శరీరము (శవము) లోని మలములో దాగియున్న క్రిములు వేల సంఖ్యలలో వృధ్ధి చెంది ప్రాణము లేని శరీరమును పంచభూతాలలో కలసి పోయేలాగ చేస్తాయి.  అంటే బాబా మన శరీరము (శవము) లోని మలములో దాగియున్న క్రిమి కదా -

మన ప్రాణము పోయిన శరీరానికి (శవానికి) దహనసంస్కారములు ఎవరు చేయకపోయినా మన అశుధ్ధములో క్రిమిగా యున్న బాబా మన శరీరాన్ని (శవాన్ని) పంచ భూతాలలో కలుపుతారు అని గ్రహించాలి.

జై సాయిరాం 

(రేపు మరొక ప్రశ్న) 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Tuesday 11 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం

  
   

11.11.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం

ఆంగ్ల మూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 
  
                

ఈ రోజు సాయి బానిస గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.

ముందుగా సాయిప్రేరణ : 4వ.వాక్యం

ఒక్కసారి నావైపు ఒక్క అడుగువేసి చూడు, నిన్ను ఎల్లప్పుడు అన్ని వేళలా కాపాడుతాను.  


పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలనే ఉద్దేశ్యంతో తల్లి పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంది.  వాటిఫలితం ఉద్యాపన అంటే అన్నదానాలు చేసినప్పుడే లభిస్తుంది.  



ఈవిషయానికి సంబంధించి శ్రీసాయి సత్ చరిత్రలోని ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొందాము.  శ్రీ బీ.వీ.దేవ్ గారి  తల్లి 25, 30 నోములు నోచుకొంది.  తరువాత శ్రీవీ.బీ.దేవ్ గారు మామల్తదారు అనగా తహసీల్ దారు ఉద్యోగం చేసుకొంటూ తల్లి మాటను గౌరవించడానికి ఆమె నోచిన నోములన్నిటికీ ఉద్యాపన అనగా అన్నదానం చేసి తల్లి ప్రారంభించిన మంచి పనులను పూర్తి చేశారు.