Thursday 31 July 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 5వ.భాగం

                        
                 

01.08.2014 శుక్రవారము (హైదరాబాదునుండి)
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న శ్రీసాయి సత్ చరిత్రలోని అంతరార్ధాన్ని వినండి. 
         
                         

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 5వ.భాగం

మూలం: శ్రీరావాడ గోపాలరావు

తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు 


ఆయన కఫినీ చిరిగిందంటే, ఎక్కడో దూరంలో ఉన్న ఎవరో భక్తుడు కష్టాలలో ఉన్నాడన్నదానికి సంకేతం.  ఆభక్తుని కష్టాలనుండి బయట పడవేయటానికే బాబా తన కఫినీ చిరుగులను కుడుతూ ఉండేవారు.  


Wednesday 30 July 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 4వ.భాగం

          
                  
      
30.07.2014 బుధవారం (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత రెండురోజులుగా శ్రీసాయి సత్చరిత్ర తత్వం ప్రచురించడానికి సాధ్యపడలేదు.  కొన్ని స్వంతపనులమీద నరసాపురం వెళ్ళిన కారణంగా వీలుపడలేదు.  ఈ రోజు నాలుగవ భాగం చదవండి.

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 4వ.భాగం

మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 
        

చాంద్ పాటిల్ తన గుఱ్ఱం తప్పిపోయినా మరొక గుఱ్ఱాన్ని కొనుక్కోగలిగిన సమర్ధుడు.  అతను తన భుజం మీద గుఱ్ఱపు జీను వేసుకొని తిరుగుతున్నాడు.  
      

జీను అరిషడ్ వర్గాలకు గుర్తు.  అందుచేత యిక్కడ గుఱ్ఱమంటే భగవంతుని దయ.  9మైళ్ళ తరువాత అతను బాబాను కలుకొన్నాడు.  అనగా దాని అర్ధం నవవిధ భక్తులను ఆచరణలో పెట్టిన తరువాతే అతను బాబాను కలుసుకోగలిగాడు. 


Saturday 26 July 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 3వ.భాగం

    
      
   
27.07.2014 ఆదివారము (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 3వ.భాగం

ఇంతకుముందే నేను శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా చెప్పిన మాటలు మీకు వివరించాను.  బాబా తనమతం 'కబీర్ 'అని చెప్పారు.  కబీర్ 1398 లో జన్మించాడు.  కబీర్ 1518లో మహాసమాధి చెదాడు.  అంటే కబీర్ 120 సంవత్సరాలు జీవించాడు.  హేమాద్రిపంత్ శ్రీసాయి సత్ చరిత్రలో బాబా 1838సం. లో జన్మించి ఉండవచ్చని వ్రాశారు.  
ఇప్పుడు మనం 1838 సం.వెనుకటి కాలానికి వెడదాము.  బాబాకు ముందు ముగ్గురు బాలురు నేతపనివారుగా పని చేస్తున్నారు. 

Friday 25 July 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 2వ.భాగం

       
          
          

25.07.2014 శుక్రవారము (ఒంగోలునుండి )
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 2వ.భాగం

మూలం : సాయి బాని స శ్రీరావాడ  గోపాలరావు 
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 


శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా "నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు నాయజమాని నాపనికి సంతోషించి ఆరువందల రూపాయలు జీతమిచ్చాడు"అని చెప్పారు.  అంటే దానర్ధం బాబా 16 లేక 18 సంవత్సరాల వయసులో 18వ.శతాబ్దంలో  ఆరువందల రూపాయలు జీతంగా సంపాదిచారనా?  ఆరోజుల్లో అది అసాధ్యమనే అనుకొంటున్నాను.  ఆరోజులలో ప్రభుత్వంలో  అత్యున్నత అధికారిగా ఉండే బ్రిటిష్ గవర్నర్ జనరల్ కే నెలకు అయిదు వందల రూపాయల జీతం వచ్చేది.