Friday, 28 April 2017

ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 7

  Image result for images of shirdisai
                 Image result for images of rose hd

28.04.2017  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు –  7
                Image result for images of sai banisa

సంకలనం :  ఆత్రేయపురపు త్యాగరాజు,  ఆల్ ఖైల్ గేట్,  దుబాయి

76.  భగవంతుని తెలుసుకోవటానికి నీలోని ఆత్మను పరిశీలన చేయకుండ నీకళ్ళతో చూసేది ఈ చెవులతో వినేది, నీ నాలికతో మాట్లాడేది మాత్రమే నీకు సహాయపడుతుంది అని భావించటము అవివేకము.
                  Image result for images of shirdi saibaba smiling face
77.  భగవంతుడు ప్రేమస్వరూపుడు.  ఆప్రేమయె మన జీవనానికి మూలాధారము.


78.  ఈ ప్రపంచములో భగవంతుని గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడితీరతాడు.
              
            Image result for images of trees in summer
79.  ఈ ప్రపంచములో వృక్షజాలము బ్రతకటానికి సూర్యరశ్మి ఎంత అవసరమో అలాగే మానవజాతి సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆధ్యాత్మిక శక్తి అంతే అవసరము.
          
            Image result for images of man with spiritual power

     Image result for images of man with spiritual power


80.  నీవు నీకనులతో అన్నిటిని చూడు, అందరితోను కలసిమెలసి జీవించు. కాని దేనిమీద, ఎవరిమీద వ్యామోహం పెంచుకోవద్దు.
                            Image result for images of woman praying god in puja room
81.  నిజమైన భక్తునికి,  భగవంతుడిని ఏవిధముగా పూజించాలి అని నీవు చెప్పనవసరము లేదు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానానికి మధ్యవర్తులు అవసరము లేదు.

82.  మనిషి జన్మించినపుడు భగవంతునిపై నమ్మకముతో జన్మిస్తాడు.  కాని మొదటిసారిగా కనులు తెరచి ఈలోకాన్ని చూసి నూతన వాతావరణములో పెరుగుతు అపనమ్మకము మూటగట్టుకొంటాడు.  ఆ అపనమ్మకమును వదిలించుకోవటానికి మనిషి ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయక తప్పదు.

83.  ప్రాపంచికరంగములో నీవు ధనము సంపాదించి దానిని నీవు దాచిపెట్టినపుడు నీతోటివాడు నిన్ను హింసించి నీధనాన్ని దోచుకుంటాడు.  అదే నీవు అందరి ప్రేమను సంపాదించి దాచుకొన్నపుడు అందరు నీవద్దకు వచ్చి తమకు ప్రేమను పంచిపెట్టమని ప్రాధేయపడతారు.

84.  నీమనసు ఈర్ష్య, ద్వేషాలు, కామ క్రోధాలుతో నిండిపోయినపుడు నీ ఆత్మ అనే దీపముయొక్క చిమ్నీపై ధూళి పేరుకొనిపోయి ఆత్మజ్యోతి నుండి వెలువడే కాంతి తగ్గిపోతుంది.  నీవు నీ మనసులోని కామక్రోధాలు, ఈర్ష్యాద్వేషాలను తొలగించిననాడు తిరిగి నీఆత్మజ్యోతి ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతుంది.

85.  భగవంతుడు తన భక్తులతో అంటాడు.  “నీవు ప్రేమ అనే దీపము వత్తిని సరిచేయి.  నేను ఆ దీపానికి కావలసిన చమురు పోస్తాను.  అపుడు ఆదీపపు కాంతిలో నీవు నన్ను చూడగలవు.
              
         Image result for images of shirdi sai baba idol in small light

86.  భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆయన సృష్ఠించిన ఈవిశ్వమును చూడు.  ఒకవేళ ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి అన్నపుడు మొదటి ప్రయత్నముగా ఈవిశ్వములో ఉన్న నక్షత్రాలను లెక్కపెట్టడము ప్రారంభించు.  ఒకవేళ ఈప్రయత్నములో నీవు విజయము సాధించిన భగవంతుని గురించి తెలుసుకొన్నట్లే.
           
                    Image result for images of universe
(రేపు ఆఖరి భాగం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)Thursday, 27 April 2017

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 6వ.భాగమ్

    Image result for sai baba photo gallery
            Картинки по запросу images of rose flowers

27.04.2017  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

భగవంతుని గురించి సాయిబానిస ఆలోచనలు – 6వ.భాగమ్

                Картинки по запросу images of sai banisa


సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు,  
 email :  tyagaraju.a@gmail.com


76.  నీ జీవితములో నిజమైన ప్రేమను నీవు పొందలేకపోతే ఆ జీవితానికి అర్ధము లేదు.

77.  నీవు భగవంతునిని సర్వస్యశరణాగతిని వేడినపుడు నీకు ఆయన ప్రేమ సామ్రాజ్యములోనికి అడుగుపెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.

                   Image result for images of prostating at shirdi sai baba


78.  భగవంతుని తెలుసుకోవాలి అంటే నిన్ను నీవు మర్చిపోయి ఆధ్యాత్మిక ప్రపంచములో నీ సద్గురువు చేయి పట్టుకొని నడవాలి.

79.  ఈ ప్రపంచములో నిన్ను ఎవరు ప్రేమించటములేదు అని బాధపడేకన్నా ముందుగా నీవు భగవంతుడిని ప్రేమించినావా అని ఆలోచించు.

80.  ఈ ప్రపంచములో నీవు సంపాదించినది అశాశ్వతం.  అదే భగవంతుడు ఇచ్చినది శాశ్వతము.

81.  నీవు సంపాదించినది ఇనపపెట్టెలో దాచుకో,  కాని భగవంతుడు ఇచ్చినది నీహృదయములో దాచుకో.

82.  నీవు నివసించుతున్నది భగవంతుడు నీకు ఇచ్చిన శరీరము.  తిరిగి ఈ శరీరాన్ని ఆయనకు ఒకనాడు అప్పగించవలసినదే అని గ్రహించు.

83.  భగవంతుని తెలుసుకొన్నవాడు భగవంతుని అంశముగానే జీవించుతున్నాడు.  ఆఖరిలో భగవంతునిలో ఐక్యమగుతున్నాడు.

84.  భగవంతుడిని ప్రేమించినవాడే భగవంతుడిని తెలుసుకోగలగుతున్నాడు.85.  నీవు పీల్చే ప్రతి శ్వాస, నీశరీరములోని ప్రతి కదలిక భగవంతుని ఇఛ్ఛానుసారమే జరుగుతున్నాయి అని గ్రహించు.


                 Image result for images of prostating at shirdi sai baba

86.  నీదృష్ఠిలో భగవంతుని పూజించటానికి ఉత్తమ సమయము సూర్యోదయము.  కాని ఆయన నీపూజలను స్వీకరించడానికి ఎల్లవేళల ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు.

87.  భగవంతునినుండి నీకు ఏమికావాలో వాటిని కోరుకో.  కాని, ఆయన నీకు ఏదో ఒక సమయములో తనకు ఇష్ఠమైనది ఇస్తాడు.  దానిని మాత్రము తిరస్కరించకు.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Sunday, 23 April 2017

ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 5

 Image result for images of shirdi saibaba
              Image result for images of roses hd
23.04.2017  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస ఆలోచనలు – 5
      Image result for images of sai ba nisa

సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖై గేట్,  దుబాయి

51.  నీలోని ఆత్మ ఎల్లవేళల పరమాత్మ గురించి ఆలోచించుతూ ఉంటే ఆ పరమాత్ముడు  సదా నీలోనే ఉంటాడు.

52.  ఆధ్యాత్మికము ఎక్కడో పుస్తకాలలో వ్రాసి ఉండలేదు.  నీలో భగవంతుని గురించి తపన ప్రారంభము కాగానే భగవంతుడే  తన గురించి నీహృదయము అనే పలకమీద వ్రాసుకొంటాడు.53.  వైజ్ఞానిక రంగములో నీవు ఎంత దూరము ప్రయాణించినా భగవంతుని ఉనికిని కూడ తెలుసుకోలేవు.  అదే ఆధ్యాత్మికరంగ ప్రయాణములో భగవంతుని చేరగలవు.

54.  బాధలలో ఉన్నవానికి నీ ప్రేమను పంచు.  అది వాని బాధలను మరచిపోయేలాగ చేస్తుంది.  నీకు తృప్తిని ప్రసాదించుతుంది.

55.  నీమనసులో అసూయ, ద్వేషము ఉన్నంతకాలం నీవు ఎదుటివానిని ప్రేమించలేవు.  భగవంతుడిని దర్శించలేవు.

56.  భగవంతుడు దొంగలలోను, దోపిడిదారులలోను, అందవిహీనులలోను ఉన్నాడు.  నీలోని విజ్ఞతను ఉపయోగించి వారితో మసలుకో.

57.  నీలోని ఆత్మను నీలోని ఆలోచనలతోనే ఉద్దరించగలవు.  అందుచేత నీమనసులో ఎల్లపుడు మంచి ఆలోచనలతో నిండి ఉండని. 

58.   నీవు విధి వ్రాసిన తలరాతను చెరపలేవు.  కాని నీమనసులోని మంచి ఆలోచనలతో నీజీవన విధానమును మార్చగలవు.

59.  ఔషధ గుణాలు గల మొక్కను ఏప్రాంతములో పాతిన ఆ వాతావరణానికి తగినట్లుగా ఎదుగుతుంది.  కాని దానిలోని ఔషధ గుణాలను మార్చుకోదు.  అలాగే మంచి నడవడిక గల మానవుడు ఏదేశములో ఉన్నా తన మంచితనాన్ని విడనాడడు.

60.  నీ ఆత్మ శరీరము అనే వస్త్రాన్ని ధరించుతుంది.  అలాగే నీశరీరము సాలెవాడు నేసిన వస్త్రాన్ని ధరించుతుంది.  ఒకనాడు ఈశరీరము మరియు నీవు ధరించిన వస్త్రము మట్టిలో కలసిపోవలసినదే.

61.  ఒక మంచుగడ్డను ఉష్ణప్రదేశములో నీవు ఉంచినపుడు అది నీరుగా మారి అనేకమంది దాహాన్ని తీర్చుతుంది.  అదే విధముగా నీమనసులోని ఆలోచనలను మంచి మార్గములో ఉంచినపుడు నీఆలోచనలు సమాజములోనివారికి ఉపయోగపడతాయి.

62.  ఈత చెట్టుకు కొమ్మలనిండ ముళ్ళు ఉన్నా ఆ చెట్టు మానవాళికి తినడానికి తియ్యటి ఈతపళ్ళను ఇస్తుంది.  అలాగే నీవు శత్రువుగా భావించే వ్యక్తిలో కూడా ఎక్కడో మంచితనము దాగి ఉంటుంది.  నీవు ఆమంచితనాన్ని అర్ధము చేసుకోవడానికి ప్రయత్నించు.

63.  బంగారము ఈ ప్రపంచములో ఏప్రాంతములో ఉన్నా దాని విలువ ఎన్నటికి తరగదు.  అలాగే ఈమానవాళిలో మహాత్ములు ఏదేశములో ఉనా వారి గొప్పతనము తరగదు.

64.  ఈప్రపంచము సూర్య, చంద్రుల నిర్ధారిత గతివలయములో మనుగడ సాగించుతున్నది.  అలాగే ఆధ్యాత్మిక ప్రపంచములో ఆత్మ, పరమాత్మల వలయములో మానవుడు జీవించగలుగుతున్నాడు.

65. అపనమ్మకము మానవుని జీవితములో చికాకులకు మూలము.  అదే భగవంతునిపై నమ్మకము నీప్రశాంత జీవితానికి మూలాధారము.

(ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)