Showing posts with label కలలలో శ్రీసాయి - 2వ.భాగం. Show all posts
Showing posts with label కలలలో శ్రీసాయి - 2వ.భాగం. Show all posts

Wednesday, 3 September 2014

కలలలో శ్రీసాయి - 2వ.భాగం

   
         

03.09.2014 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 2వ.భాగం

ఈ రోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి తరువాయి భాగం వినండి.

ఆంగ్లమూలం : సాయి.బా.ని.స.శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411


ముందుగా శ్రీసాయి సత్ చరిత్రలోని 28వ.అధ్యాయంలో లాలా లక్ష్మీ చంద్ గురించి తెలుసుకొందాము.  అతనికసలు సాయిబాబా గురించి ఏమాత్రం తెలియదు.  అయినప్పటికీ , 1910వ.సంవత్సరం డిశెంబరు నెలలో అతనికి ఒక కలవచ్చింది.  ఆకలలో అతనికి గడ్డంతో ఉన్న ఒకవృధ్ధుడు కనిపించాడు.  ఆయన చుట్టూ భక్తులు ఉన్నారు.  తరువాత లక్ష్మీ చంద్ తన స్నేహితుడయిన మంజునాధ్ యింటిలో ఒక ఫొటోని చూశాడు. ఆఫోటొ షిరిడీ సాయిబాబాది.   ఆఫొటోలో ఉన్న వృధ్ధుడు సరిగా తాను కలలో చూసిన వ్యక్తిలాగే ఉన్నాడు.