23.04.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం మీద మరికొన్ని సందేశాలు.
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -5 వ.భాగమ్
41. ఏదయినా మంచిపని పూర్తి చేయవలసివచ్చినపుడుమధ్యవర్తుల జోక్యమునకు దూరంగ ఉండటము మంచిది. మనమేముఖాముఖీ మనకు కావలసినవారితో మాట్లాడుకుని ఆ పనినిపూర్తి చేసుకోవడం మంచిది
42. కాల చక్రంలో నలిగిపోయి
కాలగర్భంలో ఎందరో కలిసిపోయారు.
నీవు వారందరి గురించి ఆలోచిస్తున్నావా? ఒకనాడు
నేటి వర్తమానంలోని నీవు, నీ వాళ్ళు కూడా
ఇదే విధంగా కనుమరుగవుతారు. అందుచేత
వర్తమానాన్నే నమ్ముకుని ప్రశాంతంగా జీవించు.