20.08.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 14 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
33. అన్నిమతాల సారము ఒక్కటే
16.03.2020 సోమవారమ్
నిన్నటి
రోజున ప్రాపంచిక రంగము మరియు ఆధ్యాత్మిక రంగముల మధ్య ఉన్న తేడాను తెలియజేసాను. ఈ రోజున ఆధ్యాత్మిక రంగములోని సారము గురించి చెబుతాను. ఆధ్యాత్మిక రంగములో మతాలు లేవు కాని అన్ని మతాల
సారము కలసియున్నది. అందుచేతనే మనందరికి భగవంతుడు
ఒక్కడే అని అనేకసార్లు చెప్పాను. ఈ విషయము
నీకు ఉదాహరణతో చెప్పడానికి నిన్ను నీ క్రైస్తవ మత స్నేహితులు అయిన శ్రీ డేవిడ్ పాల్
మరియు రతన్ రాజ్ లను కలుపుతాను.