Friday, 4 September 2015

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 5

                         Image result for images of shirdi sainath
             Image result for images of rose hd

04.09.2015 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 5

ఆంగ్లమూలం : ఆర్ధర్ ఆస్ బోర్న్ 

తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
Image result for images of saibanisa

సంకలనం:        ఆత్రేయపురపు త్యాగరాజు 


శ్రీసాయి అనేకమందికి ఎన్నో విధాల సహాయం చేశారు.  కొంతమందిని శిక్షించారు కూడా.  చాలా మంది ఆయన చేత తిట్లు-చీవాట్లుతోపాటు దెబ్బలు కూడా తిన్నారు.  శ్రీసాయి ఎదుటివాని మనసులోని ఆలోచనలు చెడ్డవైనపుడు అతడు వాటిని ఆచరణలో పెట్టడానికి సమయము యివ్వకుండానె అటువంటి వ్యక్తులను శిక్షించేవారు. 

Thursday, 3 September 2015

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 4


Image result for images of shirdi sainath rain
 Image result for images of rose hd

03.09.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 4

ఆంగ్లమూలం: ఆర్థర్ ఆస్ బోర్న్

తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు

Image result for images of saibanisa

సంకలనం :      ఆత్రేయపురపు త్యాగరాజు

ఆధ్యాత్మిక రంగములో వింతలు, అద్భుతాలు ప్రదర్శించటము అవసరం లేదని భావించవచ్చును.  ఈ విషయములో గురువు వింతలు, అధ్బుతాలు చేయలేదు, చేసినారు అని చర్చించటం మన గర్వానికి నిదర్శనము.  ఈవిషయములో ఎక్కువ చర్చించకుండ గురువు చేసి చూపిన వింతలు అధ్బుతాలతో తృప్తి చెందాలి.  గురువు చుట్టూ యున్న పరిస్థితులను బట్టి భగవంతుని కరుణాకటాక్షణాలు ఆగురువుపై ప్రసరించబడి ఉంటాయి.  అది వేరే విషయం.  ఇది కావలసి చేసే పనులకు వర్తించదు.  

Image result for images of ramanamaharshi

భగవాన్ శ్రీరమణమహర్షి భక్తులయొక్క అనుభవాలు పరిశీలించుదాము.  శ్రీరమణమహర్షి ఈనూతన శకములో ఆవతరించిన యోగీశ్వరులు.  వారు ఏవిధమైన వింతలు, అధ్బుతాలు చేయకుండానే తనను నమ్ముకొన్న భక్తుల కష్ఠాలను, అనారోగ్యాలను తొలగించినారే మరి ఈవిషయముపై శ్రీరమణమహర్షిని ప్రశ్నించితే ఆయన అంటారు, జ్ఞాని అనేవాడు తన ఆలోచనలను నాలుగువైపుల ప్రసరించగలిగిననాడు భగవంతుని శక్తి తనంతటతానే పనిచేయటము ప్రారంభించుతుంది.  ఈవిధమైన ప్రక్రియ న్యాయవివేకమైనది, కాని స్పష్ఠముగా కనిపించనిది.  

Wednesday, 2 September 2015

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 3


      
      
         Image result for images of rose hd



02.09.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఆంగ్ల రచయిత :  ఆర్థర్ ఆస్ బొర్న్

తెలుగు అనువాదం:    సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

Image result for images of saibanisa

సంకలనం:         ఆత్రేయపురపు త్యాగరాజు 


శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 3

శ్రీసాయి తన భక్తురాలి ప్రాణాలు నిలపడానికి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన సంఘటన ఉన్నది.  నిగోజ్ గ్రామంలో పాటిల్ భార్య ప్రేగు వ్యాధితో బాధపడుతున్నది.  ఆనాటిరాత్రి శ్రీసాయి శిరిడీలో చావడిలో నిద్రపోవటానికి శ్రీమహల్సాపతితో కలిసి బయలుదేరారు.  శ్రీసాయి చావడికి చేరుకొన్న తర్వాత శ్రీమహల్సాపతితో అంటారు,

Tuesday, 1 September 2015

శ్రీసాయిరామ చరిత్ర - మధుర ఘట్టములు - 2


         Image result for images of shirdi sainath
       Image result for images of rose hd


01.09.2015 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు 


శ్రీసాయిరామ చరిత్ర - మధుర ఘట్టములు - 2

ఈ రోజు శ్రీసాయి రామచరిత్రలోని గురువు మరియు ఆయన కుటుంబము అనే అధ్యాయములోని కొన్ని ఆసక్తికరమయిన, నాకు నచ్చిన ఘట్టాలను మీముందుంచుతున్నాను.

ఈ అధ్యాయం శ్రీసాయిబాబా యొక్క భక్తురాలయిన శ్రీమతి మేనేజరు యొక్క అనుభవాలతో ప్రారంభమయింది. 



" శ్రీసాయిబాబాను మొదటిసారి ఏవరయినా చూస్తే ఆయన కళ్ళలోని శక్తిని గురించే మాట్లాడేవారు.  ఆయన కళ్ళలో అధ్బుతమైన శక్తి ఉండేది.  ఎవరయినా సరే తీక్షణముగా ఆయన కళ్ళలోకి చూడాలని ప్రయత్నించిన, చూడలేక తల దించుకొనేవారు.  ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివారు శ్రీసాయి తమ గుండెలలోనే కాదు, తమ శరీరములో ప్రతి అణువులోను ఉన్నారు అనే అనుభూతిని పొందేవారు.  శ్రీసాయికి తమ గురించి అన్ని తెలుసు (భూత, భవిష్యత్, వర్తమానాలు) అనే భావన ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివ్యక్తి పొందేవాడు.  అటువంటి సమయములో ఆవ్యక్తికి శ్రీసాయి శరణు కోరడము తప్ప వేరే మార్గము ఉండేది కాదు.    

Monday, 31 August 2015

శ్రీసాయిరామచరిత్ర - 1

             Image result for images of shirdi sai baba
             
          Image result for images of rose hd

31.08.2015 సోమవారం
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

సరిగ్గా నెల రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకి అవకాశం ఏర్పడింది.  ఈ మధ్య కాలంలో బాబావారికి సంబంధించిన పుస్తకం ఒకటి ప్రచురించే పనిలో ఉండటం వల్ల సాధ్యపడలేదు.  అంతా బాబా వారి కార్యమే కాబట్టి ఆలశ్యమయినందుకు మన్నించాలి.  

             Image result for images of arthur osborne writer of the incredible sai baba
ఆర్థర్ ఆస్ బోర్న్ గారు సాయిబాబా వారిపై " THE INCREDIBLE SAIBABA" అనే పుస్తకాన్ని రచించారు.  ఆ పుస్తకాన్ని సాయిబానిస రావాడ గోపాలరావుగారు తెలుగులోకి అనువాదం చేశారు.  నేటినుండి ఆయన అనువాదం చేసిన పుస్తకంలో నాకు నచ్చిన మధురమైన ఘట్టాలని మీముందుంచుతాను.                                                                         
                                                           ఓం సాయిరాం  

ఆర్థర్ ఆస్ బోర్న్ - THE INCREDIBLE SAIBABA 

శ్రీసాయిరామచరిత్ర - తెలుగు అనువాదం : సాయిబానిస రావాడ గోపాలరావు

    Image result for images of saibanisa

సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411 నిజాంపేట్, హైదరాబాద్

శ్రీసాయిరామచరిత్ర

శ్రీసాయిభక్తులకు నమస్కారములు: 

శ్రీషిరిడీ సాయిబాబావారి జీవిత చరిత్రను శ్రీసాయి ఆశీర్వచనాలతో శ్రీహేమాద్రిపంత్ గారు 1930వ.సంవత్సరంలో పూర్తి చేశారు.  ఈనాడు కోటానుకోట్ల మంది సాయి భక్తులు ఈగ్రంధమును అనేక భాషలలో శ్రీసాయిబాబా జీవితచరిత్రగా అనువాదము చేసుకొని నిత్యపారాయణ గ్రంధముగా స్వీకరించి, తమ జన్మ సార్ధకము చేసుకొనుచున్నారు.  1930వ.సంవత్సరము తరువాత అనేకమంది రచయితలు శ్రీసాయిబాబా జీవితచరిత్రను అనేక భాషలలో తమ స్వంత ఆలోచనలను మేళవించి వ్రాసారు.  నేను అనేకమంది రచయితలు శ్రీసాయిబాబాగారిపై వ్రాసిన పుస్తకాలను చదివాను వాటన్నిటిలో నామనసుకు హత్తుకుపోయిన పుస్తకము ఆర్థర్ ఆస్ బోర్న్ గారు ఆంగ్లభాషలో వ్రాసిన 'THE INCREDIBLE SAIBABA'  అనే పుస్తకము.  ఆంగ్ల పరిజ్ఞానము కలవారు ఆపుస్తకమును చదవమని కోరుతున్నాను.  తెలుగుభాషకే పరిమితమయిన సాయిభక్తులకు ఉపయోగపడే విధముగా ఆర్ధర్ ఆస్ బోర్న్ గారు వ్రాసిన పుస్తకముపై నా ఆలోచనలు, విశ్లేషణలు మీకు అందచేస్తున్నాను.  స్వర్గవాసియైన శ్రీఆర్ధర్ ఆస్ బోర్న్ గారి ఆత్మకు శాంతికలగాలని శ్రీసాయినాధులవారిని ప్రార్ధించుచున్నాను. ప్రతిసాయిభక్తుడు ఈ పుస్తకమును కొని చదవాలి. 

శ్రీసాయి సేవలో 
సాయిబానిస