05.07.2020 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు
గురుపౌర్ణమి
శుభాకాంక్షలు
ఈ
రోజునుండి బాబాగారు సాయిబానిస గారికి ప్రసాదించిన ‘శ్రీసాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలను’
సాయి భక్తులందరికి అందజేస్తున్నాను.
శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్
-
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
- సాయిదర్బార్,
హైదరాబాద్
ముందుమాట
నాపేరు శ్రీమతి రావాడ మధుగోపాల్.
నాభర్త
సాయిబానిస రావాడ గోపాలరావుగారు కంటిచూపు మందగించటంతో ఇంటికే పరిమితము అయి సాయిదర్బార్ పనులునుండి 30.01.2020 నుండి పూర్తి విశ్రాంతి తీసుకోసాగారు.
12.02.2020 నాడు
శ్రీసాయి వారికి సాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను ఓ గంపనిండా పోసి ఇచ్చారు.ఆ గంపనిండా ఉన్న ముత్యాలను రోజు ఒక ముత్యాన్ని రాత్రి నిద్రించేముందు తన శిరస్సుపై పెట్టుకొని నిద్రించమన్నారు.