19.07.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
9. బాలి
దేశములో శివరాత్రి
21.02.2020 శుక్రవారమ్ (శివరాత్రి)
నిన్నటిరోజున నీకు భారతదేశములోని రామేశ్వరం మరియు శ్రీరాములవారి పల్లెలను చూపించాను.
ఈ
రోజున నిన్ను మరపడవలో రామేశ్వరం నుండి బాలి (వాలి) దేశానికి తీసుకొని వెడతాను.
అక్కడ
నీకు రామాయణ నాటకము, శ్రీరామాలయ ప్రాంగణములో శివపార్వతుల నృత్యము మరియు నీ ఇష్టదేవత అయిన కామధేనువును చూపించుతాను నాతో రా అన్నారు ఫకిరు సాయిబాబా.