Saturday, 30 June 2012

సాయి.బా.ని.స. అనుభవాలు - 23


      

        
                                           
01.07.2012  ఆదివారము


ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు



సాయి.బా.ని.స. అనుభవాలు -  23


మన సాయి బంధువులందరూ ఇంతకుముందు బాబాతో సాయి.బా.ని.స.అనుభవాలు చదివారు.  ఈ రోజునమరికొన్ని అనుభవాలను మీముందుఉంచుతున్నాను.  16.06.2012తేదీన నేను సాయి..బా.ని.స. యింటికివెళ్ళి ఆయనను  కలిసే భాగ్యం కలిగింది.  ఆరోజున ఆయన స్వయంగాఈ క్రింది అనుభవాలను చెప్పారు. వాటిని యధాతధంగా మీముందుఉంచుతున్నాను.


                             ***
అనుభవం  -  23 ( కలల ద్వారా పొందిన అనుభవాలు)

సాయియే మారుతి

సాయిబానిస అనేక సార్లు సత్ చరిత్ర చదివినపుడెల్ల మహల్సాపతిఖండోబా మందిరం వద్ద "ఆవో సాయి" అని నామకరణం చేసినసంఘటన గుర్తుకు వచ్చి, బాబాకు అంతకు ముందు, మహల్సాపతిపిలవకముందు పేరు లేదా అనే బాధతో రాత్రి కలలో ప్రార్ధించి, బాబానీకు అంతకు ముదు నామమే లేదా? అన్నపుడు నాపేరు లక్షలసంవత్సరాల క్రితం కూడా సాయియే.  కావాలంటే నీదగ్గరున్నటువంటిఆంగ్లేయ డిక్షనరీ లో ఉన్న సాయి అన్న పదానికి అర్ధము చూసుకోఅనిసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపంలో చెప్పారు.  నేను మరుసటిదినము డిక్షనరీ చూడగా సాయి అన్న పదానికి అర్ధము. దక్షిణమెరికాలోని బ్రెజిల్ దేశములోని అడవులలోని కోతులను  (*) సాయి అందురు.  



ఒకానొకపుడు ఈ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారతఖండములన్నియుభూమధ్యరేఖ పై కలిసి ఉండేవి.  బాబా కూడా ధులియా కోర్టులోతనవయస్సు లక్షల సంవత్సరాలని తనని సాయి అని పిలుస్తారనితన తండ్రి పేరు కూడా సాయి అని తెలియచేశారు.  దీనిని బట్టిమనము సాయి వానరులలో అగ్రగణ్యుడయిన మారుతిగా సాయిమారుతి అని పూజిస్తున్నాము. 


(సాయి పాఠకులకు 20 చాంబర్స్ డిక్షనరీ లోని సాయి అన్నపదానికిఅర్ధము ఉన్న పేజీ  833 లింక్ ఇక్కడ ఇస్తున్నాను.  చూడండి.  

లాపిడేషన్:

సాయి.బా.ని.స. సాయి తత్వం మీద అనేక విషయాలుతెలుసుకోవాలనే జిజ్ఞాసతో హైదరాబాదులో ఉన్నటువంటి పేరుప్రఖ్యాతులు కలిగి శ్రీషిరిడీ సాయిపై అనేక పుస్తకాలు రచించిన ఒకభక్తురాలి వద్దకు వెళ్ళి  విషయాలు తెసులుకోవాలనే తపనతో ఉండగా,బాబా గారి అనుమతిని కోరినపుడు, బాబా కలలో సాయి.బా.ని.స.కు దర్శనమిచ్చి, నీవు ఆవిడ దగ్గరకు నా గురించి తెలుసుకోవడానికివెళ్ళినా ఆమె నీపై లాపిడేషన్ ఆపరేషన్ చేయును జాగ్రత్త అని చెప్పివారించినారు. 

మరుసటిరోజు లాపిడేషన్ అనే మాటకు అర్ధము తెలుసుకోవడానికిడిక్షనరీ చూడగా రాళ్ళతో కొట్టి శిక్షించుట అని అర్ధము కనిపించినది. ఆ అర్ధము గ్రహించిన తర్వాత సాయి.బా.ని.స. ఆమె వద్దకువెళ్ళడానికి సాహసించలేదు. 
(  సాయి పాఠకులకు 20 చాంబర్స్ డిక్షనరీ లోని లాపిడేషన్అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ 512 వ.పేజీ లింక్ ఇక్కడఇస్తున్నాను.  చూడండి. 


బ్రోస్:

సాయి.బా.ని.స. ఒకసారి బ్రిటిష్ సాయి భక్తుడు (ఆర్థర్ ఆస్ బోర్న్) రాసిన పుస్తకముపై విశ్లేషణ చేయుటకు ప్రయత్నిస్తుండగా
సాయి.బా.ని.స.కు కఠినతరమయిన ఆంగ్ల భాష పదాలనుఅనువాదము చేయుటకు కష్ఠతరమయిన సందర్భములో బాబాను  ప్రార్ధించగా, బాబా స్వప్న దర్శనములో తెల్లటి సూటు, ధరించి ఒకమల్టీ నేషనల్ కంపనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా దర్శనము ఇచ్చి, సాయి.బా.నిస.ను, తెల్లటి అంబాసిడర్ కారులో  ఒక పెద్ద ఆధునికపరమైన హోటలుకు తీసుకుని వెళ్ళారు.  ఆయనకు "బ్రోస్" అనే వేడిపానీయమును త్రాగడానికి ఇచ్చి ఆశీర్వదించెను.  కలలో ఆవేడిపానీయము త్రాగుటవలన నాలిక కాలిన అనుభూతిని పొందిసాయి.బా.ని.స. నిద్రనుంచి లేచి కూర్చొనెను.  ఉదయమునిద్రనుండి లేచి బ్రోస్ అనే పానీయము గురించి ఎంతమందినిఅడిగినను అర్ధము చెప్పలేకపోయారు.  అపుడు ఆయనదగ్గరఉన్నటువంటి ఛాంబర్స్ 20యత్ సెంచరీ డిక్షనరీ లో బ్రోస్ పదానికిఅర్ధము చూడగా ఈ క్రింది విధముగా ఉన్నది. 
బ్రోస్: వేడి పాలలో ఓట్స్ వేసి అందులో వెన్న, తేనె కలిపినపానీయము.

( సాయి భక్తులకు బ్రోస్ అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ లింక్ 118ఇస్తున్నాను చూడండి )


నీకు జన్మ ఇచ్చిన తల్లే నీపాలిట దేవత:

2000 సంవత్సరము అక్టోబరులో చికాగో  కాన్ ఫరెన్స్ కు(విశ్వసాయి భక్తుల సమ్మేళనము)  వెళ్ళేముందు బాబాసాయి.బాని.సకు తన మాతృమూర్తి రూపములో దర్శనమిచ్చారు.   100 సంవత్సరముల క్రితం, వివాకానందులవారు చికాగోలోఆధ్యాత్మిక ఉపన్యాసము (సర్వమత సమ్మేళనము) ఇవ్వడానికివెళ్ళేముందు, రామకృష్ణ పరమహంసవారు ఆయనకు జగన్మాతకాళికాదేవిని ప్రత్యక్ష దర్శనము చేయించారు.
 
సాయి.బా.ని.స., మరి నేను కూడా చికాగో వెడుతున్నాను కదా,మూడవ అధ్యాయములో త్రిగుణాత్మ స్వరూపము నేనే, జగన్మాతనునేనే అని చెప్పావు కదా, 


మరి నాకు కూడా అమ్మవారి దర్శనము కలిగించు అని అడిగారు.

బాబా  సాయి.బా.ని.స కు ఆయన మాతృమూర్తి రూపములోదర్శనమిచ్చారు.  ఆయన తల్లి సాయి.బా.ని.సకు. మంచి పట్టుచీరకట్టుకుని, నగలతో వచ్చి సాయి.బా.ని.స. ప్రక్కన కూర్చుని,ఎందుకు పిలిచావు అని అడగగా నిన్నెవరు పిలిచారు అనిసాయి.బా.ని.స. తన తల్లిని జగన్మాతగా ఊహించలేక తూలనాడి పంపివేయగా, బాబా దర్శనమిచ్చి నీతల్లే నీజగన్మాత.  ఆమెను నీవుగుర్తించకుండా, కనీసం ఆమెకు నమస్కారము కూడా చేయకపోవడంనీ దురదృష్ఠం అని ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి చెప్పారు.
                            


(*) నా విశ్లేషణ ::


(డార్విన్ సిధ్ధాంతము ప్రకారము శాస్త్రీయముగా చూసినా కోతియే మనకు ఆదిమానవుడు. సాయి ఎప్పుడూ తన గొప్పతనాన్ని చాటుకోలేదు.  ఆ గొప్పతనమంతటినీ తన భక్తులకు సంపాదించి పెట్టారు..  హేమాద్రి పంత్ చేత తన చరిత్రను తానే వ్రాయించుకొని  సాయి సత్ చరిత్రను వ్రాసిన కీర్తిని ఆయనకు సంపాదించి పెట్టారు.  అలాగే "సాయి" అన్న మాట లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నా తన నామధేయాన్ని భక్త మహల్సాపతి నోటివెంట పలికించి మొట్టమొదటగా "సాయి" అన్న పదం ఆయనే పలికారనే పేరు ఆయనకు ఆపాదించి గొప్పవాడిని చేశారు.   ... త్యాగరాజు )


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment