Saturday, 18 August 2012

శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 7



                                                               
                                                  

18.08.2012  శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము)  -  7

56. నీకు ఆకలి వేసినపుడు నీదగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు చేసిభోజనము చేస్తున్నావే - 


అపుడు నీకు తెలియలేదు ఆ అన్నముపెట్టినవాని కులము.  

ఎవరో ప్రేమతో నిన్ను భోజనానికి పిలిచినపుడు ఆపిలిచినవానికులము, మతము గురించి ఆలోచించుతున్నావే, యిది ఎక్కడిన్యాయము.

    - 14.10.96

57. భగవంతుడు నీకు సహాయము చేయదలచినపుడు మానవరూపములో గాని, 
జంతురూపములో గాని నీదగ్గరకు రాక తప్పదు.   












భగవంతుని రాకనునీవు గుర్తించిననాడునీవు చాలాఅదృష్టవంతుడివి. అటువంటి అదృష్టము 
నూటికి, కోటికి ఒకరికిలభించుతుంది. 

    - 11.11.96

58. నీకు అపకారము చేసినవారిని నీవు దూషించటము మానివేసినరోజున 
నేను నీకు ఉపకారము చేయటానికి ఏదో ఒక రూపములో వస్తాను. నీజీవితములో నీకు సుఖశాంతులు ప్రసాదించుతాను.

    - 12.11.96

59. డబ్బు వ్యవహారాలలో మిత్రులు, బంధువులు, శత్రువులుగామారే అవకాశముయున్నది.  అందుచేత డబ్బు వ్యవహారాలుఆచరణలో పెట్టేముందు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి.  హడావిడిపనికిరాదు. 

    - 27.11.96

60. చదువు తెలివితేటలు ఉండికూడా భగవంతుని మరచిపోయివ్యసనాలకు బానిసలుగామారి జీవిత నౌకను కష్టాలకడలిలోనడిపించుతారు కొందరు.  చదువు తెలివితేటలు లేకపోయినాసద్గురుని నమ్ముకొని తమ జీవిత నౌకని సుఖసంతోషాలతో ఆనందసాగరములో నడిపించుతారు మరికొందరు.

    - 13.11.96

61.  సంసారము సాగించటానికి ధన సంపాదన ముఖ్యమే, అలాగఅని బాధ్యతలు విస్మరించి, ధన సంపాదన కోసమే జీవించితే, ఆధనసంపాదనకు అర్ధము లేదు.  అందుచేత నీబరువు బాధ్యతలను పూర్తిచేయటానికి కావలసిన ధనము సంపాదించి బాధ్యతాయుతమైనజీవితము గడపాలి.  

     - 22.11.96
62. ఇతరుల ఆధ్యాత్మిక రంగ ప్రయాణములో నీవు సలహా మాతమేయివ్వాలి.  అంతేగాని వారితో కలసి ప్రయాణము చేయటానికిప్రయత్నించటము తలనొప్పి కొని తెచ్చుకోవటములాంటిది.

    - 27.11.96

63.  నీ పుట్టినరోజు పండుగరోజున విష్ణుసహస్రనామ పారాయణగావించు. 
నీకు. నీపితృదేవతల  ఆశీర్వాదాలు లబించును.

    - 28.11.96

64.  సంసార సాగరములో జీవితనౌక ఒడిదుడుకుల మధ్యప్రయాణము సాగిస్తుంటే, అనౌక మీద విష్ణుసహస్రనామము అనేజండా ఎగరవేయి.  అపుడు ఆ జీవితనౌక ప్రశాంతముగాఆసాగరములో ప్రయాణము సాగించుతుంది.  

    - 28.11.96

65.  ప్రకృతిలో ఉన్న శక్తిని మానవుడు విద్యుత్ శక్తిగా మార్చిప్రాపంచిక సుఖాలు పొందుతున్నాడు.  

అదే మానవుడు ప్రకృతిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి (భగవంతుని శక్తి) నిగుర్తించలేక కష్టాలు, అశాంతి పొందుతున్నాడు. 

    - 01.12.96

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


No comments:

Post a Comment