Monday, 10 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 5వ.భాగం





10.11.2014 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 5వ.భాగం 


ఆంగ్ల మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్

ఈరోజు సాయిబానిస గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.

ముందుగా సాయి ప్రేరణ 3వ.వాక్యం

ఒక్కసారి నాకొరకు బాధను భరించి చూడు, నిన్ను అమితమైన ప్రేమతో ఆశీర్వదిస్తాను.  



భార్యమాటను భర్త గౌరవించాలనే విషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 29వ.అధ్యాయంలో మదరాసు భజన సమాజంవారి విషయంలో తెలుస్తుంది.  భార్య శ్రీసాయిని శ్రీరామచంద్రునిగా చూడగలిగానని భర్తతో చెప్పినపుడు, భర్త ఆమెను అవమానించాడు.  బాబా తనికి కలలో కనిపించి, భార్యను అవమానించడం మంచి పధ్ధతి కాదని తెలియచేశారు.      

Sunday, 9 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 4వ.భాగం

  
      

09.11.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 4వ.భాగం

ఆంగ్ల మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 

ఈ రోజు సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు గారు చెబుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.

      

ముందుగా సాయిప్రేరణ 2వ.వాక్యం

ఒక్కసారి నాకొరకు ఒక్క పైసా ఖర్చుపెట్టి చూడు, నీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండేలా చేస్తాను.

శ్రీసాయి సత్ చరిత్రలో భర్తయొక్క బాధ్యతలు కూడా వివరింపబడ్డాయి.  ముఖ్యంగా భర్త భార్యపై అధికంగా వ్యామోహాన్ని పెంచుకోరాదు.  ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయంలో కనపడుతుంది.  ఖాపర్దే బార్ ఎట్ లా.  అమరావతిలో ప్రముఖ లాయరు, మరియు ఢిల్లీ బార్ కౌన్సిల్ మెంబరు, మంచి వక్త, ధనవంతుడు.  కాని అతనికి భార్యా వ్యామోహం ఎక్కువ. 

Saturday, 8 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 3వ.భాగం

  

08.11.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 3వ.భాగం

ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు 
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                   హైదరాబాద్

ఈ రోజు సాయి  బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.  

మొదటగా సాయిప్రేరణనుంచి కొన్ని మాటలు ఈ రోజునుండి చదవండి.

1. ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టి చూడు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను.


గృహిణి ఆకలితో ఉన్నవారికి గాని, లేక ఏప్రాణికయినా సరే అన్నం పెట్టాలి ఈవిషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 42వ.అధ్యాయంలో బాబా లక్ష్మీబాయితో అన్న మాటల ద్వారా గ్రహించుకోవచ్చు.  బాబా లక్ష్మిబాయితో తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పగా ఆమె తెచ్చిన కూర, రొట్టెను ద్వారకామాయిలో ఉన్న కుక్కకు వేశారు.  అదేమని ప్రశ్నించినపుడు ఆమెతో బాబా, ఆకుక్క ఆకలిని తీర్చడమంటే నా ఆకలిని తీర్చడంవంటిదే అని చెప్పారు.  కుక్కకు కూడా ఆత్మ ఉన్నది.  ప్రాణులు వేరయినా ఆకలి అందరికీ ఒక్కటే.  ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే అని అన్నారు బాబా. ఈవిధంగా గృహస్థాశ్రమంలో గృహిణి బాధ్యతను శ్రీసాయి మనకందరికీ తెలియచేశారు.         

Friday, 7 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 2వ.భాగం

  
07.11.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గృహస్థులకు సాయి సందేశాలు - 2వ.భాగం

 ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
 తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 9440375411
                    హైదరాబాద్ 

ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.       



స్త్రీ తన వివాహం తరువాత పుట్టింటివారిని మరచిపోరాదనె విషయాన్ని శ్రీసాయి సత్ చరిత్ర 12వ.అధ్యాయంలో బాబా మనకందరికీ మంచి సందేశాన్నిచ్చారు.  నిమోన్ కర్ భార్య బేలాపూర్ లో ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళివస్తానన్నపుడు ఆమె భర్త ఒక్కరోజు మాత్రమే ఉండి వచ్చేయమని చెప్పాడు.  అపుడు బాబా  కలగచేసుకొని ఆమెను పుట్టింటిలో నాలుగు రోజులు ఉండి బంధువులందరితోను గడిపిన తరువాత షిరిడీకి రమ్మని చెప్పారు.     


ఆవిధంగా బాబా, స్త్రీ  వివాహమయిన తరువాత తన పుట్టింటివారిని మరువరాదనే మంచి సందేశాన్నివ్వడమే కదా.

Thursday, 6 November 2014

గృహస్థులకు సాయి సందేశాలు - 1వ. భాగం


   
  
06.11.2014 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కార్తికపౌర్ణమి శుభాకాంక్షలు
నెలరోజుల తరువాత మరలా బ్లాగులో ప్రచురణకు సమయం కుదిరింది.  ఈ రోజు సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు శ్రీసాయి సత్ చరిత్ర మీద చేసిన పరిసోధనా వ్యాసం "గృహస్థులకు సాయి సందేశాలు" ప్రారంభిస్తున్నాను.  ఇది చదివిన తరువాత మరలా మరొక్కసారి శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేయండి.  ఈ వ్యాసంలో సాయిబానిస గారు చెప్పిన విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ పారాయణ చేయండి.  సాయి తత్వం మనకు బోధపడుతుంది.  ఓం సాయిరాం.

ఓం శ్రీసాయినాధాయనమహ

గృహస్థులకు సాయి సందేశాలు -  1వ. భాగం 

ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు        

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
                               హైదరాబాద్ 

ఓం శ్రీగణేశాయనమహ, ఓం శ్రీసరస్వత్యైనమహ, ఓంశ్రీసాయినాధాయనమహ 

ఈ రోజు సాయిభక్తులందరికీ, గృహస్థులకు సాయి సందేశాలను గురించి వివరిస్తాను.

వైవాహిక జీవితాన్ననుభవిస్తున్నవారందరూ గృహస్థులే.  శ్రీసాయి సత్ చరిత్ర 10,15 అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసనని తానందరి హృదయాలలోను నివసిస్తున్నానీ చెప్పారు. నాయజమాని సాయినాధుడు మీకు బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసనే.  ముందుగా మీకందరికీ నాప్రణామములు సమర్పించుకొంటూ నా ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను.  సమాజంలో అందరూ కూడా నీతి నియమాలతో జీవనం సాగించడానికి మన పూర్వీకులు గృహస్థాశ్రమ ధర్మాలకనుగుణంగా మనకు ఎన్నో మార్గదర్శక సూత్రాలనందించారు.  ముందుగా మను స్మృతిలోని కొన్ని ధర్మాలను మీకు వివరిస్తాను.        

Monday, 15 September 2014

కలలలో శ్రీసాయి - 9వ.భాగం

  
          

15.09.2014 సోమవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కలలలో శ్రీసాయి - 9వ.భాగం

ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి ఆఖరి భాగం వినండి.

ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411



బాబా తన భక్తులు అధ్యాత్మికంగా ఎదగడానికి, వారిలో వివేక వైరాగ్యాలను పెంపొందించటానికి కలలలో చక్కని అనుభూతులను ప్రసాదించేవారు. 

శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో బాబా స్వయంగా చెప్పిన మాటలు "బ్రహ్మము నిత్యము.  ఈ జగత్తు అశాశ్వతము.  తల్లిగాని, తండ్రిగాని, పిల్లలు బంధువులు ఎవ్వరూ శాశ్వతముకారు.  మనమందరమూ ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాము.   ఒంటరిగానే నిష్క్రమిస్తాము." 

Sunday, 14 September 2014

కలలలో శ్రీసాయి - 8వ.భాగం


14.09.2014 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్స్లు

ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు గారు చెబుతున్న కలలలో శ్రీసాయి వినండి

కలలలో శ్రీసాయి - 8వ.భాగం

ఆంగ్ల మూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411

మనం చేసే పూజలను బాబా స్వీకరిస్తారనటానికి ఆయన కలల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు.  బాబా 1918 విజయదశమినాడు మహాసమాధి చెందారు.  మరునాటి ఉదయం బాబా లక్ష్మణ్ మామా కలలో దర్శనమిచ్చి తన పార్ధివ శరీరానికి హారతి యిమ్మని చెప్పి హారతిని స్వీకరించారు.