Thursday 12 January 2012

సాయి బా ని స డైరీ 1994 (7)


 

13.01.2012  శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బంధువులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

సాయి బంధువులందరూ కూడా మన బ్లాగులో సభ్యులుగా చేరండి.  బ్లాగులో ప్రచురణ అయినప్పుడెల్లా మీ మైల్ కి సందేశం వస్తుంది.  



సాయి బా ని   డైరీ  1994 (7)

25.02.1994

 
నిన్నటిరోజున శ్రీ ఆర్థర్ ఆస్ బరన్ యింగ్లీషులో వ్రాసిన "ది యింక్రెడిబల్ సాయిబాబా" అనే పుస్తకాన్ని తెలుగు భాషలో అనువాదము పూర్తిచేసి శ్రీ సాయి పాదాలకు అర్పించినాను.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని ఆశీర్వచనాలు ప్రసాదించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో కలలో దర్శనము యిచ్చి, నాకు త్రాగటానికి కమ్మటి మజ్జిగ గ్లాసు నిండ యిచ్చినారు.   
 
నేను సంతోషముగా మజ్జిగ త్రాగినాను.  వ్యక్తి అన్నారు.  నా కధలు వ్రాస్తున్నపుడు నీ చేతి వేలు తెగినపుడు ఎవరి దగ్గరకు మందుకోసము వెళ్ళవద్దు.  నీ తెగిన వ్రేలిని నోటిలో పెట్టుకొని చప్పరించు.  నా కధలు వ్రాయటము పూర్తి అయిన తర్వాత నీవు పండరీపూర్ యాత్ర చేయనవసరము లేదు.  పండరీనాధుడు నీ గుండెలలో గూడు చేసుకొని యుంటాడు.  వ్యక్తి మాటలు వింటూయుంటే సంతోషము కలిగి, నిద్రనుండి తెలివి వచ్చినది.  శ్రీ సాయికి నమస్కరించినాను.     



26.02.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము మీద కొత్త పుస్తకాలు వ్రాయాలని కోరిక కలిగినది.  "కొత్త పుస్తకాలు వ్రాయటానికి అనుమతిని ప్రసాదించమని " రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు.  "నీ ఆఫీసులోని గాలి గొట్టాలలో అడ్డంకులు, యిబ్బందులు ఉన్నాయి, ముందు వాటి సంగతి చూసుకొని తర్వాత కొత్త పుస్తాకాలు వ్రాయి"  శ్రీ సాయి విధముగా నా గుండె జబ్బు గురించి హెచ్చరించి నా ఆరోగ్యము కుదుటపడిన తర్వాత కొత్త పుస్తకాలు వ్రాయమని ఆజ్ఞాపించినారు అని భావించినాను.
    
పి.ఎస్.  17.05.1996 నాడు నా గుండెకు బై పాస్ సుర్జరీ జరిగినది.

28.02.1994

నిన్న రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి మంచి విషయాలు చెప్పమని వేడుకొన్నాను.  శ్రీ సాయి సినీ నటుడు కాంతారావు రూపములో దర్శనము యిచ్చి అన్నారు.   
 
"నేను జీవితములో కష్ఠపడి సినీరంగములో ప్రవేశించి బాగా డబ్బు సంపాదించినాను.  అజాగ్రత్తవలన డబ్బు అంతా పోగొట్టుకొన్నాను.  రోజున కారులో లిఫ్ట్ యిస్తేనే బయటకు వెళ్ళే స్థితిలో ఉన్నాను.  జీవితములో కష్ఠాలు, సుఖాలు అనుభవించిననాడే అది నిండు జీవితము అగుతుంది.  శ్రీ సాయి విధముగా హెచ్చరిక చేస్తు జీవుతములో క్రమశిక్షణతో యుండి జాగ్రత్త పడాలని మరియు కష్ఠ సుఖాలను సమ దృష్ఠితో చూడాలని సూచించినారు.   


No comments:

Post a Comment