Monday 2 January 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి 


61.  జీవితము ఒక ఖాళీ కుండ వంటిది.  కుండలో నీరు నింపకపోతే దాని తయారీకి అర్థము లేదు.   అలాగే మానవుడు తన మనసులో భగవంతుని గురించి ఆలోచించకపోతే ఆ జన్మకు అర్థము లేదు.

                                                                                              26.06.93

62.  జీవితము విక్రమాదిత్యుడు - భేతాళుడు కధ లాంటిది.  నీవు విక్రమాదిత్యుడివి.  నీపని నీ గమ్యం (మోక్షము) చేరే వరకు కష్టాలు సుఖాలు అనే భేతాళుడిని మోయటమే.

                                                                                              29.06.93

63.  జీవితములో కోరికలు గోడమీద నిలబడియున్న మేకవండిది.  ఆకుకూరలు, పండ్లు, కూరగాయల గంపలు నేలమీద యున్న లంచాలు వంటివి.  కోరికలను అదుపులో పెట్టలేక లంచాలు తినాలి అనే కోరికతో మేకలాగ గోడ పైనుండి క్రిదకు దూకిననాడు విరిగేది యెవ్రి కాళ్ళు అనేది ఆలోచించాలి.

                                                                                              06.10.93

64.  జీవీతము ఒక సైకిలు ప్రాయణము వంటిది.  ఎల్లపుడు నీ వీవిత భాగస్వామిని వెనుక సీటులో కూర్చుండబెట్టుకొని జీవిత ప్రయాణము కొనసాగించి ప్రయాణములోని కష్ట సుఖాలు పాలు పంచుకో.
                                                                                              10.07.93

65.  జీవితము సముద్ర తీరమువంటిది.  సముద్రానికి పోటు, ఆటు వస్తాయి.  అటువంటప్పుడు సముద్రపు నీరు ఒడ్డుకు విపరీతముగా వస్తుంది.  కొంతసేపటి తర్వాత ఆ సముద్రపు నీరు సముద్రములోనికి వెళ్ళిపోతుంది.  అటువంటి సమయములో కష్టాలు అనే చేపలు, అగంకారము అనే పాములు ఒడ్డున ఉన్న రాళ్ళమీద పడి గిలగిల కొట్టుకొంటాయి.  కాని భగవంతుని అనుగ్రహము అనే ముత్యపు చిప్పలు ఒడ్డున మిగిలి యున్న కొద్దిపాటి నీళ్ళలో ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి.

                                                                                              06.08.93

66.  జీవితము అనే రైలు ప్రాణములో సుఖశాంతులు కావాలి అంటే బంధువులు, స్నేహితులు (రాగ ద్వేషాలకు నిలయాలు) లలో ఎక్కువ పరిచయాలు ఉండరాదు.  ప్రయాణములో నీవు ఎన్ని సామానులు (ఆస్థిపాస్థులు) మోయగలవో అన్ని సామనులు మాత్రమే తీసుకొని టైముకు సరిగా ష్టేషంకు రావాలి.  (టైముకి సరిగా నీ బరువు బాధ్యతలు పూర్తి చేయాలి).  రైలు పెట్టెలో సరిగా కూర్చుని సుఖప్రాయణము చేయాలి.  తలుపు దగ్గర నిలబడి బయటకు అనవసరముగా చూడరాదు.  (అనవస్రపు విషయాలలో తలపెట్టరాదు) అపుడే జీవితము అనేరైలు ప్రయాణము సుఖశాంతులతో సాగిపోతుంది.

                                                                                            09.08.93
67.  జీవితము ఒక రైలు ప్రయాణము వంటిది అని మన అందరికి తెలుసు.  మరి ఈ ప్రయాణానికి అంతము నీకు తెలుసా !  విను, నీ రైలు తిరిగి తిరిగి ఆఖరికి నీవు ప్రయాణము ప్రారంభించిన మొదటి స్టేషన్ కు చరుతుంది.  (తల్లి గర్భము నుండి నీ ప్రయాణము ప్రారంభము అయినది.  మరణము తర్వాత తిరిగి తల్లి గర్భములో చేరుకొంటావు) అదే నీ రైలు ప్రయాణానికి అంతము.

                                                                                            19.09.93

68.  జీవితము ఒక సర్కసు వంటిది.  ఆ సర్కసులో ఊయలమీద ఊగటము జెవితములో కష్టతరమైన పనులు చేయటమువంటిది.  ఊయల ఊగుతుంటే క్రింద పడితే రక్షించటానికి వల ఉండదు.  ఊయల ఊగటము ఆపలేము.  అటువంటి సమయములో నా నామస్మరణ చేస్తూ ఊయల ఊగు.  ఒకవేళ నీవు ఊయలనుండి జారిపడితే నిన్ను రక్షించటానికి నా చేతులు చాచి యుంటాయి.

                                                                                             11.10.93

69.  జీవితము ఒక అంతులేని యాత్ర.  నీవు ఆయత్రలో జన్మలు యెత్తుతున్న ఒక యాత్రికుడివి.

                                                                                             15.10.93

70. జీవితము అనే పడవ ప్రయాణములో భార్య తెరచాప వంటిది.  గాలివాలు బాగా ఉన్నపుడు ఆ తెరచాపను ఎగరవేయాలి.  గాలివాలు లేనపుడు తెరచాప ఎగరవేసిన ఆపడవ ప్రయాణానికి తెరచాప అడ్డముగా మారుతుంది -- జాగ్రత్త.

                                                                                             26.11.93

No comments:

Post a Comment