Sunday 25 August 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 19 వ.భాగమ్


Image result for images of baba preaching
Image result for images of beautiful rose hd

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

25.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 19 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ సాయితో ముఖాముఖీ 18 వ.భాగముపై పాఠకు స్పందన...
1.  శ్రీమతి కృష్ణవేణి చెన్నై

07.08.2019  -  విధివ్రాత
విధివ్రాత గురించి నీజీవితంలో జరిగిన సంఘటనను నీకు గుర్తు చేస్తానునీవు కాలేజీ చదువు పూర్తి చేసి, యవ్వనంలో నీ బంధువుల అమ్మాయిని ప్రేమించావునీవు నీ బంధువుల అమ్మాయిని వివాహము చేసుకునేందుకు నిశ్చయించుకొన్నావు



నీవు నీ ఉద్యోగ ప్రయత్నములో ఉన్న సమయంలో నీ ప్రియురాలు ఆమె తల్లిదండ్రుల బలవంతముతో వేరొక వ్యక్తిని వివాహము చేసుకున్నదికాలక్రమేణా నీవు నీతల్లిదండ్రుల అనుమతితో నీ బంధువులలో వేరొక అమ్మాయిని వివాహము చేసుకున్నావుకాలము గడుస్తుంటే నీవు నీ జీవితములో మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయి భర్త ఆమెను వదలివేసాడు సంఘటన తరవాత ఆ స్త్రీ తన తల్లితో కలిసి నీవద్దకు వచ్చి తనను వివాహము చేసుకోమని కోరిందిఅప్పటికే నీకు వివాహము జరిగిపోయిందినీవు నిస్సహాయస్థితిలో ఉండిపోయావు  ----  ఇది విధివ్రాత

08.08.2019  -  మరణముదహనముపునర్జన్మ

నిన్నటి రోజున నీ సమీప బంధువు మరణవార్త విని నీవు చాలా బాధపడ్డావుసహజమేఅతను నీకంటె వయసులో చిన్నవాడుఅతను ఆర్ధికపరమయిన ఇబ్బందులతో మానసిక వత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడుఅతని పార్ధివశరీరానికి ఈరోజున దహనసంస్కారాలు జరుగుతున్నాయిదహనసంస్కారాలు తరవాత అతను పుర్జన్మ కోసం అతని ఆత్మ ఇంకొక మాతృమూర్తి గర్భములో ప్రవేశిస్తుందిఅతను నూతన జన్మలో తన తీరని కోరికలను తీర్చుకుని సుఖవంతమయి జీవితాన్ని గడుపుతాడుఇతని మరణమునుండి నీవు తెలుసుకోవలసిన విషయాలు ---
జీవితములో అత్యాశకు పోరాదుఉన్నదానితో తృప్తిగా జీవించాలి.

నీకు ఆరోగ్యము కావాలంటే తృప్తి, ప్రశాంత జీవితము పాటించాలి.

09.08.2019  -  శారీరక ధర్మముమానసిక ధర్మము

శారీరక ధర్మము నీ శరీర అవసరాలకే పాటించుఅదే మానసిక ధర్మాలను నీ ఆధ్యాత్మిక ప్రగతికి వినియోగించుఆకలి వేసినపుడు అన్నము తినడం శారీరక ధర్మముఅదే అన్నము తినేటప్పుడు భగవంతునికి అర్పించి నీవు తినటము మానసిక ధర్మము
Image result for images of annam parabrahma swaroopam
Image result for images of annam parabrahma swaroopam






విధముగా నీవు న్నము పరబ్రహ్మ స్వరూపము అని ఎల్లప్పుడూ తలచుకుంటూ ఉండగలవు.
నీవు అన్నము తినేటప్పుడు నీముందుకు ఆకలితో వచ్చిన వ్యక్తి వచ్చినపుడు వానికి అన్నము పెట్టడము భగవంతునికి పెట్టడమే అని గుర్తించు.
నోరులేని జీవాలకు, పక్షులకు ఆహారము పెట్టడము భగవంతునికి అన్నము పెట్టినట్లే.
Image result for images of feeding to birds

10.08.2019  -  జీవితంలో ధనము మరియు శారీరక అందము శాశ్వతము కాదు.

విషయంలో నేను నీకు ఎక్కువగా చెప్పనవసరము లేదునీవు యవ్వనములో ఉన్నపుడు నీవు 1968 లో తీయించుకున్న ఫొటోలు చూడుఎంత అందముగా ఉన్నావో అని సంతోష పడ్డావు


Image result for images of saibanisa

ఈరోజున వృధ్ధాప్యములో నీముఖాన్ని అద్దములో చూడలేకపోతున్నావుకారణము నీకళ్ళలో చూపు మందగించిందిడాక్టరు నీ ఎడమకన్ను పూర్తిగా పాడయిపోయినదని చెప్పాడు కదాఇంకా కుడికన్ను కొంచము కనిపిస్తున్నదిజాగ్రత్తగా డాక్టరు సలహాను పాటించు.

1946 లో జన్మించి 2017  .సం. లో మరణించిన ప్రఖ్యాత హిందీ సినీనటుడిని చూడుమంచి అందగాడుమంచి సినీనటుడుమరణించే సమయానికి అతను ధనమును పూర్తిగా పోగొట్టుకున్నాడుఅనారోగ్యముతో అందవిహీనమయిన శరీరంతో మరణించాడు.

11.08.2019  -  ఈరోజు సాయిబానిసగారు ఆశ్చర్యపడె విషయం చెప్పారుబాబాగారు ఇంక శ్రీ షిరిడీసాయితో ముఖాముఖి కార్యక్రమాన్ని ముగించమని ఆదేశించారు.   --- త్యాగరాజు

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి ముగింపుకు బాబా ఆదేశము

రోజున నీవు నీకంటికి అనారోగ్యముతో కంటిచూపు లేక చాలా బాధపడుతున్నావుఇది నాకు బాధ కలిగించిందిఅందువలన ఇంతటితోశ్రీ షిరిడీ సాయితో ముఖాముఖికార్యక్రమాన్ని ముగించమని ఆదేశిస్తున్నాను
ఇపుడు నాసమాధికి రంగులు వేయడం పూర్తయినదినీవు ఇపుడు నా సమాధిని చూడదలచుకుంటే 1916 .సం.లో జన్మించినగ్రెగరీ పెక్(ప్రఖ్యాత అమెరికా సినీ నటుడు) యొక్క సమాధిని ఇంటర్ నెట్ లో చూడు సమాధి కూడా భూగృహంలోనే ఉన్నది.  
Image result for images of gregory peck tomb

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖిఅనే పుస్తకం ముగింపు వాక్యాలను నా అంకితభక్తుడు ఆత్రేయపురపు త్యాగరాజును వ్రాయమని ఆదేశించుచున్నానుఅతను ముగింపు వాక్యాలు వ్రాయడం పూర్తయిన తరువాత నా ఇతర అంకి భక్తులు చదవడానికి వీలుగా ముద్రణ చేయించమను ముద్రణ కొరకు నా అంకి భక్తులు నాపేరిట గురుదక్షిణ ఇచ్చిన స్వీకరించమను.  ‘శ్రీసాయితో ముఖాముఖిషిరిడీసాయి పుస్తక ప్రపంచములో ముచిత స్థానాన్ని పొందుతుందిఇపుడు నేను నా సమాధినుండి మాట్లాడుతున్నాను.

నా భక్తులకు ఆశీర్వచనాలు తెలియ చేస్తున్నాను.

లోకా సమస్తా సుఖినోభవంతు
వచ్చే ఆదివారం పుస్తకముపై ఫలశృతి ముద్రించబడుతుంది---  త్యాగరాజు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)





1 comment: