Thursday, 18 February 2016

Image result for images of shirdi sai
Image result for images of rose hd
18.06.2016 గురువారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు 
ఈ రోజు ధన సంపాదనపై సాయిబానిసగారి ఆలోచనలు చూద్దాము. 

(ఈ రోజు ప్రచురిస్తున్న ఆలోచనలలో బాబా గారి లీల కూడా చదవండి)

Image result for images of saibanisa

21.07.2009  Image result for images of happy life person

31.  ప్రశాంత జీవితానికి ధనము ప్రధానము కాదుప్రశాంతంగా జీవించాలనే కోరిక ముఖ్యము.   


14.02.2010     
Image result for images of meals and idlis 

32.  పెండ్లిలో అతిధులకోసం వండిన అన్నము, ఇడ్లీలను వంట బ్రాహ్మలు గంజిపౌడరు తయారుచేసే ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం బాధ కలిగించిందిఅన్నం లేక ఆకలితో బాధపడుతున్న అన్నార్తులకు అన్నము, ఇడ్లీలను యివ్వవచ్చును కదా!  

Tuesday, 16 February 2016

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు - 3

  Image result for images of rose hd

16.02. 2016 మంగళవారం 
ఓం సాయి శ్రీసాయి అజయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజు ధన సంపాదనపై సాయి బానిస గారి ఆలోచనలను మరికొన్ని చూద్దాము. 

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు -  3

30.08.2007

21.  ధనానికి గౌరవం యివ్వాలి.  ధనము లక్ష్మీస్వరూపముఆ ధనము మనందరికి జీవనాధారముజీవనాధారానికి భగవంతునిదయ అవసరము.   ప్రశాంతంగా జీవించటానికి కావలసినధనమును ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధించాలి.  భగవంతుడుప్రసాదించిన ధనాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయరాదు.  


Saturday, 13 February 2016

ధన సంపాదన – సాయిబానిస ఆలోచనలు – 2

 
     Image result for images of pink roses

14.02.2016 ఆదివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ధన సంపాదన – సాయిబానిస ఆలోచనలు – 2

ధన సంపాదనపై సాయిబానిస గారి ఆలోచనల గురించి మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాము.  వీటి గురించి మీకొకముఖ్యమయిన విషయం తెలియచేస్తున్నాను.  ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ప్రచురించిన సాయి బానిస గారి డైరేలను మీరు చదివే ఉంటారు.  ఆయన వద్ద ఇంకా కొన్ని డైరీలు ఉన్నాయని వాటిని కూడా బ్లాగులో ప్రచురింపమని నన్ను అడగటం జరిగింది.  ఆవిధంగా ఆగస్టు 2015 వ.సంవత్సరంలో ఆయన తను వ్రాసుకున్న డైరీలలోని కొన్ని ముఖ్యమయిన విషయాలను, ఆలోచనలను నాకు ఫోన్ లో చెపుతున్నపుడు, వాటిని నేను వ్రాసుకోవడం జరిగింది. ఆయన అనుమతితో ఇపుడు వాటిని ప్రచురిస్తున్నాను.  ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రచురణకు శ్రీసాయిబాబావారి అనుగ్రహం ఉన్నదన్న విషయాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.  ముందు ముందు నేను ప్రచురింపబోయే సాయిబానిస ఆలోచనలలో 17.02.2010 తేదీన ఆయనకు వచ్చిన ఆలోచనను మీరు చదవబోతున్నారు.  ఆ ఆలోచన ఆయన నాకు మొబైల్ ద్వారా చెప్పడానికి ఒక గంట ముందుగానె యధాతధంగా అదే ఆలోచన నా మనసులోకి రావడం జరిగింది. సాయిబానిసగారు మొబైల్ లో తన ఆలోచనలను డిక్టేట్ చేస్తుండగా, గంట క్రితం నా మదిలోకి వచ్చిన ఆలోచననే ఆయన చెబుతున్నపుడు ఆశ్చర్యపోవడం మా ఇద్దరి వంతు అయింది. 

దీనిని బట్టి సాయిబాబా వారు ఎవరి చేత ఎప్పుడే పని చేయించుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారనే విషయం ఆ సంఘటన ద్వారా నాకు అర్ధమయింది.

బాబా వారి చమత్కారాన్ని పాఠకులు గ్రహించుకోవచ్చు… ధన సంపాదనపై సాయిబానిస గారి ఆలోచనలపై మీ అభిప్రాయాలను తెలపండి.

ఓమ్ శ్రీసాయిరామ్

Thursday, 11 February 2016

ధనసంపాదన - సాయిబానిస ఆలోచనలు

ధనసంపాదన - సాయిబానిస ఆలోచనలు 

Image result for images of saibanisa

ఈ రోజునుండి ప్రాపంచిక రంగములో ధన సంపాదనపై సాయి బానిస శ్రీరావాడ గోపాలరావు గారి  ఆలోచనలు తేదీల వారీగా ప్రచురిస్తున్నాను.  ఇవి చదివి మీ అభిప్రాయాలను నా మెయిల్ కి తెలపవసిందిగా కోరుతున్నాను.

-----త్యాగరాజు - tyagaraju.a@gmail.com
                     9440375411
21.01.1999

1.  ఇతరుల సిరిసంపదలను చూసి నీవు నీజీవితాన్ని కష్టాలపాలు చేయకు.  నీకు ఉన్న సగము రొట్టి తిని జీవించు.

2. తల్లిదండ్రులు, పిల్లలు, వారిమధ్యన ధన సంపాదన వ్యవహారాలు గత జన్మలోని ఋణానుబంధం వలన కలుగుతూ ఉంటాయి.  నీవు నీ పిల్లలకు ఆస్తినిచ్చిన, లేదా నీ కుమారుడు నీకు పది రూపాయలు యిచ్చినా, అవి గత జన్మలోని ఋణానుబంధ మహత్మ్యమే.

3.  నేడు సాయిభక్తిని వ్యాపారసరళిలో అమ్ముతున్నారు.  అటువంటివారినుండి దూరంగా ఉండు.
25.02.1999

4. జీవితంలో బంగారాన్ని సంపాదించడం తప్పుకాదు.  ఆ సంపాదన పేరిట బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

24.03.1999

5.  సాయిపేరిట నీవు ఎవరినుండీ ధనాన్ని యాచించకు.  ఎవరయినా సాయి తత్వప్రచారానికి ధనమిచ్చిన దానిని సాయితత్వ ప్రచారానికే వినియోగించు.

30.06.2000

6. మానవత్వాన్ని మంటకలిపి ధన సంపాదన చేసేవారికంటే మానవత్వాన్ని ప్రబోధించే భగవంతుని ప్రతినిధులు (భగవంతునిపై నమ్మకము కలవారు) నాకు ప్రీతిపాత్రులు.
30.07.2000

7. విద్యాదానం చేసే గురువు తన అర్హత ప్రకారము తన జీవితానికి కావలసిన ధనసంపాదన కావించుకోవాలి.  అంతేకాని, తన శిష్యులు తనకంటె ఉన్నత చదువులు చదివి, తనకంటె ఎక్కువ ధనసంపాదన కావిస్తున్నారే అనే భావన రానీయకూడదు.

30.01.2000

8.  గుళ్ళు,గోపురాలకు నీవు ఎంత చందా యిచ్చావు అన్నది ముఖ్యం కాదు.  భగవంతుని పేరిట ఎంతమంది అన్నార్తులకు భోజనం పెట్టావు మరియు భగవంతుని ఆశీర్వచనాలను పొందగలుగుతున్నావు అనేదే ముఖ్యము.
22.03.2002

9.   కొందరు మజ్జిగమెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు.  అదే కొందరు పెరుగన్నం కావాలని కోరుతూ యితరుల గురించి ఆలోచించకుండా పెరుగంతా తామే తినాలని తలచేవారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచించు. 24.07.2002

10  నీకు ఉన్న కండబలంతో సమాజములో విఱ్ఱవీగేకన్నా నీకు ఉన్న అర్ధబలంతో సమాజంలోని అన్నార్తులకు అన్నదానం చేయటం మిన్న.

(మరికొన్ని ఆలోచనలు రేపటి సంచికలో)
 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)