Saturday 13 February 2016

ధన సంపాదన – సాయిబానిస ఆలోచనలు – 2

 
     Image result for images of pink roses

14.02.2016 ఆదివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ధన సంపాదన – సాయిబానిస ఆలోచనలు – 2

ధన సంపాదనపై సాయిబానిస గారి ఆలోచనల గురించి మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాము.  వీటి గురించి మీకొకముఖ్యమయిన విషయం తెలియచేస్తున్నాను.  ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ప్రచురించిన సాయి బానిస గారి డైరేలను మీరు చదివే ఉంటారు.  ఆయన వద్ద ఇంకా కొన్ని డైరీలు ఉన్నాయని వాటిని కూడా బ్లాగులో ప్రచురింపమని నన్ను అడగటం జరిగింది.  ఆవిధంగా ఆగస్టు 2015 వ.సంవత్సరంలో ఆయన తను వ్రాసుకున్న డైరీలలోని కొన్ని ముఖ్యమయిన విషయాలను, ఆలోచనలను నాకు ఫోన్ లో చెపుతున్నపుడు, వాటిని నేను వ్రాసుకోవడం జరిగింది. ఆయన అనుమతితో ఇపుడు వాటిని ప్రచురిస్తున్నాను.  ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రచురణకు శ్రీసాయిబాబావారి అనుగ్రహం ఉన్నదన్న విషయాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.  ముందు ముందు నేను ప్రచురింపబోయే సాయిబానిస ఆలోచనలలో 17.02.2010 తేదీన ఆయనకు వచ్చిన ఆలోచనను మీరు చదవబోతున్నారు.  ఆ ఆలోచన ఆయన నాకు మొబైల్ ద్వారా చెప్పడానికి ఒక గంట ముందుగానె యధాతధంగా అదే ఆలోచన నా మనసులోకి రావడం జరిగింది. సాయిబానిసగారు మొబైల్ లో తన ఆలోచనలను డిక్టేట్ చేస్తుండగా, గంట క్రితం నా మదిలోకి వచ్చిన ఆలోచననే ఆయన చెబుతున్నపుడు ఆశ్చర్యపోవడం మా ఇద్దరి వంతు అయింది. 

దీనిని బట్టి సాయిబాబా వారు ఎవరి చేత ఎప్పుడే పని చేయించుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారనే విషయం ఆ సంఘటన ద్వారా నాకు అర్ధమయింది.

బాబా వారి చమత్కారాన్ని పాఠకులు గ్రహించుకోవచ్చు… ధన సంపాదనపై సాయిబానిస గారి ఆలోచనలపై మీ అభిప్రాయాలను తెలపండి.

ఓమ్ శ్రీసాయిరామ్




 ధన సంపాదన – సాయిబానిస ఆలోచనలు – 2

22.05.2003

11.  నీవు ఎంతధనవంతుడవయినా నీప్రయాణంలో యినుముతోచేసిన దిక్సూచి యంత్రాన్ని మాత్రమే వాడాలి.  బంగారంతో చేసినదిక్సూచి యంత్రం పనిచేయదు.  అలాగే నీ అంతిమ యాత్రలో నీగమ్యానికి నిన్ను చేర్చేది భగవన్నామ స్మరణ మాత్రమే.  అంతే గానినీ సిరిసంపదలు కావు.
Image result for images of namasmaran


24.04.2004
          Image result for images of meals in plate

12.  మనం భోజనం చేసే సమయంలో మన పళ్ళెంలో లేనిపదార్ధాల గురించి బాధపడేకన్నా పళ్ళెంలో ఉన్న పదార్ధాల గురించేఆలోచిస్తూ భగవంతునికి కృతజ్ఞతలు  తెలుపుకుంటూ భోజనంచేయాలి.  అదే విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి

24.06.2004
Image result for images of book shops in shirdi

13.  ఆనాటి షిరిడీ నాతత్వ బోధనలకు నిలయము.  నేటి షిరిడీనాతత్వ బోధనల విక్రయకేంద్రము.  ఇది కాలపురుషుని మాయ


16.12.2004

Image result for images of saraswati kataksha

14.  విద్యార్ధికి చదువు విషయంలో సరస్వతీ కటాక్షముముఖ్యము.   విద్యార్ధి దగ్గిర ఎంత ధనము ఉన్నా  విద్యార్ధివిద్యాభ్యాసానికి పనికిరాదు.  అందుచేత విద్యా దానము కోసము నీ దగ్గిర ఉన్న ధనాన్ని వెచ్చించి సరస్వతీ కటాక్షము పొందు

19.01.2005

15.  తలకు మించిన బరువు మోయవద్దు.  అలాగే సంపాదనకుమించిన ఖర్చు చేయవద్దు.  పొరపాటున అప్పుచేసి ఏ వస్తువులనయినా కొన్నా వాటిని తిరిగి అమ్మివేయడానికివెనకాడవద్దు.  
 
17.09.2005

16.   సమాజంలో కోటీశ్వరులు తమ యింటిముందు విమానాన్నినిలబెట్టుకుని అందులో ప్రయాణం చేయగలరు.  అందులో విందులు,వినోదాలు చేయగలరు.  కానివారు అంతిమశ్వాస తీసుకునేసమయంలో ఏ  విమానంలో భగవంతుని చేరగలరు?  అందుచేధనికుడయినాబీదవాడయినా సద్గురువు కృపను సంపాదించిఆయన పంపే విమానములో భగవంతుని చేరుకోవాలి.  

01.01.2006

17. ధనవంతులకు ఎల్లవేళలా ధన సంపాదన పైనే మనసుఉంటుంది.  ఆధ్యాత్మిక చింతన కలవారు ధనవంతులతో స్నేహముచేసిన ధనము మాట దేవుడెరుగుచీకాకులు మాత్రమే మనకుమిగులుతాయి.  ఆధ్యాత్మిక జీవితంలో నీవు ప్రగతి సాధించాలంటేధనవంతులకు దూరంగా ఉండు.    

03.07.2007

18.  ధనము సంపాదించి దానిని సద్వినియోగం చేస్తున్నశ్రీమంతులను సమాజానికి పరిచయం చేసేది శ్రీ సాయిబాబాయే.

29.07.2007

19.  బీదవాడు తనకు ఉన్నదానితోనే తన కుటుంబ సభ్యులతోపంచుకుని సుఖశాంతులతో జీవిస్తున్నాడేమరి మనిషిసుఖశాంతులతో జీవించడానికి బీదరికం అడ్డు కాదని గ్రహించు.

           Image result for images of krishna tulabharam

20.  రుక్మిణిదేవి తన ప్రేమతోనుభక్తితో ఒక తులసిదళాన్నిశ్రీకృష్ణుని తులాభారంలో వేసి శ్రీకృష్ణుని తనవాడిగా చేసుకున్నదిఅదే ధన గర్వంతో శ్రీకృష్ణుని తులాభారంలో తన సంపదను వేసిశ్రీకృష్ణపరమాత్మునిని దూరం చేసుకున్నది సత్యభామ.   

(రాబోయే సంచికలో మీరు చదవబోయే ఆలోచనలు ఏమి ఉంటాయని ఆలోచిస్తూ ఉండండి…ముఖ్యంగా పైన ఉదహరించిన ఆలోచన)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment