Tuesday, 16 February 2016

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు - 3

  Image result for images of rose hd

16.02. 2016 మంగళవారం 
ఓం సాయి శ్రీసాయి అజయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజు ధన సంపాదనపై సాయి బానిస గారి ఆలోచనలను మరికొన్ని చూద్దాము. 

ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు -  3

30.08.2007

21.  ధనానికి గౌరవం యివ్వాలి.  ధనము లక్ష్మీస్వరూపముఆ ధనము మనందరికి జీవనాధారముజీవనాధారానికి భగవంతునిదయ అవసరము.   ప్రశాంతంగా జీవించటానికి కావలసినధనమును ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధించాలి.  భగవంతుడుప్రసాదించిన ధనాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయరాదు.  




08.09.2007

22.  దొంగలు దొంగతనం చేయడానికి నీయింటికి వస్తున్నారనితెలిసిన తరువాతనీవస్తువులన్ని పక్కవాడింట్లో దాచుకోవడం,ఆపక్కవాడు దానిని దోచుకుంటాడా, దాచి ఉంచుతాడా అనే ఆలోచన 
నిన్ను  చికాకు పరుస్తుంది.  అందుచేత నీకు కావలసినంత ధనాన్నిమాత్రమే సంపాదించుకుని నీ 
దగ్గిరే ఉంచుకో.  నీవే  ధనాన్నిదొంగల బారినుంచి కాపాడుకో

23.భుక్తి కోసం కొందరు తమ శరీరానికి సూదులతో రుద్రాక్షలనుగుచ్చుకొని తాము దైవ స్వరూపుల మని చెప్పుకుంటూ ప్రజలనుతమ చుట్టూ తిప్పుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ తమ జీవితాన్నిగడుపుతున్నారు.  వారికి ధన సంపాదన ఒకటే తెలుసు.  వారికిఆధ్యాత్మికము ఏమీ తెలియదు

                 Image result for images of costly house
24.  నీవు నివసిస్తున్న ఇల్లు ఎంత ఖరీదు చేస్తుంది అనిఆలోచించటము అవివేకము.  ఆ యింటిలో నీవు ప్రశాంతముగాజీవించగలుగుతున్నావా లేదా అని ఆలోచించటం వివేకము.

Image result for images of happy life person

Image result for images of happy life person

11.09.2007

25.  జీవితంలో ధనము ఒక్కటే ప్రధానం కాదు.  ప్రశాంత జీవితంగడిపే హక్కు అందరికీ ఉంది.  ప్రశాంత జీవితం గడపడానికికావలసినంత ధనము మాత్రమే సంపాదించి జీవిత ప్రయాణంకొనసాగించాలి.  ధనము ఏ ఒక్కరి సొత్తు కాదని గ్రహించాలి.

15.01.2008

26.  జీవితంలో ధనసంపాదన ఒక్కటే ముఖ్యము కాదుభార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము చాలా ముఖ్యముభగవంతుని నమ్ముకుని జీవించేవారికి సుఖప్రదమయిన ప్రశాంతజీవితము లభిస్తుంది.

              Image result for images of gods photo

   Image result for images of happy life person

23.08.2008

27.  మనిషి జీవితంలో బాగా ధనము సంపాదించగలడు.  సర్వసుఖాలను కొనగలడు.  కానిఅతని మనసులో ఏదో తెలియనిబాధచెప్పుకోలేని బాధతో కుమిలిపోతూ ఉంటాడుఅటువంటివానికి నాతత్వ ప్రచారం చేస్తున్నవారు వెళ్ళి వారికిమనోధైర్యం కలిగించాలి.  
Image result for images of man in depression
                      

02.09.2008

28.  నా విగ్రహాన్ని కొనేటప్పుడు విగ్రహాన్ని మలచడంలో ఆ శిల్పిపడిన కష్టాన్ని చూడు.   కష్టానికి తగిన కూలి అందచేసినప్పుడేనీవు నాకు చేసిన నిజమయిన పూజ అవుతుంది.
               Image result for images of sculpture shirdi sai baba

12.02.2008

29.  అప్పుతీర్చగలము అనే నమ్మకం ఉన్ననాడే అప్పు చేయాలిలేనినాడు అప్పు యిచ్చినవాడు నీపాలిట యముడిగా మారి నీకునరకాన్ని చూపిస్తాడు.

13.09.2008


30.  ధనసంపాదనలో విలువలకు కాలరాసినా ప్రమాణాలకుతిలోదకాలిచ్చినాఅటువంటి ధనసంపాదన (నల్లధనం)తలనొప్పులను మిగులుస్తుంది జాగ్రత్త.   
                  

(మరికొన్ని ఆలోచనలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment