Thursday 18 February 2016

Image result for images of shirdi sai
Image result for images of rose hd
18.06.2016 గురువారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు 
ఈ రోజు ధన సంపాదనపై సాయిబానిసగారి ఆలోచనలు చూద్దాము. 

(ఈ రోజు ప్రచురిస్తున్న ఆలోచనలలో బాబా గారి లీల కూడా చదవండి)

Image result for images of saibanisa

21.07.2009  Image result for images of happy life person

31.  ప్రశాంత జీవితానికి ధనము ప్రధానము కాదుప్రశాంతంగా జీవించాలనే కోరిక ముఖ్యము.   


14.02.2010     
Image result for images of meals and idlis 

32.  పెండ్లిలో అతిధులకోసం వండిన అన్నము, ఇడ్లీలను వంట బ్రాహ్మలు గంజిపౌడరు తయారుచేసే ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం బాధ కలిగించిందిఅన్నం లేక ఆకలితో బాధపడుతున్న అన్నార్తులకు అన్నము, ఇడ్లీలను యివ్వవచ్చును కదా!  


17.02.2010

33.  ధనవంతుడు తనదగ్గిర ఉన్న ధనంతో భవనం నిర్మించడానికి యింజనీరులకు మేస్త్రీలకు డబ్బు యిస్తాడు ధనముతో యింజనీరు మేస్త్రీలు కూలివారిని పిలచి భవనం నిర్మిస్తారుఆభవన నిర్మాణం పూర్తయిన తరువాత భవనము యొక్క నీడలో కూలివాళ్ళు తమ అలసటనను మర్చిపోవడానికి ఒక పదినిమిషాలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారుఇపుడు ఆలోచించి చెప్పు ఆధనవంతుడు గొప్పవాడా లేక కూలివాడు గొప్పవాడా.      

17.02.2010

34.  ఒక మాంసము దుకాణం దగ్గిర ఒక కుక్క మాంసముకోసం ఆశగా ఎదురుచూడసాగిందినేను ఆదుకాణంవానికి డబ్బిచ్చి ఆకుక్క కోరిక తీర్చాను

(నా అనుభవం:  01.08.2015 తారీకున జరిగిన సాయి లీల : సాయిబానిసగారికి బాబా 17.02.2010 నాడు యిచ్చిన సందేశము. సాయిబానిసగారు నాకు, అనగా రోజు 01.08.2015 నాడు మధ్యాహ్నము గం.12.15 నిమిషాలకు చెప్పసాగినారుఆయన చెప్పిన సందేశము యొక్క అనుభూతిని ఆయన చెప్పడానికి ముందే ఉదయం 11.00 గంటలకు అనుభవమయింది రోజు నేను ఉదయం 10 గంటలకు బజారుకు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూండగా దారిలొ ఒక చిన్న మాంసము దుకాణము, దాని ఎదురుగా ఒక కుక్క మాంసము కోసము ఆశగా ఎదురు చూస్తూ ఉండటం కనిపించింది కుక్క కి ముందుకాలు దెబ్బతిని కుంటుతూ ఉంది దుకాణము వాడికి ఒక వందరూపాయలిచ్చి కుక్కకు మాంసము పెట్టమని అడిగితే బాగుండును కదా అని నామనసులో అనిపించిందిసరిగా ఇదే సందేశము సాయిబానిస గారి ద్వారా బాబా ఎపుడో 2010 సంవత్సరము నాడే బాబా ఇచ్చిన సందేశము నేను వినడము, ఇదే అనుభవం నాకు రోజు కలగడం అంతా బాబా ముందే చేసిన ఏర్పాటు కాదాఅందుకనే ఆయన లీలన్నీ విచిత్రంగా ఉంటాయి. --- సంకలన కర్త ... త్యాగరాజు)       

17.03.2010

35.  నీవు తినడానికి కొంచంకూడా దాచుకోకుండా ఉన్నదంతా దానధర్మాల పేరిటే ఖర్చుపెడితే భవిష్యత్తులో వచ్చే కష్టనష్టాలకు నీవే బాధ్యుడివి అని గుర్తించు

29.08.2010

36.  బీదవారి పొట్టకొట్టి సమాజంలో ధనవంతులుగా చలామణి అవుతున్నవారినుండి నీవు ఆర్ధిక సహాయమును పొందిననాడు. నీకు కూడా ఆపాపపు సొమ్ములో వాటా ఉన్నదని గ్రహించు.

06.12.2010

37.  బహుమానాలను వస్తురూపంలోకన్నా చాలామంది ధనరూపంలో ఆశించడం వారికున్న ధనవ్యామోహానికి నిదర్శనము.

06.12.2010

38.  కారులలో తిరిగే ధనవంతులతో స్నేహం చేసి వారిని నీ స్కూటరుమీద కూర్చోబెట్టుకుని తిప్పితే వచ్చేతలనొప్పులకు నీవే భాధ్యుడివి

39.  ధనసంపాదనలో అత్యాశ పనికిరాదుఅది చెడు సహవాసాలకు సంఘ విద్రోహులతో గొడవలకు దారితీసి జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తుంది.  

08.02.2011

40.  జీవితంలో ఏపని చేయాలన్నా ధనము చాలా అవసరముచేతిలో ధనం పెట్టుకుని పనులు ప్రారంభించాలి.

02.03.2011

41.  జీవితంలో డబ్బులు లేకపోయినా ఫరవాలేదుకాని జబ్బులు లేకుండా చూసుకోఆరోగ్యమే మహా భాగ్యముగా గుర్తించు.

13.01.2012

42.  స్నేహం అనేది ఎదుటివానిలోని మంచితనము మానవత్వాలను చూసి చేయాలిఅంతేగాని అతనివద్ద ఉన్న ధనసంపదను చూసి మాత్రం కాదుచరిత్రలో ఎందరో ధనవంతులు నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు

22.05.2012

43.  ధనసంపాదనలో అత్యాశ అనేక చికాకులు కలిగిస్తుందని గ్రహించు
      అప్పు తీసుకున్నవాడు అప్పు తీర్చలేక పరుగులు పెడుతుంటే నేను బాధపడ్డాను

26.05.2012

44.  నేటి ఆస్పత్రులలో సేవాభావం మరచిపోయి ఆసుపత్రులను ఒక వ్యాపార రంగంగా మార్చివేశారురోగాలతో బాధపడుతున్నవారి నుండి డబ్బు గుంజుతున్నారని గ్రహించి చాలా బాధపడ్డానుఇక మానవసేవే మాధవసేవ అని ఎక్కడ చెప్పగలం.  


28.07.2012          Image result for images of spiritual man

45.  కోరికలను అదుపులో ఉంచుకున్నవాడే ఆధ్యాత్మికమార్గంలో సులభంగా ప్రయాణం చేయగలడు.
(ధనసంపాధనపై  ఆలోచనలు సమాప్తం)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




No comments:

Post a Comment