Thursday 30 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 8 వ.భాగమ్

     374 Best Sai baba photos images in 2020 | Sai baba photos, Sai ...
       Beautiful Yellow Roses Hd Wallpapers | Roses Gallery

30.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 8 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
(క్రితం రోజు బ్లాగులో సమస్య ఏర్పడిన కారణం చేత ఈ రోజు ప్రచురిస్తున్నాను)

17.  తీరని కోరికలతో నీవు మరణించిన..
29.02.2020  శనివారమ్
తీరని కోరికలతో నీవు మరణించిన అది సహజ మరణం కాదుఅది అర్ధాంతరముగా ముగిసిన రైలు ప్రయాణము రైలు ప్రయాణములో నీవు చాలా కష్టసుఖాలు అనుభవించావునీ వాళ్ళు నిన్ను మోసము చేసారుదొంగలు నీ ధనాన్ని దొంగిలించారుఇన్ని బాధలతో అశాంతితో నీవు మరణించావు అశాంతి తిరిగి నూతన జన్మకు మూలము అగుతుంది మరుజన్మలో నీవు తిరిగి పగ, ప్రతీకారాలతో జీవించుతావుఅందుచేత వృధ్దాప్యములో పగ, ప్రతీకారములతో జీవించవద్దు.  

Sunday 26 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 7 వ.భాగమ్

        Wallpics Shirdi Saibaba Wallpapers Glossy Photo Paper Poster for ...
      3,353 Black And White Rose Stock Photos, Pictures & Royalty-Free ...

26.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 7 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

14.  త్రాగుడుకు బానిస అయినవాని కధ
26.02.2020  బుధవారమ్
మనిషి జీవితములో ధన సంపాదన సరిగ్గ లేక త్రాగుడుకు బానిస అయినవాని కధ నీకు చెబుతాను.

నీవు పనిచేసిన కంపెనీలో నీ దగ్గర పనిచేసిన ఓ కార్మికుడు, వాని పేరు నరసింగరావు.  వాని కధ ఇప్పుడు చెబుతాను విను.  అతడు స్వతహాగా మంచివాడు అయినా మద్యం త్రాగుడుకు బానిస అయి పనికి సరిగా రాక రోజంతా త్రాగుతూ భార్యపిల్లలను బాధపెడుతూ ఉండేవాడు.

Thursday 23 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 6 వ.భాగమ్

    A Couple of Sai Baba Experiences - Part 281 - Shirdi Sai Baba ...
         Preserved Baby Light Blue Rose | Light blue roses, Blue and purple ...
23.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 6 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
11.  జీవిత గమ్యం
23.07.2020 -  ఆదివారమ్
నిన్నటి రోజున నీ వృధ్ధాప్యము గురించి మరియు నీ జీవిత గమ్యము గురించి చెప్పాను.  రోజున నీ జీవిత రైలు ప్రయాణము చూడు.  నీ రైలుకు 5 బోగీలు ఉన్నాయి.  నీ రైలుబండిని నేను నడుపుతున్నాను.  ఇంజను వెనుక నాలుగు బోగీలలో నీ స్నేహితులు, నీ భార్యపిల్లలు కూర్చొని విందులు, వినోదాలు చేస్తున్నారు.  ఆఖరి బోగీలో నీ పార్ధివ శరీరము పడియుంది.  రైలు బండి నీ గమ్యమునకు బయలుదేరింది.  ఆఖరిబోగీలోని నీ పార్ధివ శరీరాన్ని చూడటానికి నీ ఆత్మ బోగీని పట్టుకొని వేలాడసాగింది.  నీవు నీ శరీరములోనికి ప్రవేశించలేకపోతున్నావు.  రైలు వేగంగా కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్ కు చేరుకొంది.  ఇంక స్టేషన్ తరువాత విశాలమైన సముద్రము ఉంది.  నీవారు నీ అస్తికలను పడవలో పెట్టుకొని సముద్రములో జారవిడిచినారు.

Sunday 19 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 వ.భాగమ్

       Sai Baba of Shirdi - Wikipedia
              light pink rose.jpg (1 comment) Hi-Res 720p HD

19.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

9.  బాలి దేశములో శివరాత్రి
21.02.2020  శుక్రవారమ్ (శివరాత్రి)

నిన్నటిరోజున నీకు భారతదేశములోని రామేశ్వరం మరియు శ్రీరాములవారి పల్లెలను చూపించాను.  రోజున నిన్ను మరపడవలో రామేశ్వరం నుండి బాలి (వాలి) దేశానికి తీసుకొని వెడతాను.  అక్కడ నీకు రామాయణ నాటకము, శ్రీరామాలయ ప్రాంగణములో శివపార్వతుల నృత్యము మరియు నీ ఇష్టదేవత అయిన కామధేనువును చూపించుతాను నాతో రా అన్నారు ఫకిరు సాయిబాబా.