Thursday, 9 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 2 వ.భాగమ్

       SaiBaba The Master: Shyamdas and his Sai experience during sea voyage
       White Rose PNG Deco Image | Gallery Yopriceville - High-Quality ...
09.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు  2 .భాగమ్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
-       సాయిదర్బార్, హైదరాబాద్
14.02.2020  అన్నదానము
నిన్నటి రోజునుండి నిన్ను నేను నాదర్బారులో కుతుబ్ గా నియమించాను.  ఇక ప్రతిరోజు నీవు చేయవలసిన పనులను నీకు తెలియచేస్తాను.  రోజున నీవు అన్నదానముయొక్క ప్రాముఖ్యతను గుర్తించి నీవు భగవంతుని కృపకు పాత్రుడవి కాగలవు.


అన్నము పరబ్రహ్మస్వరూపం.  నీవు భోజనము చేసేముందు భగవంతునికి అన్నమును నైవేద్యముగా పెట్టి ఆతరువాతనే అన్నమును నీవు భుజించు.  
          Annadanam - The sacred tradition of offering food | Get Involved
నీవు ఆకలితో ఉన్నపుడు నీవు భోజనము చేస్తావు.  అదే ఆకలి నీతోటివానిలోను, నీప్రక్కన ఉన్న మూగజీవులలోను ఉంటుంది అని గ్రహించి వాటికి కూడా నీతోపాటు భోజనం పెట్టడమే అన్నదానము.  అన్నదానము బీదవారికే చేయాలి అనే భావన రానీయకు.  నీవు భోజనము చేసే సమయంలో ఒక ధనికుడు ఆకలితో నీఇంటికి వచ్చి భోజనము పెట్టమని కోరిన వానికి కడుపునిండా భోజనము పెట్టు. 

వాని ఆకలిని తీర్చిన తర్వాత వానినుండి ఏమీ ఆశించకు.  భగవంతుడు ధనవంతుని రూపంలో నీయింట అన్నదానము స్వీకరించినారని  భావించు.
ఈనాడు వివాహాది శుభకార్యాలలో వచ్చిన అతిధులకు పిండివంటలతో భోజనము పెడుతున్నారు.  ఆవచ్చిన అందరూ తినేది తక్కువ ఆఖరులో విస్తర్లలో పారవేసేది ఎక్కువ.  
         Are You Wasting Food? Some Tips To Avoid Wastage Of Food
ఇది నాకు చాలా బాధను కలిగించుచున్నది.  నీవు వారలకు మొహమాటము లేకుండ తినగలిగే వంటకాలనే తినమని చెప్పు. నీయింట మిగిలిన పిండివంటలను అనాధలకు, బీదవారికి పంచిపెట్టు.  అదే నిజమైన అన్నదానము అని గ్రహించు.

ఇక నేటి సాయిమందిరాలలో అన్నదానము వ్యాపార సరళిలో జరుగుతున్నది.  ఇది నాకు చాలా బాధ కలిగించుతున్నది.  అన్నదానము చేయదలచిన వ్యక్తి అన్నదానము సమయంలో వచ్చి తన స్వహస్తాలతో ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టిన నేను కూడ వారితోపాటు సహబంతిలో కూర్చొని భోజనము చేసి అన్నదానమును ఆశీర్వదించుతాను.

విశ్లేషణ
1992 .సంవత్సరం శీతాకాలము రాత్రి పదిగంటల సమయంలో ఒక వృధ్ధుడు నా ఇంటి గుమ్మము వద్దకు వచ్చి తనది దగ్గరలోని ఒక పల్లెటూరు అని తను వెళ్లవలసిన బస్సు వెళ్లిపోయినదని, రేపు ఉదయం వరకు బస్సు లేదు, పూట మీఇంట భోజనము తప్పక దొరుకుతుంది అనే నమ్మకముతో వచ్చాను, నాకు ఆకలిగా ఉంది మీరు తినగా మిగిలిన అన్నము, కూర నాకు పెట్టిన సంతోషముగా తిని వెళ్ళిపోతాను అని చెప్పడము నాకు ఆశ్చర్యము కలిగించింది.

నేను వంట ఇంటిలో చూడగా అన్నము కూర మాత్రమే ఉంది.  నేను వృధ్ధునికి ఒక విస్తరాకులో అన్నము, కూర మరియు మామిడికాయ ఊరగాయ పెట్టాను.  వృధ్ధుడు నా ఇంటి అరుగుమీద కూర్చొని కడుపునిండా తిని మంచినీరు త్రాగి మమ్ములను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.  తెల్లవారుజామున నా భర్తకు కలలో బాబా దర్శనము ఇచ్చి నిన్న రాత్రి నీభార్య పెట్టిన అన్నము, కూర చాలా రుచిగా ఉన్నది, కడుపునిండా తిని తిరిగి షిరిడీకి వెళ్ళిపోయాను అన్న మాటలను విన్న నేను చాలా సంతోషించాను.
శ్రీమతి మధు గోపాల్

15.02.2020 సన్యాసాశ్రమము
ఆధ్యాత్మిక రంగములో పయనించేవారు ఆఖరులో సన్యాసాశ్రమము స్వీకరించవలసి ఉండును.  సన్యాసికి దేహముమీద వ్యామోహము, బంధువుల మీద వ్యామోహము, ధనము మీద వ్యామోహము ఉండరాదు.  నిజమైన సన్యాసి సమాజములో కీర్తి ప్రతిష్టలకు పొంగిపోరాదు.  అలాగే కష్టాలకు కృంగిపోరాదు.  సదా భగవంతుని ధ్యానించుతూ సమాజ    శ్రేయస్సుకు పాటుపడుతూ భిక్షాటనపై జీవించాలి.
విశ్లేషణ.
శ్రీ సాయి సత్ చరిత్ర చదివిన ప్రతివారికి సన్యాసి విజయానందుని కధ గుర్తుకు వస్తుంది.  అతడు మద్రాసునుండి మానస సరోవరయాత్రకు బయలుదేరి యాత్ర చాలా కష్టతరమైనదని శరీరవ్యామోహముతో షిరిడీ చేరుకొని బాబా దర్శనము చేసుకొనెను.  అతడు కాషాయ వస్త్రాలు ధరించి తన తల్లిపై మమకారమును వదులుకోలేకుండెను.  బాబా వానిని పిలిచి శరీరము మీద వ్యామోహము తల్లి మీద మమకారము వదలిపెట్టమని సలహా ఇచ్చెను.  అతను బాబా ఆదేశానుసారము భాగవతము పారాయణ చేసి బడేబాబా ఒడిలో తలపెట్టుకుని మరణించెను.
సాయిబానిస.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)



No comments:

Post a Comment