16.07.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు
4 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
7. కాల చక్రములో భూత – భవిష్యత్ – వర్తమానములు
19.02.2020
బుధవారము
నేను
శరీరముతో షిరిడీలో ఉన్న రోజులలో టైటానిక్ అనే అందమైన ఓడలో 1500 మంది సజీవముగా సముద్రగర్భములో
మునిగిపోయినారు. ఈ రోజున చరిత్రలో టైటానిక్
ఒక అందమైన శవపేటికలాగ సముద్ర గర్భములో ఇసుకలో కూరుకుపోయినది. అదే నేటి చరిత్రకు భూతకాలము.
ఇక
వర్తమాన కాలము అంటే నేటి రోజున నీవు, నీ భార్యపిల్లలతో ఆ సముద్ర తీరములో సంతోషముగా
గడుపుతున్న క్షణాలు.
ఇక
భవిష్యత్ కాలము నీ ఊహకు అందని అందమైన సముద్ర కెరటాలు. ఆ కెరటాలు సముద్ర తీరాన్ని ఉన్న రాళ్ళను తాకి తిరిగి
సముద్రములో కలిసిపోతాయి. అందుచేత చేతికి అందని
భవిష్యత్ గురించి ఆలోచించవద్దు.
సముద్రతీరంలో
సంతోషంగా జీవించగలుగుతున్న వర్తమానంలో జీవించటము అలవాటు చేసుకొని, ప్రశాంతముగా నీజీవిత
గమ్యాన్ని చేరుకో. --- బాబా
8. శ్రీరాములవారి పల్లె
20.02.2020 గురువారము
ఈ
రోజున నిన్ను నేను లక్షల సంవత్సరాల క్రితము శ్రీరామచంద్రులవారు లంకపై దండయాత్ర చేయడానికి
ముందు సాగర తీరములో రాతిగుట్టల మీద కూర్చుని ఆదిపరాశక్తిని పూజించి తనకు శక్తిని ప్రసాదించమని
వేడుకొన్న స్థలాన్ని చూపించుతాను రా, అని రామేశ్వరం దగ్గరనుండి పడవలో సముద్రములోని
ఒక చిన్న దీవికి తీసుకొని వెళ్ళారు బాబా.
ఆ దీవి రాతిగుట్టలతో నిండియున్నది. ఆ రాళ్ళపైన ఓ చిన్నగ్రామం వెలసియుంది. ఆ గ్రామములో చిన్న చిన్న వీధులు నీటిలో మునిగియున్నాయి. అక్కడ ఇళ్ళు అన్నీ పెంకుటిళ్ళు. అవి కూడా మూడు అడుగుల నీటిలో మునిగియున్నాయి. ఆ ఇళ్ళ మధ్య ఒక దుర్గామాత మందిరము ఉంది. ఆ మందిరస్థలములో శ్రీరాములవారు శక్తి కోసము తపస్సు చేసినారు అని బాబా ఒక పల్లెటూరివాని రూపంలో తెలుగుభాషలో చెప్పారు.
ఆ దీవిపై ఉన్న పల్లెటూరి పేరు శ్రీరాములవారి పల్లె. ఆ పల్లెకు నేటికీ వంతెన, రోడ్లు లేవు. ప్రజలు చిన్న చిన్న పడవలలో ప్రయాణము చేసి దగ్గరలోని రామేశ్వరంకు వచ్చి సరుకులు కొనుగోలు చేయుచున్నారు. అంతటి చక్కటి ప్రదేశమును నేను ఎప్పుడూ చూడలేదు. ఒకసారి ఆ జగన్మాత మందిరములోనికి వెళ్ళి ఆ దేవికి నమస్కరించుచు ఆనాటి శ్రీరాముడే నేటి మన శ్రీసాయిరాముడు అని భావించాను.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment