30.07.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 8 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
(క్రితం రోజు బ్లాగులో సమస్య ఏర్పడిన కారణం చేత ఈ రోజు ప్రచురిస్తున్నాను)
17. తీరని కోరికలతో నీవు మరణించిన..
29.02.2020 శనివారమ్
తీరని కోరికలతో నీవు మరణించిన అది సహజ మరణం కాదు.
అది
అర్ధాంతరముగా
ముగిసిన రైలు ప్రయాణము.
ఈ
రైలు ప్రయాణములో నీవు చాలా కష్టసుఖాలు అనుభవించావు.
నీ
వాళ్ళు నిన్ను మోసము చేసారు.
దొంగలు
నీ ధనాన్ని దొంగిలించారు.
ఇన్ని
బాధలతో అశాంతితో నీవు మరణించావు.
ఆ
అశాంతి తిరిగి నూతన జన్మకు మూలము అగుతుంది.
ఆ
మరుజన్మలో నీవు తిరిగి పగ, ప్రతీకారాలతో జీవించుతావు.
అందుచేత
వృధ్దాప్యములో
పగ, ప్రతీకారములతో జీవించవద్దు.
నీకు
ఉత్తమ జన్మ కావాలి అంటే వానప్రస్థాశ్రమములో ఏకాంత జీవితము గడపాలి.
భగవాన్
నామము స్మరించుతూ ప్రశాంత మరణము పొంది ఉత్తమ జన్మ సాధించు.
18. అన్నం
పరబ్రహ్మ స్వరూపం
01.03.2020 - ఆదివారమ్
ఇంటి ఇల్లాలు వంటకాలను పరిశుభ్రమైన గిన్నెలలో తయారుచేసి వాటినన్నిటిని మంచి పళ్ళెములో పెట్టి ముందుగా భగవంతునికి నైవేద్యము పెట్టి ఆ తర్వాత తన భర్త, పిల్లలకు పెట్టి తాను భోజనము చేయాలి.
ముందుగా
భగవంతునికి నైవేద్యము పెట్టడానికి కారణము అన్నము పరబ్రహ్మ స్వరూపము.
భగవంతునికి
అర్పించకుండా
మనము ఏమీ తినరాదు అని గ్రహించవలెను.
నేను
ద్వారకామాయిలో
అన్నదానము చేసేటప్పుడు ముందుగా వంటకాలను భగవంతునికి నైవేద్యము పెట్టేవాడిని.
19. అనాధ
ఆశ్రమాలు & వృధ్దాశ్రమాలు
02.03.2020 - సోమవారమ్
నేను శరీరముతో షిరిడీలో జీవించినంత కాలము చినిగిన కఫనీ మరియు భిక్షాటనతోనే జీవించాను.
నేను
మహాసమాధి చెందటానికి ముందు మాత్రము నా భక్తులు నాకు భోజన వసతి మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినారు.
కాని
ఈనాడు బూటీవాడలో నేను ఏనాడు కోరని విధముగా బంగారు కిరీటాలు, బంగారు సింహాసనాలు, బంగారు ఆభరణాలు తయారుచేసి నా పాలరాతి విగ్రహానికి అలంకరించుతున్నారు.
నిజానికి
నా విగ్రహానికి, నాకు తేడా లేదు.
అందుచేత
నేను ఆ బంగారు కిఈటాలు, బంగారు ఆభరణాల బరువు మోయలేకపోతున్నాను.
ఇంత
బరువు బంగారము నా విగ్రహానికి పెట్టేబదులు ఆ ధనముతో నిరుపేద విద్యార్ధులకు వారు చదివే పాఠశాలలలో వారికి మంచి భోజనం పెట్టిన నేను చాలా సంతోషించుతాను.
ఇక
అనేక పట్టణాలలో నా మందిరాలలో నాకు పాలతోను, మామిడిపళ్ల రసాలతోను అభిషేకాలు చేయుచున్నారు.
వాటిని
నా పేరిట వృధ్ధాశ్రమాలలోని పేద వృధ్దులకు త్రాగడానికి ఇచ్చిన వారు సంతోషించెదరు.
వారి
అందరి గుండెలలో ఉన్న నేను సంతోషించుతాను.
అందుచేత ఈ పేద ఫకీరు మాట విని నా పాలరాతి విగ్రహాలకు బంగారు కిరీటాలు, ఆభరణాలు చేయించకండి. పాలతోను, మామిడిపళ్ల రసాలతోను అభిషేకించకండి. నాపేరిట వసూలు చేసిన దక్షిణ సొమ్ముతో పేద విద్యార్ధులకు మంచి ఆహారము పెట్టండి. వృధ్ధాశ్రమాలలోని నిరుపేద వృధ్ధులకు పాలు, పళ్ళు ఇచ్చి వారిని ఆరోగ్యముగా జీవించనీయండి. మీరు నాకు సేవ చేయదలచిన మానవ సేవను చేయండి. మానవ సేవయే మాధవ సేవ అని గుర్తించండి.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment