02.08.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 9 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
20. శ్రీరామనవమి
03.03.2020 మంగళవారము
సనాతన ధర్మాన్ని పాటించే నా భక్తులకు నేను ఇచ్చే సలహా నిత్యము శ్రీరాముని చరిత్రను గుర్తు చేసుకొనేందుకు రామాయణ గ్రంధమును పారాయణ చేయండి.
రామాయణ
గ్రంధమునుండి
తెలుసుకోవలసిన
ముఖ్య విషయాలను గ్రహించండి.
అవి
1) తల్లిదండ్రుల
పట్ల ప్రేమభక్తి భావాలను కలిగిఉండండి.
2) సోదరులతో
ప్రేమతో కలిసి జీవించండి.
3) తోటివారిని
గౌరవించండి. 4) అధర్మమును ఎదిరించండి. 5) ఏకపత్నివ్రతము పాటించండి.
ఈ సలహాను పాటించిన ఈనాడు సమాజము సుఖశాంతులతో విలసిల్లుతాయి.
అందుచేత మీరు శ్రీరామనవమి పండగ చేసుకోండి.
కాలగర్భములో...
21. 04.03.2020 బుధవారమ్
ఇప్పుడు నిన్ను నేను నీ జీవితంలో 60 సంవత్సరాలు వెనక్కి తీసుకొనివెళతాను. నీ జన్మస్థలంలో నీవు నీ తాత, అమ్మమ్మగారి ఇంట గడిపిన రోజులు గుర్తు చేసుకో. ఈనాడు నీ మాతామహులు లేరు. నీ మేనమామలలో నలుగురు మేనమామలు లేరు. నీ పినతల్లులలో ఇద్దరు పినతల్లులు లేరు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు లేరు. నీకు తోడబుట్టిన నీ చెల్లి, తమ్ముడు లేరు. నీకు పిల్లను ఇచ్చిన అత్తమామలు లేరు. నీకు విద్యాబుధ్ధులు నేర్పిన నీ పినతండ్రి లేరు.
వీరందరు నీకు రక్త సంబంధీకులు.
వీరందరు
కాలగర్భములో
కలిసిపోయారు. ఇక
నీ ప్రాణస్నేహితుడు రవి గురించి ఆలోచించు.
నీవు
నీ చిన్నతనం నుండి వారి ఇంట చాలా చనువుగా మసలినావు.
మరి
నీ ప్రాణ స్నేహితుడు రవి లేడు.
వాని,
తల్లి, అక్క, అన్న, మరియు వాని బావగారు లేరు.
అందరు
కాలగర్భములో
కనుమరుగయిపో యారు.
నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో అనేకమంది ప్లేగు, కలరా వ్యాధులతో మరణించారు.
మరి
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి ప్రభావముతో అనేక వేలమంది
మరణించబోతున్నారు. జరుగుతున్న
ఈ సంఘటనలకు నీవు సాక్షి భూతం మాత్రమే.
మృత్యుదేవత
కరోనా రూపంలో వచ్చినా ఆమెను ఎవ్వరూ ఆపలేరు.
అందుచేత
ఆ వ్యాధి సోకకుండ తగు జాగ్రత్తలు తీసుకొంటూ ప్రశాంతముగా జీవించండి.
కాలచక్రము
ఎవరి కోసం ఆగదు.
ఆఖరికి
పుట్టిన ప్రతిజీవి, ప్రతిమనిషి కాలగర్భములో కలసిపోవలసినదే.
22. శ్రీ
పాండురంగ విఠల్
05.03.2020 గురువారమ్
నా చిన్నతనంలో నా పెంపుడు తల్లి నన్ను దయాకిషన్ అని ముద్దుగా పిలిచింది.
నేను
షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో నా భక్తులు నన్ను శ్రీకృష్ణ అవతారముగా భావించి శ్రీపాండురంగ విఠల్ అని పిలిచేవారు.
నన్ను
పాండురంగడుగా
భావించినవారికి
శ్రీ పాండురంగ విఠల్ గా దర్శనము ఇచ్చాను.
ఈనాడు
నీవు నన్ను దయాకిషన్ అని పిలుస్తున్నావు.
నా
భక్తులు నన్ను దయాకిషన్ లేదా పాండురంగ విఠల్ అని పిలిచినా పలుకుతాను.
నిజానికి నా అంకిత భక్తుడు పుండరీకుడు. వాని జీవిత చరిత్రనుండి నా భక్తులు తెలుసుకోవలసినది చాలా ఉంది.
మీరు
మీ తల్లిదండ్రుల సేవను చేసుకొని తరించండి.
పుండరీకుడు
తన ముసలి తల్లిదండ్రుల సేవలో ఉన్న సమయములో నేను వానిని పిలిచినా అతను తన తల్లిదండ్రుల పాదసేవ అనంతరము నా దర్శనానికి వచ్చినాడు.
ఈనాటి సమాజములో నేటి యువత ధన వ్యామోహము, పరస్త్రీల వ్యామోహములో పడి తమ జీవితాలను పాడుచేసుకొనుచున్నారు. నా అంకిత భక్తుడు ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మించిన పాండురంగ మాహాత్మ్యము చిత్రములో ముఖ్య భూమిక పోషించాడు. ఆ సినిమా నేటి సమాజానికి కనువిప్పు కలిగించుతుంది అని నా నమ్మకము. అందుచేత నా భక్తులను దయచేసి శ్రీపాండురంగ విఠల్ మీద తెలుగు భాషలో తీసిన సినిమా శ్రీపాండు రంగ మాహాత్మ్యము చూడమని సలహా ఇచ్చుచున్నాను. అంతటి ఉత్తమ చిత్రము నిర్మించిన స్వర్గీయ శ్రీ ఎన్.టి.ఆర్. ధన్యజీవి.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment