Sunday 23 August 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 15 వ.భాగమ్


   Shop Saibaba Blessing Painting at Low Price | Oilpaintings | Sai Art
     29 Yellow Rose HD Wallpapers | Background Images - Wallpaper Abyss

23.08.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 15 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

34.  మనిషి తన కోసం ఎంత ధనం దాచుకోవాలి?
17.03.2020  మంగళవారము

నీవు, నీ కోసము ఎంత ధనమును దాచుకోవాలి అని ఎప్పుడైన ఆలోచించినావా?  నేను నా జీవిత ఆఖరి క్షణాలలో లక్ష్మీబాయి షిండేకు తొమ్మిది రూపాయలు దానము చేసినాను.  



       Sai Baba- Miracle Maharaj of Shirdi.: LAKSHMIBAI SHINDE
నా అంతిమ యాత్రకు మరియు నా పార్ధివశరీరాన్ని భూమిలో పాతిపెట్టడానికి ఏడు రూపాయలను మాత్రమే నా జేబులో ఉంచుకొన్నాను.  నా భక్తులు ఆ ఏడు రూపాయలతో కొత్త వస్త్రము కొని నా శరీరమునకు చుట్టి బూటీవాడలో గొయ్యి తీసి నా పార్ధివ శరీరాన్ని పూడ్చిపెట్టినారు.  అందుచేత నీవు కూడా నీ మరణానంతరము నీ శరీరానికి  జరిగే అంతిమ సంస్కారాల కోసము కావలసిన ధనమును దాచి ఉంచుకొని ఆ విషయం నీ వారసులకు చెప్పి మరణించు.  ఈ విధముగా చేసిన నీ ఆత్మకు తప్పక శాంతి కలుగుతుంది.

విశ్లేషణ : ఈ రోజున శ్రీషిరిడీసాయి నాకు ఇచ్చిన ఆదేశము ప్రకారము నా బ్యాంక్ ఖాతానుండి నా అంతిమయాత్రకు కావలసిన ధనమును విడిగా తీసి ఉంచినాను.

35.  నీ గతములోనికి తొంగి చూడకు
18.03.2020  -  బుధవారము

నా భక్తులలో కొందరికి తమ గతమును తలచుకొని గొప్పలు చెప్పుకోవటం ఒక అలవాటుగా మారింది.  ఉదాహరణముగా నీ విషయము చెబుతాను.  నీవు 1991 వ.సంవత్సరములో నీ కంపెనీవారు నిన్ను నూతన యంత్రాలను నడపడం నేర్చుకోవడానికి విదేశాలకు పంపినారు.  నీవు విదేశాలలో శిక్షణపొంది నీ కంపెనీలో ఉత్పత్తిని పెంచి నీవు పేరు గడించినావు.  ఇది గతములోని మాట.  నీవు 2000 సంవత్సరములో నీ కంపెనీ నుండి పదవీ విరమణ చేసినావు.  ఈ రోజున నీవు తిరిగి నీవు ఇదివరకు పనిచేసిన కంపెనీని చూడటానికి వెళ్ళిరా.

బాబా ఆదేశానుసారము నేను (సాయిబానిస) నా పాత కంపెనీని చూడటానికి వెళ్ళినాను.  అక్కడ పాత యంత్రాల స్థానంలో నూతన యంత్రాలు నెలకొల్పినారు.  నూతనతరం కార్మికులు, నూతన పరిజ్ఞానముతో ఆయంత్రాలను నడుపుతున్నారు.  నేను నేటి వర్తమానంలో ఆ కంపెనీలో పనిచేయలేను.  కాలగతిలో నేను కూడా పాతపడిపోయాను.

(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




No comments:

Post a Comment