Thursday 13 August 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 12 వ.భాగమ్


     Biography Sai Baba of Shirdi | Biography Online
     rose hd png rose png image free picture download - PNG #1753 ...
13.08.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 12 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

28.  శారీరక బలము శాశ్వతము కాదు
11.03.2020  -  బుధవారము
నీ శారీరక అందము శాశ్వతము కాదు అని నీవు గ్రహించగలిగినావు.  ఇక ఈరోజున నీ శారీరక బలము కూడా శాశ్వతము కాదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతాను విను.  మహాభారత యుధ్ధములో దుర్యోధన చక్రవర్తి తన శారీరక బలముపై చాలా గర్వపడుతూ ఉండేవాడు.  



యుధ్ధములో తనకు మరణము రాకూడదని తన శరీరమునకు వజ్ర శక్తిని పొందటానికి తన తల్లివద్దకు నగ్నముగా వెళ్లసాగెను  సమయంలో శ్రీకృష్ణుడు ఎదురుపడి పురుషులు నగ్నముగా తిరగరాదు.  కనీసము అరటి ఆకును నడుముకు కట్టుకొని నీ తల్లివద్దకు వెళ్ళమని సలహా ఇచ్చెను.  
      Hare Krishna VS Duryodhana - The Night snan by VachalenXEON on DeviantArt
దుర్యోధనుడు శ్రీకృష్ణుని మాయలో పడి అరటి ఆకును తన నడుముకు చుట్టుకొని తల్లి ఆశీర్వచనాల కోసము వెళ్ళెను.  ఆమె కళ్లకు గంతలు ఉండటము చేత ఆమె అరటిఆకును చూడకుండ దుర్యోధనుని నగ్న శరీరానికి వజ్రశక్తిని ప్రసాదించెను.  కాని దుర్యోధనుని నడుముకు అరటిఆకు ఉండటము చేత శరీరము అంతటికి వజ్రశక్తిని పొందలేకపోయెను.  తల్లి తన కుమారుని పిలిచి నీశరీరము అంతటికి వజ్రశక్తిని ప్రసాదించినాను కాని నడుముకు అరటిఆకు ఉండటము చేత నడుముకు వజ్రశక్తిని ప్రసాదించలేకపోయాను.  ఎవరైనా గదతో నీ నడుముపై కొట్టిన నీకు మరణము కలుగుతుంది అని చెప్పి చాలా బాధపడినది.  తల్లి మాట యదార్ధము అయినది.  యుధ్ధములో భీముడు దుర్యోధనుని నడుముపై కొట్టెను.  దుర్యోధనుడు మరణించెను.
        Was the battle of Kurukshetra unjust as Dronacharya, Karna & Duryodhana  were killed cowardly against the rules of ...

29.  నేనే జగన్మాతను
12.03.2020  -  గురువారము
నేను ఇదివరలో హేమాద్రిపంతుకు చెప్పిన మాటలను తిరిగి నేను నీకు చెబుతున్నాను.  నేనే జగన్మాతను, సృష్టిస్థితి, లయకారకుడిని నేనే”.  అందుచేత సరస్వతి, లక్ష్మి, పార్వతుల అంశములలోను ఉన్నాను.  అందుచేత నా భక్తుల ఇంట అన్నవస్త్రాలకు, సుఖశాంతులకు లోటు ఉండదు అని నేను హామీ ఇస్తున్నాను.

విశ్లేషణ :
శ్రీ సాయి సత్ చరిత్ర 3 . అధ్యాయములో విపులముగా చెప్పబడింది.

30.  గాలిలో ఎగిరిపోయే మనిషి !
13.03.2020  -  శుక్రవారము
గాలిలో ఎగిరే మనిషి !  ఏనాటికైన నీవు భూమిపైకి దిగక మానవు.  అలాగే మట్టిలో కలిసిపోక మానవు. 
       man in red superhero cape flying on air stock photo © Syda ...
నేను, నావాళ్లు అనే బంధాలు, అనుబంధాలు గాలి బుడగలువంటివి.  బుడగలలోని గాలి బుడగ పేలిపోయిన తరువాత ప్రపంచములో ఉన్న గాలిలో కలిసిపోవలసినదే.
స్మశానములో నీ చితిమంటలు పూర్తిగా ఆరిపోయేవరకు నిన్ను ఎవరైన జ్ఞాపకము ఉంచుకొన్న నీవు అదృష్టవంతుడివి.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment