Thursday, 27 August 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 16వ.భాగమ్


Man Ki Tapish - Baba Tere Sajade Mein ~ Shirdi Sai Baba Bhajan Mala | Boat  wallpaper, Beach photos, Beach quotes
Buy Rose (Light Yellow) Plants Online at lowest price
27.08.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 16.భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

36.  గతములో నీకు సహాయం చేసిన వారిని మర్చిపోరాదు
19.03.2020  గురువారము
గతములో నీ జీవితములో జరిగిన కష్టసుఖాలను మరిచిపోయినా ఫరవాలేదు.  అంతేగాని గతములో నీ జీవితములో నీకు సహాయం చేసినవారిని మరిచిపోరాదు.  వారిపట్ల జీవితాంతము కృతజ్ఞతాభావముతో ఉండాలి.


నీవు 1967 నుండి 1970 వరకు భారత ప్రభుత్వ శాఖలో తాత్కాలిక ఉద్యోగము చేసినావు.  నీలోని మంచితనము, పనిలో శ్రధ్ధను, పనిలో ష్టపడే నైజమును చూసి నీ ప్రాజెక్టులోని ఉన్నతాధికారి శ్రీ ఎమ్. ఎస్. ఆర్  నీ ఉద్యోగాన్ని పర్మనెంటు చేసి నిన్ను హైదరాబాద్ శాఖలో ఉన్నత పదవిలోనికి ప్రమోషన్ ఇచ్చినారు.  ఆనాడు భగవంతుడు శ్రీ ఎం.స్.ఆర్ గారి రూపంలో నీకు సహాయం చేసినారు.  శ్రీ ఎం.ఎస్.ఆర్ ఈనాడు లోకంలో లేకపోయినా ఆయన పేరును నీవు గుర్తుపెట్టుకొన్న నీవు భగవంతుడిని గుర్తు పెట్టుకున్నట్లే.

ఇక నీవు 1970 లో వివాహం చేసుకొని ఈనాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నావు.  09.03.2020 నాడు హోలి పండుగనాడు నీవివాహం వార్షికోత్సవ రోజు.  వేడుకను నీ బంధువులతో చేసుకున్నావు.  నీవు నన్ను గుర్తు చేసుకొన్నావు.  నిన్ను ఆశీర్వదించలేదని బాధపడినావు.  నాకు రూపము లేదు.  నేను అదృశ్యరూపములో నిన్ను, నీ భార్యను ఆశీర్వదించాను.  నీ తృప్తికోసము రోజున నీకు స్వర్గీయ శ్రీ జె.వి.సోమయాజులు (శంకరాభరణము సినిమాలోని పాత్రధారి శ్రీ శంకరశాస్త్రి) గారి రూపములో దర్శనము ఇస్తున్నాను.  నీవు నీ భార్య కలసి వచ్చి నా పాదాలకు నమస్కరించి, నా ఆశీర్వచనాలు తీసుకోండి.
           Sankarabharanam Songs Download, Sankarabharanam Telugu MP3 Songs, Raaga.com  Telugu Songs
శంకరాభరణం సినిమాలోని ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీ జె.వి.సోమయాజులు గారు నా ఇంట సాయిదర్బారులోని సోఫాలో కూర్చుని యున్నారు.  నేను నా భార్య సంతోషముతో వారి పాదాలకు నమస్కరించినాము.  సంతోషముతో నిద్రనుండి మెలకువ వచ్చినది.

విశ్లేషణ :
శ్రీ సాయి సత్ చరిత్రలోని సాయి అనేకసార్లు తనకు రూపము లేదు అని చెప్పినారు.  ఆయన ఏరూపములోనైన దర్శనము ఇస్తామన్నారు.  స్వర్గీయ శ్రీ జె.వి.సోమయాజులుగారి రూపంలో దర్శనము ఇచ్చినారు.

37.  మతిమరుపు వ్యాధి
20.03.2020  శుక్రవారము
వృధ్ధాప్యములో మనిషికి మతిమరుపు వ్యాధి రావటం అనేది భగవంతుడు వానికి ఇచ్చిన వరము.  మతిమరుపు వ్యాధిలో మనిషి తిరిగి బాల్యావస్థలోనికి వెళ్ళిపోయి చిరునవ్వుతో మృత్యుదేవతను కౌగిలించుకొని ప్రశాంత మరణం పొందుతాడు.  వృధ్ధాప్యములో మతిమరపు వ్యాధిగ్రస్థులను చిన్న పిల్లలలాగ చూసుకోవాలి.  నా అంకిత భక్తుడు దాసగణు తన 95.ఏట నాందేడు పట్టణములో మతిమరపు వ్యాధితో మరణించెను.

(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment