16.08.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 13 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
31. అంతులేని ప్రయాణంలో నీ ఆఖరి మజిలి
14.03.2020 - శనివారమ్
కాలప్రవాహము
అనే నదిలో నీ ప్రయాణము ఎప్పుడు ప్రారంభించినది, ఎక్కడనుండి ప్రారంభమైనది నీకు తెలియదు. తెలియని విషయాల గురించి ఆలోచించవద్దు. వర్తమానంలో నది ఒడ్డున ఇసుకలో నడుస్తూ ఆ నది కాలగర్భములో
నీవు కూడా కలిసిపో.
విశ్లేషణ :
నీ
మరణానంతరము నీ అస్థికలను నదిలో కలుపు. ఆనది
సముద్రములో కలుస్తుంది.
32. ప్రాపంచిక రంగము – ఆధ్యాత్మిక రంగము
15.03.2020
- ఆదివారమ్
ప్రాపంచిక
రంగములో నీకు ఒక యజమాని యుండవచ్చును. అలాగే
నీకు ఒక సేవకుడు యుండవచ్చును. అందుచేత యజమాని,
సేవకుడు అనే భావనతో మనస్పర్ధలు కలగవచ్చును.
యజమాని, సేవకుల మధ్య గొడవలు రాకుండా యుండటానికి వారి మధ్య అహంకారము, అసూయలు
రాకుండ చూసుకోవాలి.
ఇక
ఆధ్యాత్మిక రంగములో భగవంతుడు భక్తుడు మాత్రమే యుంటారు. భగవంతుడు దయామయుడు. తన భక్తులపాలిటి కల్పవృక్షము. భక్తుడు భగవంతుని దయకు పాత్రుడై సంతోష సాగరములో
తేలియాడుతూ జీవించుతాడు. నన్ను, నావారు భగవంతుడని
పిలుస్తారు. కాని నేను భగవంతుడిని కాను. నేను భగవంతుని విధేయ సేవకుడిని. భగవంతుడు మన అందరికీ యజమాని.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment