20.08.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 14 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
33. అన్నిమతాల సారము ఒక్కటే
16.03.2020 సోమవారమ్
నిన్నటి
రోజున ప్రాపంచిక రంగము మరియు ఆధ్యాత్మిక రంగముల మధ్య ఉన్న తేడాను తెలియజేసాను. ఈ రోజున ఆధ్యాత్మిక రంగములోని సారము గురించి చెబుతాను. ఆధ్యాత్మిక రంగములో మతాలు లేవు కాని అన్ని మతాల
సారము కలసియున్నది. అందుచేతనే మనందరికి భగవంతుడు
ఒక్కడే అని అనేకసార్లు చెప్పాను. ఈ విషయము
నీకు ఉదాహరణతో చెప్పడానికి నిన్ను నీ క్రైస్తవ మత స్నేహితులు అయిన శ్రీ డేవిడ్ పాల్
మరియు రతన్ రాజ్ లను కలుపుతాను.
ముందుగా
తార్నాకలోని నీ స్నేహితుడు శ్రీ రతన్ రాజ్ దగ్గరకు నడు. అతనిని నీతో తీసుకొని సిదింద్రాబాద్ స్టేషన్
దగ్గరలో ఉన్న శ్రీ డేవిడ్ పాల్ ఇంటికి రా.
నేను మీ గురించి శ్రీ డేవిడ్ పాల్ ఇంటి దగ్గర ఎదురుచుస్తూ ఉంటాను.
శ్రీ సాయి ఆదేశానుసారము నేను (సాయిబానిస) శ్రీ రతన్ రాజ్ ఇంటికి
వెళ్ళి అతనిని తోడుగా తీసుకొని శ్రీ డేవిడ్ పాల్ ఇంటికి చేరుకొన్నాను. శ్రీ డేవిడ్ పాల్ మమ్ములను చూసి
ప్రేమతో పలకరించి రాత్రి భోజనము చేసి వెళ్ళమని కోరాడు. రాత్రి 8 గంటల సమయము. భోజనాలకు డేవిడ్ పాల్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసాడు.
భోజనానికి ముందు దైవప్రార్ధనల కోసం శ్రీ డేవిడ్ పాల్ మరియు శ్రీ రతన్ రాజ్ లు ఆఇంటి
హాలులో ఉన్న శిలువపై ఉన్న ఏసుప్రభువు పటము ముందు నిలబడి తమ ప్రార్ధనలు చేయసాగారు. నేను వారి వెనుక నిలబడి నా ఇష్టదైవము శ్రీ షిరిడీసాయి
నామము జపించసాగాను. ఆశ్చర్యముగా ఏసుప్రభువు
స్థానములో నేను శ్రీషిరిడీసాయిని చూడగలిగాను.
నీఇద్దరు క్రైస్తవ మిత్రులు తమ ప్రార్ధనలు పూర్తి చేసుకొని నన్ను
భోజనానికి టేబుల్ వద్దకు రమ్మని కోరితే మేము ముగ్గురము డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న కుర్చీలలో
కూర్చొని యున్నాము. శ్రీడేవిడ్ పాల్ నన్ను
ఉద్దేశించి నీవు తెలుగు బ్రాహ్మణ కులములో పుట్టిన హిందువువి. నేను, రతన్ రాజ్ లము తెలుగు క్రైస్తవ మతములో పుట్టినవారము. అందుచేత మన సాంప్రదాయములు ప్రకారము మనము భోజనాలు
చేద్దాము అని చెప్పి నాకు (సాయిబానిస) శాఖాహారముగా రెండు చపాతీలు, బంగాళదుంపల కూర పెట్టారు. వారు మాత్రము కోడి మాంసముతో కూడిన మాంసాహారము తినసాగిరి. మేము ముగ్గురము తినేది ఆహారమే, ఆ ఆహారమే మాలోని
ఆకలిని తీర్చుతుంది. మాసాంప్రదాయాలు వేరు అయినా
మాముగ్గురిలోని ఆకలి ఒకటే. ఆ ఆకలిని తీర్చుకోవడానికి
మేము మాంసాహారము, శాఖాహారములను తినసాగాము.
అలాగే మా మతాలు వేరుఅయినా, అన్ని మతాల సారము ఒక్కటే. అదే భగవంతుడు ఒక్కడే అనే విషయము గ్రహించాలి. మనము ఏమతసాంప్రదాయము పాటించినా ఆఖరికి అందరము ఒకే
భగవంతుని దగ్గరకు చేరుతాము. భగవంతుడు ఒక్కడే
అయినా వారికి అనేక రూపాలు, అనేక రూపాలలోయున్న భగవంతుని ప్రార్ధించి మనము ఆధ్యాత్మిక
రంగములో మన గమ్యాన్ని చేరుదాము. నాతోపాటు మీరు
అందరూ కలిసి సబ్ కా మాలిక్ ఏక్ అని భగవంతుని ప్రార్ధించండి.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment