30.08.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 17వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
38. 21.03.2020
శనివారమ్
నేను
తీర్ధయాత్రలకు మరియు పుణ్యక్షేత్ర దర్శనాలకు వ్యతిరేకిని కాను. అప్పు చేసి తీర్ధయాత్రలు మరియు పుణ్యక్షేత్రాల దర్శనమునకు
మాత్రము వ్యతిరేకిని. శ్యామాను తన మొక్కులను
తీర్చుకోవటానికి సప్తశృంగి దేవత దర్శనానికి పంపినదీ నేనే. దేవీ దేవతలకు మనము మొక్కులు తీర్చుకోవడం మన కర్తవ్యం.
కాని
ఈనాడు పుణ్యక్షేత్రాలు తీర్ధయాత్రా స్థలాలలో అక్కడి మత పెద్దలు, మఠాధిపతులు, భక్తులను
బాధలు పెట్టి వారినుండి ధనము స్వీకరించడము నాకు చాలా బాధను కలిగించుచున్నది. నేడు పుణ్యక్షేత్రాలు, తీర్ధయాత్రా స్థలాలు ఒక వ్యాపార
కేంద్రాలుగా మారిపోయినవి.
నేను
శరీరముతో షిరిడీలో జీవించినంతకాలము నా భక్తులు, భగవంతుని దర్శనము, నా సలహా కోరడానికి
షిరిడీకి వచ్చేవారు. నేడు నా భక్తులు తమ స్వంత
కోరికలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు.
నేను, భగవంతుడిని కాదు, నేను వారికి విధేయసేవకుడిని అని చెప్పినా వినే నాధుడు
లేడు.
39. నీవు భగవంతునికి లేదా తోటివానికి అర్పించి భోజనము
చేయాలి.
22.03.2020 ఆదివారము
నేను
నా యవ్వనములో గుజరాత్ దేశములోని మాండవి నగరములో ఒక వజ్రాల వ్యాపారి వద్ద పనిచేస్తూ
ఉండేవాడిని. నా యజమాని నా పనితనమునకు మెచ్చుకొని
ఒకరోజున మధ్యాహ్న భోజన వేళలలో నాకు తినడానికి నాలుగు మామిడిపళ్లు ఇచ్చినాడు. నేను నా ముగ్గురు మిత్రులతో కలిసి భోజనము చేయసాగాను. నావద్ద నాలుగు మామిడిపళ్ళు ఉన్నాయి. వాటిని నా మిత్రులు ఆశగా చూడసాగారు.
నా
చిన్నతనంలో నా గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినవి. నీవు ఏమైన తినేముందు భగవంతునికి ఆ పదార్ధమును నైవేద్యముగా
పెట్టు. ఆ తర్వాతనే దానిని ప్రసాదముగా తినవలెను. లేదా నీ ప్రక్కవారిలో భగవంతుని చూసి వారికి అర్పించి,
వారితో పంచుకొని తినవలెను. ఆ మాటలు గుర్తుకు
రాగానే నేను నా ముగ్గురు మిత్రులకు మూడు మామిడిపళ్ళు
ఇచ్చి, నేను వారితో కలిసి నాలుగవ మామిడిపండును నేను తిన్నాను. నా యజమాని నాలోని మంచితనాన్ని చూసి నాకు జరీ శాలువా
కప్పెను.
40. కరోనా వ్యాధి
23.03.2020 సోమవారము
ప్రకృతిలో
సమతుల్యము దెబ్బతిన్నప్పుడు భూకంపాలు, సునామీలు, తుఫానులు వచ్చి తిరిగి ప్రశాంత వాతావరణము
ఏర్పడుతుంది. ఈ కోవకు చెందినది కరోనా వ్యాధి. మానవుడు ప్రకృతిని ప్రేమించుట మరిచిపోయి ప్రకృతిని
నాశనము చేస్తున్నాడు. ఆ విధానములో కొన్ని జీవరాశులను
చంపి తన ఆహారముగా స్వీకరించుతున్నాడు. అందులో
నోరు లేని జీవాలు పాములు, గబ్బిలాలు వంటి జీవులను తినడము పాపమే కాదు, వాటిని తినటము
వలననే కరోనా వ్యాధికి గురి అవుతున్నారు. ఆ
వ్యాధి ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి ఒకరినుంచి
ఇంకొకరికి సంక్రమించుతుంది. అనేకవేలమంది మరణించుతారు. ఈ వ్యాధికి మందులేదు. ప్రజలు అందరు ఏకాంతవాసమును అలవాటు చేసుకొని, భగవంతుని
నామము స్మరించుతు కరోనా వ్యాధినుండి తప్పించుకొని జీవించండి.
విశ్లేషణ :
గత
నాలుగు నెలలనుండి ఈ ప్రపంచములో మూడు లక్షల మందికి కరోనా వ్యాధి సోకినది. అందులో 15 వేల మంది మరణించారు.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment