03.09.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 18 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
41. అశ్వశక్తి
24.03.2020 - మంగళవారము
నేను
నా జీవితములో భగవంతుని అనుగ్రహాన్ని అశ్వములో చూడగలిగాను. నా వెనుకటి జన్మలో మహరాణా ప్రతాప్ వద్ద ఉన్న చేతక్
అనే అశ్వములోను, ఆ తర్వాత చాంద్ పాటిల్ యొక్క తప్పిపోయిన అశ్వములోను ఆ తర్వాత ద్వారకామాయిలో
నా వద్ద పెరిగిన శ్యామకర్ణి అనే అశ్వములోను భగవంతుని అనుగ్రహాన్ని చూడగలిగాను.
సనాతన
ధర్మములోని పురాణాలలో చెప్పబడిన శ్రీ మహావిష్ణువు అవతారమయిన హయగ్రీవ అవతారము అశ్వమే
కదా.
42. మరణానికి భయపడకండి – కాని కరోనానికి దూరంగా ఉండండి
25.03.2020 - బుధవారము
ఈ
రోజు ఉగాది పండుగ. నీవు నేటిరోజున కరోనా వ్యాధి
గురించి ఆలోచించుతున్నావు. మృత్యుదేవత ఏ రూపంలోనైన
నీ వద్దకు రావచ్చును. అందుచేత మరణానికి భయపడవద్దు. అలాగని కరోనాకి చేరువగా వెళ్ళవద్దు. భగవంతుడు మనిషికి ఆలోచనాశక్తి ఇచ్చినాడు. మరణానికి దూరంగా జీవించడానికి కావలసిన జాగ్రత్తలు
తీసుకోండి.
43. కాలచక్రములో బళ్ళు ఓడలుగా మారును
26.03.2020 - గురువారము
నేను
1858 లో షిరిడీలోని పాడుబడిన మసీదులో అడుగుపెట్టాను. నా భక్తుల కళ్లముందే మసీదు పైభాగము కూలిపోయినది. ఆనాటినుండి నేటివరకు నా భక్తులు మసీదుమాయికి అనేక
మరమ్మత్తులు చేసి, నేడు సుందరమైన ద్వారకామాయిగా రూపు దిద్దినారు. ఆనాటి పాడుబడిన మసీదు నేడు అందమైన ద్వారకామాయి.
ఇక
నేను 1918లో నా శరీరమును వదిలివేసాను. నా పార్ధీవ
శరీరాన్ని బూటీవాడలో మహాసమాధి చేసినారు. నా
పార్ధివశరీరము మట్టిలో కలిసిపోయినా ఇంకా నా ఎముకలలో శక్తి ఉంది. ఆ శక్తితోనే నేను నా భక్తులతో మాట్లాడుతున్నాను. నా ఎముకలలో ఇంకా 500 సంవత్సరాల వరకు శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఆ శక్తి రూపాంతరము చెందుతుంది. 500 సంవత్సరాల తర్వాత షిరిడీ ఎలాగ ఉంటుందో తెలియదు.
(మరలా వచ్చే ఆదివారమ్)
No comments:
Post a Comment