06.09.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 19 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
44. పాములను, గబ్బిలాలను చంపరాదు
27.03.2020 శుక్రవారము
ప్రకృతి
సమతుల్యము కోసం భగవంతుడు అనేక జీవరాశులను సృష్టించెను. వాటిలో మానవులకు ఉపకారము చేసే జీవాలలో పాములు మరియు
గబ్బిలాలు ఉన్నాయి. ఇవి సమాజానికి చెడును కలిగించే
క్రిములను తింటు తాము జీవించుతూ మనుషులకు ఉపకారము చేయుచున్నవి. అటువంటి పాములను, గబ్బిలాలను కొన్ని దేశాలలో మానవులు
తమ ఆహారముగా వాటిని చంపి తినుచున్నారు. దానివలన,
అటువంటి మానవులకు అనేక రోగాలు వస్తున్నాయి.
ఆ రోగాలు అంటురోగాలుగా మారి ప్రపంచములొ అన్ని దేశాలకు విస్తరించుతున్నాయి.
మానవుడు
ఈ విపత్తునుండి బయటపడాలి అంటే తమకు నిషిద్దమైన ఆహారమును భుజించరాదు. ఈ విధముగా జీవహింస చేయకుండా ఏకాంతముగా జీవించిన
కరోనా వ్యాధి రాదు.
45. శ్రీ దాసగణు – లంచము వ్యవహారము
28.03.2020 శనివారము
నేడు
సమాజములో లంచము ఇవ్వడము మరియు లంచము తీసుకోవడము ఒక అలవాటుగా మారిపోయినది. నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో నాకు నా భక్తుడు
దాము అన్నా కాసర్ తనకు వ్యాపారములో లాభము వచ్చేలాగ ఆశీర్వదించిన తన వ్యాపారములో వచ్చే
లాభములో వాటా ఇస్తానని అన్నాడు. నేను వాని
మాటను తిరస్కరించాను. అతను ఆ వ్యాపారము మానివేసి
ప్రశాంతముగా జీవించినాడు. ఇంక నా మరో భక్తుడు
దాసగణు (గణేష్ సహస్రబుద్ధి) ఇతను పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తూ ప్రభుత్వ
ఖజానాకు జమ చేయవలసిన 32 రూపాయలను జమ చేయలేదు.
పై అధికారుల ఆగ్రహానికి గురి అయి తన ఉద్యోగమును కోల్పోయిన స్థితికి వచ్చి నా
సహాయము కోరినాడు. నేను అతనిని తన పదవినుండి
స్వచ్చందముగా విరమణ చేసి హరికధలు చెప్పుకుంటూ జీవించమని సలహా ఇచ్చినాను. ఈ విధముగా నేను దాసగణుని లంచము వ్యవహారమునుండి కాపాడాను. నా భక్తులకు నేను ఇచ్చే సలహా లంచము తీసుకొవద్దు. లంచము ఇవ్వవద్దు.
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment