13.09.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 21 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
48. గృహస్థ ఆశ్రమానికి సలహాలు – సూచనలు
31.03.2020 మంగళవారము
నిన్నటిరోజున
ఆధ్యాత్మిక రంగములో బ్రహ్మజ్ఞానము పొందటానికి
సలహాలు, సూచనలు చెప్పాను. ఈ రోజున నీవు నీ
గృహస్థ ఆశ్రమములో ప్రశాంతముగా జీవించటానికి మార్గమును చూపించుతాను.
ప్రశాంత
గృహస్థ ఆశ్రమములో ధన సంపాదనలో అక్రమ మార్గాలు అవలంబించరాదు. అక్రమ మార్గములో సంపాదించిన ధనము అనేక చికాకులకు
మూలము అగుతుంది. అవినీతి నిరోధక శాఖ శిక్షకు
పాత్రుడివి అవుతావు.
ఈనాటి
సమాజములో వైవాహిక జీవితములు నాశనము అగుటకు మూలకారణము పరస్త్రీ వ్యామోహము మరియు పరపురుష
వ్యామోహము. ఈ రెండు లేని సంసారము ప్రశాంతముగా
గడిచిపోతుంది.
నేను
షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో నా భక్తులనుండి రోజుకు రెండుమూడు సార్లు దక్షిణ అడిగి
వారిలో ధనవ్యామోహము ఉందో లేదో చూసేవాడిని.
ఇంక
వారిని పాఠశాల (శ్రీమతి రాధాకృష్ణమాయి ఇంటికి) పంపి నా భక్తులలోని పరస్త్రీ వ్యామోహము
ఉన్నదీ లేనిదీ చూసేవాడిని.
49. కరోనా వ్యాధికి తీసుకోవలసిన జాగ్రత్తలు
01.04.2020 బుధవారము
ఈనాడు
ప్రపంచవ్యాప్తంగా 47 వేల మంది కరోనా వ్యాధితో మరణించినారు అని తెలుసుకొని చాలా బాధపడినాను. ప్రకృతి తన భూభారం తగ్గించుకోవడానికి ప్రయత్నించుతున్న
ఒక ప్రయత్నము. ఈ ప్రయత్నములో కొన్ని వేలమంది
మరణించబోతున్నారు. మరణానికి భయపడకండి. కాని
కరోనా వ్యాధికి దూరంగా జీవించండి. నేను ఇచ్చే
సలహాలను పాటించండి.
1
నేను షిరిడీకి మాత్రమే పరిమితము కాదు. ఈ ప్రపంచములో అన్ని చోట్ల నేను ఉన్నాను. నేను నా భక్తుల హృదయాలలో ఉన్నాను. అందుచేత నా మందిరాలకు రావద్దు. నన్ను మానసికముగా పూజించండి. నా ప్రసాదము అని చెప్పి తెచ్చి ఇచ్చేవారి నుండి
ప్రసాదము తినవద్దు. మీరు నిత్యము భుజించె భోజనము
నాకు నైవేద్యము పెట్టి దానిని మీరు నా ప్రసాదముగా తినండి.
2
1 నిత్యము స్నానము చేసేముందు మీరు మీ శిరస్సు,
ముఖము, చేతులను పసుపుతో శుభ్రము చేసుకొని, పరిశుభ్ర వాతావరణములో జీవించండి.
2 బస్సులు రైళ్ళువంటి ప్రయాణ సాధనాలలో గుంపులు,
గుంపులుగా ఎక్కి ప్రయాణము చేయవద్ద 3 వీలు అయినంతవరకు మీ అవసరాలు తీర్చుకోవడానికి
కాలి నడకన ప్రయాణించండి. అపరిచితులతో స్నేహము
చేయకండి.
4 మీ ఇళ్ళకు వచ్చే అతిధులను మీ ఇంటి గుమ్మములో
నీరు ఇచ్చి, కాళ్ళు, చేతులు కడుగుకొని, నీ ఇంటిలోనికి రమ్మని కోరండి.
5 సామూహిక పూజలు, వ్రతాలు, సత్సంగాలు చేయవద్దు. మీ ఇంటిలో ఏకాంతవాసములోనే మానసిక పూజలు చేయండి.
(మరలా వచ్చే గురువారమ్)
( (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment