Thursday 17 September 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 22 వ.భాగమ్

 




17.09.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 22 .భాగమ్

-      సాయిదర్బార్, హైదరాబాద్

-      సాయిబానిస

-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్

-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

50  శ్రీరామనవమికృతజ్ఞతా భావం

02.04.2020 గురువారమ్

నీ జీవితములో నీవు అనేకమందికి జీవనోపాధి కల్పించి వారికి సహాయము చేసినావు.  కాని వారిలో బహుకొద్దిమంది నీపట్ల కృతజ్ఞతా భావముతో నిన్ను పలకరించుతున్నారు.  ఆలోచన నీకు బాధను కలిగించటము సహజమే.  మరి నా విషయంలో నేను భగవంతుని పేరిట అనేకమందికి శారీరక, మానసిక మరియు ధన సహాయము చేసాను.  కాని వారిలో ఎంతమంది నన్ను గుర్తు చేసుకొనుచున్నారు.  నిజానికి భగవంతుడు మనలని గుర్తుపెట్టుకొంటె చాలు.


నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో మద్రాసునుండి ఒక భజన సమాజము వారు నా వద్దకు వచ్చి మంచి భజన చేసినారు.  వారిలో సమాజము యజమాని భార్య నాకు అంకిత భక్తురాలు.  ఆమె నాలో శ్రీరామచంద్రుని చూసి తన్మయత్వముతో భజన చేసినది.  కాని భజన సమాజము యజమాని నన్ను ఒక సాధారణ ఫకీరుగానే భావించి నానుండి ధనమును పొందవలెనని పాటలు పాడెను.

నేను అతనికి స్వప్న దర్శనము ఇచ్చి అతనిలో మార్పు తెచ్చినాను.  భార్యాభర్తలు ఇద్దరిని ఆశీర్వదించి వారిని తిరిగి మద్రాసు పంపివేసాను.

51  మానవాళికి పెనుముప్పు

03.04.2020  శుక్రవారము

నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులతో అనేకమంది చనిపోవటము చూసాను.  కాని ఈనాడు కరోనా వ్యాధితో మానవాళిలో లక్షల సంఖ్యలో మానవులు చనిపోబోతున్నారు అనే ఆలోచన నాకు చాలా బాధ కలిగించుచున్నది.  ఈవ్యాధికి మందు లేదు.  మనం కరోనా వ్యాధికి దూరంగా ఏకాంతంగా జీవించటము ఒక్కటే మార్గము.  ఈవ్యాధి తగ్గుముఖం పట్టినది అని ప్రజలు తిరిగి గుంపులుగుంపులుగా దైవమందిరాలకు, విందులు, వినోదాలకు వెళ్ళిన కరోనా మహమ్మారి తిరిగి విజృంచించుతుంది.  ఈసారి బీదవారు ఆకలి మరణాలకు తట్టుకోలేక సమాజములోని ధనికులపై బడి దోపిడి చేస్తారు.  దుకాణాలను లూటీ చేస్తారు.  ధనికులు బీదవారికి మధ్య వ్యత్యాసము ఎక్కువయి సమాజము అస్థవ్యస్థము అగుతుంటే గొడవలలో అనేకమంది చనిపోతారు.  అందుచేత కరోనా వ్యాధికి దూరంగా ఏకాంతముగా జీవించండి.

(మరలా వచ్చే ఆదివారమ్)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

No comments:

Post a Comment