10.09.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 20 వ.భాగమ్
- సాయిదర్బార్, హైదరాబాద్
- సాయిబానిస
- సంకలనం
మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
- సమర్పణ
ఆత్రేయపురపు
త్యాగరాజు
46.
ఆధ్యాత్మిక శక్తి
29.03.2020 ఆదివారము
నేను మీ నగరంలోని శ్రీ కంచి కామకోటి మఠమునకు ఒక పేద
ముదుసలి బ్రాహ్మణుని రూపములో వెళ్ళాను.
అక్కడ
అప్పుడు వేద పారాయణము జరుగుతున్నది.
వేద
పండితులు
అందరూ వేదాలు పఠిస్తున్నారు. కొందరు
ఉపనిషత్తులకు
అర్ధము చెబుతున్నారు.
వారు
నన్ను
గమనించినా నాతో మాట్లాడలేదు.
నేను
వారితో మాట్లాడాలనే కోరికతో వారి వద్దకు వెళ్ళి నేను షిరిడీ నుండి వచ్చిన పేద బ్రాహ్మణుడిని.
నేను
మీతో 5 నిమిషాలు
మాత్లాడతాను . నా
మాటలు మీకు నచ్చితే నాకు 5 రూపాయలు సంభావన
ఇవ్వండి అని కోరాను.
వారు
నాపై జాలితో 5 నిమిషాలు మాట్లాడటానికి అనుమతి ఇచ్చినారు.
నేను
అక్కడ ఉన్నవారినందరిని ఆశీర్వదించి, “భగవంతుడిని తెలుసుకోవడానికి
బ్రహ్మజ్ఞానము
చాలా అవసరము.
బ్రహ్మజ్ఞానము పుస్తక
పఠనము వలన రాదు.
ముందుగా
భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోండి.
ఒకసారి
నీకు, భగవంతునికి తేడా లేదు అని గ్రహించిన, భగవంతుడు నా హృదయములోనే ఉన్నాడు అని గుర్తించిననాడు నీకు బ్రహ్మజ్ఞానము కలిగినట్లే.
ఆ
బ్రహ్మజ్ఞానము
నీవు పొందిన తర్వాత నీకు భగవంతునికి మధ్య ఉన్న గోడ తొలగిపోయి నీవు భగవంతుని రూపంగా మారిపోతావు.
జీవిత
ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో భగవంతునిలో ఐక్యమగుతావు.
ఈ
విధంగా మీరు అందరు సాధన చేయండి. మీలో నూటికో కోటికో ఒకరు నాలో ఐక్యమగుతారు”
ఆమాటలు విన్న అక్కడి వేదపండితులు నాకు మంచి శాలువా కప్పి నాపాదాలకు నమస్కరించారు.
వారి
వద్దనుండి రూ.5 దక్షిణ తీసుకొని నేను అక్కడి వేదపండితులను
ఆశీర్వదించి
తిరిగి షిరిడీకి ప్రయాణము అయినాను.
ఇప్పుడు
చెప్పు ఆ పేద బ్రాహ్మణుడు ఎవరు? ఆయన నీ సద్గురువు షిరిడీ సాయిబాబా కాదా?
ఆలోచించు.
47 ఆధ్యాత్మిక
శక్తి పొందటానికి సాధన
30.03.2020 సోమవారము
నిన్నటి రోజున వేదపండితుల మధ్య వారు చేసిన వేద పారాయణం విన్నావు.
ఉపనిషత్
మరియు బ్రహ్మసూత్రాలకు అర్ధము చెబుతుంటే విన్నావు.
ఈ
విధముగా వేదాలను విన్నా, ఉపనిషత్ మరియు బ్రహ్మసూత్రాలకు అర్ధము తెలుసుకున్నా నీకు మానసిక శాంతి మాత్రమే లభిస్తుంది.
నీకు
బ్రహ్మజ్ఞానము
కలుగదు. పామరులకు
వేదాలు చదవటం రాదు.
అందుచేత
వారికి సులువుగా బ్రహ్మజ్ఞానము పొందటానికి కొన్ని సలహాలు ఇస్తాను విను.
నా సోదరులు, తాజుద్దీన్ బాబా మరియు ఉపాసనీ బాబాల జీవిత చరిత్రలను చదవండి.
వారు
ఆధ్యాత్మిక రంగములో ఉన్నత శిఖరాలు అందుకోవటానికి వారు మొదట భగవంతుని బీదవారిలో చూసి వారిలోని దరిద్రనారాయణునికి నమస్కరించి, ధనవ్యామోహము, శరీర వ్యామోహము వదలిపెట్టి తమ ఆఖరి శ్వాస వరకు భగవంతుని అన్వేషణలో కొనసాగించారు.
ఈనాడు
నా భక్తులమని చెప్పుకొంటూ వారు తమ శరీర వ్యామోహము, ధనవ్యామోహము వీడలేకపోతున్నారు.
అటువంటి
వారు నాకు భక్తులు కారు.
వారు
నా పేరుతో ఆశ్రమాలు, పీఠాలు స్థాపించి తమ శిష్యులకు శక్తిపాతము ప్రసాదించి, సాయిపేరిట రాగి రేకులపై వారికి తోచిన మంత్రాలు ముద్రించి, ధనసంపాదన చేసుకొంటు, సాయిసమాజానికి చెడ్దపేరు తెస్తున్నారు.
వారు
నన్ను మోసము చేయగలమని భావించుతున్నారు. నిజానికి
వారికి వారే ఆత్మవంచన చేసుకొనుచున్నారు.
వారు
ఒకనాడు భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదు.
నేను
నా భక్తులకు ఇచ్చే సలహా మనందరికి భగవంతుడె యజమాని.
ఆ
యజమానిని మన గుండెలలో చూసుకుంటూ
జీవితాన్ని
కొనసాగించుదాము.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment