ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నుండి సాయిబానిస గారి డైరీల నుండి నేను సేకరించిన సాయి సందేశాలను ప్రచురిస్తున్నాను. ఈ సందేశాలన్నీ ఆధ్యాత్మికతకు సంబంధించినవి. విచిత్రమేమిటంటే 1999 వ.సంవత్సరములోనే బాబా గారు ఆయనకి తను ఇచ్చిన సందేశాలను ఇంటర్ నెట్ ద్వారా సాయిభక్తులకు పంచి పెట్టమని ఆదేశించారు. 5 వ. సంఖ్య సందేశాన్ని గమనించండి.
సాయిబానిస గారు హైదరాబాదులో సాయి దర్బార్ ను 25.12.1998 నాడు ప్రారంభించారు. ఆ రోజు క్రిస్మస్ పండగ. ఈ రోజున ఆధ్యాత్మిక కేకును ప్రపంచానికి పంచిపెట్టమని బాబా ఆదేశించారు. ఆ విధంగా ఇంటర్ నెట్ లో మొట్టమొదటి వెబ్ సైట్ ప్రారంభించారు.http://www.angelfire.com/ma/shirdi/ ఈ లింకు చూడండి.
గృహస్తులకు సాయి సలహాలపై సాయిబానిసగారి ఉపన్యాసములు ఈ లింక్ ద్వారా వినండి.
https://youtu.be/pHVcgg207FQ
https://youtu.be/DFqUsQQNm38
శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం (1 వ.భాగం)
https://youtu.be/DFqUsQQNm38
శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం (1 వ.భాగం)
13.02.1999
1. శ్రీసాయి గురించి ఇతరులు చెప్పే విషయాలు ఆలోచించకు. ప్రతివిషయము నీవే స్వయముగా తెలుసుకో.
2. నీవు సాయిభక్తుల మధ్య ఉంటూనే ప్రపంచంలో జరుగుతున్నవాటిని చూస్తూ మంచి చెడులను గుర్తించు.
3. ఎవరయినా కష్టాలలో ఉన్నపుడు నీవు వారి పక్షాన నిలబడివారికి ధైర్యము చెప్పి సాయి సత్ చరిత్రలోని విషయాలు వారికి చెప్పివారికి ప్రశాంతత కల్గించు.
4. శ్రీషిరిడీ సాయి లీలామృత భాండాగారములోని అమృతాన్నిపదిమందికి పంచిపెట్టు.
16.02.1999
5. నీవు ఇంటర్ నెట్ లో ప్రస్తుతానికి నేను నాభక్తులకు ప్రసాదించినఏకాదశ సూత్రాలు మరియు నేను నీకు చెప్పిన సాయితత్వం నీ తోటిసాయిబంధువులకు పంచి పెట్టు.
25.02.1999
6. భగవంతుడు స్త్రీ పురుషులలో ఒకే విధమయిన ఆత్మ శక్తినిప్రసాదించాడు. స్త్రీ పురుషులు దీనిని గుర్తించి, తమలోనిశారీరకమయిన తేడాలోని శక్తిని గుర్తించి, ఒకరిని ఇంకొకరుగౌరవించడం నేర్చుకోవాలి. అంతే కాని తమ తమ ఆధిపత్యనిరూపణ చేసుకోరాదు.
16.03.1999
7. నరుడి పాదాలకు నీవు పూజలు చేయడం ప్రారంభించిననాడుఆపాద పూజ చేయించుకునేవాడు నిన్ను బానిసగా చూస్తాడు. అదేనీవు నారాయణుడి పాదాలకు పూజలు చేయడం ప్రారంభించిననాడుఆ నారాయణుడు దిగి వచ్చి నేను నా భక్తునికి బానిసని అంటాడు.
22.03.1999
8. ఆనాడు సాయినాధుడు షిరిడీలో శ్రీరామనవమి,చందనోత్సవాలను ఒకే రోజు జరిపించి తన భక్తులకు భగవత్ భక్తినిగురించి ప్రబోధించారు. ఈనాడు మనము శ్రీసాయిరామునికి ప్రేమఅనే చందనం పూసి నవవిధ భక్తితో పూజిద్దాము
27.01.1999
9. రాజయినా, పేదయినా జీవించడానికి తినేది పట్టెడన్నమే కదా! ఆ అన్నమును ప్రసాదించేది పరబ్రహ్మమే కదా! అటువంటిపరబ్రహ్మాన్ని ఆలోచించడం మానివేసి అశాశ్వతమయిన పదవులకోసం ఆఖరి శ్వాసవరకు ప్రయత్నించడంలో అర్ధమేమిటి?
26.02.2000
10. ఇతరుల ఇంట పిండివంటలు తిన్నా, మన ఇంటిలో మన తల్లిచేసిన సాధారణ వంట ప్రేమతో తినాలి. కారణము మన తల్లి ప్రేమతోవండి వడ్డిస్తుంది కాబట్టి. మన తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు. అలాగే మన గురువు మన తల్లిలాంటివాడు. మన గురువు చెప్పినబోధనలను ఆస్వాదించి ఆచరించవలెను. ఇతర గురువులనుమనము గౌరవించవలెను.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment