Thursday, 17 March 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం - 7వ.భాగం

Image result for images of shirdi sai baba at flower garden
    Image result for images of yellow roses

17.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిసగారికి సాయి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని అవగాహన చేసుకొందాము.
          Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం - 7వ.భాగం 

07.01.2008

61.  ఆధ్యాత్మిక రంగంలో గురువు బస్సునునడిపే  డ్రైవరువంటివాడు.  నీ గమ్యస్థానము రాగానే వారు నిన్నుదిగిపొమ్మని ఆదేశిస్తారు.  మిగతావారిని తనతో తీసుకునివెళ్ళిపోతారు.  
 


12.01.2008

   గురు తత్వానికి దగ్గరగా జీవించు.  మాయ తత్వానికి దూరంగాజీవించు.

15.01.2008

                                         Image result for images of worshipping gods

62.  భగవంతుని పూజించటంలో ఎవరినమ్మకం వారిదిపూజావిధానంలో ఎవరినీ బలవంతం చేయరాదు.  నీకు ప్రాప్తమున్నఅన్నం మాత్రమే నీవు తినగలవు.  నీ చేతినుండి జారి పడిపోయినఅన్నము గురించి బాధపడవద్దు

12.02.2008

                     Image result for images of chandpatil and baba

63.  భగవంతుని అనుగ్రహమనే గుఱ్ఱం ఎక్కడానికి అహంకారమనేజీనును తొలగించు.  ప్రేమతో  గుఱ్ఱపు మెడను గట్టిగా పట్టుకొనినవ విధ భక్తిలోని ఒక మార్గాన్ని ఎన్నుకుని గుఱ్ఱపు స్వారీనికొనసాగిస్తూ నీ గమ్యస్థానాన్ని చేరుకో.
                          Image result for images of navavidha bhakti
                              

05.04.2008
                            Image result for images of chandpatil and baba

64. గృహస్థు సంసార సాగరంలో మునిగి తన గృహస్థ బాధ్యతలనుపూర్తి చేసుకుని శరీరాన్ని భగవత్ సేవలో వినియోగించడానికివానప్రస్థాశ్రమం ప్రారంభించాలి.   వాన ప్రస్థాశ్రమంలో భార్యాభర్తలలోఏ ఒక్కరు ముందుగా భగవంతుని చేరుకున్నా రెండవవారుసన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి.   సన్యాశాశ్రమంలో శరీరఅందచందాలకు ప్రాధాన్యత యివ్వకుండా శరీర సుఖాలకు దూరంగాజీవించుతూ భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతునిలోఐక్యమవాలి.  
                         Image result for images of chandpatil and baba


14.05.2008
                               Image result for images of squirrel in lord ramas hands
65.  భగవంతుని కార్యంలో ఒక సాధారణ ప్రాణి ఉడత తన వంతుసాయం తను చేసి భగవంతుని ప్రేమను పొందిందేమరి ఉత్తమజన్మయైన మానవ జన్మ ఎత్తి నీవు భగవంతుని ప్రేమ పొందడానికిఏమి  చేస్తున్నావు ఆలోచించు

19.06.2008

66.  ఎవరయినా దానధర్మాలు చేసినప్పుడు  విషయంపుచ్చుకున్నవారికి మరియు భగవంతునికి మాత్రమే తెలియాలి.ప్రచారం కోసం దాత ఈ విషయాన్ని ఎవరికీ తెలియచేయరాదు.


03.08.2008

67. భగవంతుని అనుగ్రహం పొందడానికి జపము తపముఆచరించనవసరం లేదు.  భక్తి అనే నిచ్చెన ఎక్కి సద్గురువుఆశీర్వచనాలతో  భగవంతుని పాదాల చెంతకు చేరు
                                           Image result for images of chandpatil and baba 


15.08.2008

68.  నీఆధ్యాత్మిక ప్రగతికి ధనము ఆటంకముగా ఉండకూడదుఆర్ధిక వ్యవహారాలు నిన్ను నా భక్తులనుండి దూరం చేస్తోందిఅందుచేత ఆర్ధిక వ్యవహారాలకు దూరంగా జీవించు

20.09.2008

69.  ఈ ప్రాపంచిక రంగంలో కోరికలకుబంధాలకు అంతులేదుఅదే ఆధ్యాత్మిక రంగంలో ముక్తి  పొందాలనె కోరికగురువుతోఅనుబంధము నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి.   

21.03.2009  

70.  ప్రాపంచిక రంగంలో నీవునేను అనేవి మన శరీరాలకేవర్తించుతాయి.  అదే ఆధ్యాత్మిక రంగంలో నీవు నేను ఒక్కటే అనేదిమన ఆత్మలకు వర్తిస్తాయి

మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment