13.03.2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బానిస గారికి బాబా వారు ఆధ్యాత్మికతపై ఇచ్చిన సందేశాలను చదవండి.
శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 5వ.భాగం
11.02.2006
41. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆకలితో ఉన్నవారికి ప్రేమతోఅన్నంపెట్టు. అతని ఆకలి తీరేవరకు అతనికి అన్నం పెట్టు. ఆసమయంలో అతనిని భగవత్ స్వరూపంగా భావించి అన్నం పెట్టు. నీవు ఎవరికయినా అన్నం పెట్టినపుడు వారిని అర్ధాకలితో బయటకుపంపవద్దు. అర్ధాకలితో పంపడం మహా పాపమని గ్రహించు.
42. శ్రీసాయి మనకు గురువు, దైవం. మనము ఆయనకుభక్తులం మాత్రమే. శ్రీసాయికి శిష్యులెవరూ లేరు. మనం శ్రధ్ధ సాబూరీతో ఆయన నామస్మరణ చేస్తు మన సంసార సాగరాన్నిదాటాలి.
సాయిబానిస
14.05.2006
43. ఒక రాజుగారి దర్బారులో, రాజుగారు ప్రజలకు మంచి సూక్తులు చెబుతున్నారు. ఆ సమయంలో నేనక్కడికి వెళ్ళి రాజుగారిని ఒకప్రశ్న వేశాను. రాజా! నీకు గురుదర్శనం లభ్యమవుతున్నసమయంలో ఒక అనాధప్రేత సంస్కారానికి సంబంధించిన శవముకనిపిస్తే, గురుదర్శనం ముందు చేసుకుంటావా లేక అనాధప్రేత సంస్కారం చేస్తావా అని అడిగాను. నామాటలకు ఆ రాజు ముందుగాఅనాధ ప్రేత సంస్కారం చేసిన తరువాతే నేను గురుదర్శనానికివెడతాను అని అన్నాడు. ఈసమాధానం నాకు తృప్తినిచ్చింది.
(గురుసేవకంటె అనాధప్రేత సంస్కారము గొప్పది)
11.08.2006
44. జన్మించడం ఎంత సత్యమో మరణించడం కూడా అంతసత్యమే. అందుచేత జనన మరణాల గురించి ఆలోచించకుండావీటిని ప్రసాదిస్తున్నటువంటి ఆ భగవంతుని గురించి ప్రశాంతంగాఆలోచిస్తూ జీవితాన్ని కొనసాగించు.
11.08.2000
45. ఈమధ్యకాలంలో యోగా కేంద్రాలలో చేరడం ఒకగొప్పలక్షణంగా భావించబడుతోంది. వీటి వలన ఆరోగ్యంసంపాదించవచ్చు. కాని, ఆధ్యాత్మికమును ఏమాత్రముసంపాదించలేము. అందుచేత ఆధ్యాత్మిక సంపాదన కోసముఏకాంతముగా భగవంతుని గురించి ఆలోచించు.
46. ఆధ్యాత్మిక నదిలో ప్రయాణం సాగిస్తున్న నావను ఒడ్డుకు చేర్చిదానిని ఒక నాలుగు చక్రాల వాహనముపై పెట్టి అడ్డదారినసముద్రతీరానికి తీసుకొని వెళ్ళి, సముద్రంలో ఆ నావను వదలటంమూర్ఖత్వం కాదా.
ఆధ్యాత్మిక రంగములో మనం ఆఖరిశ్వాస వరకు ప్రయాణంసాగించవలసిందే. భగవంతుని సన్నిధికి చేరడానికి అడ్డదారులుఉండవు.
02.11.2006
47. అన్నిమతాల సారము ఒక్కటే. అందరూ ఆఖరికి చేరవలసినగమ్యము ఒక్కటే. అందుచేత అన్యమతాలలో ఆసక్తినికనపర్చవలసిన అవసరం లేదు. నీవు నీస్వధర్మాన్ని పాటిస్తూ నీ గమ్యాన్ని చేరుకో.
21.01.2007
48. ఆధ్యాత్మిక విందు (అనగా సత్సంగాలు) ను అందరితో కలిసిచేయి. కాని ఆధ్యాత్మిక ప్రయాణం నీవు ఒంటరిగానే చేయవలసి ఉంటుందని గుర్తుంచుకో.
28.03.2007
49. మనిషియొక్క ఆయుష్షు పెంచడానికి గుండెకాయకు బ్యాటరీ(పేస్ మేకర్) పెట్టి ఆయుష్షును పెంచగలరు వైద్యులు. ఆ బ్యాటరీకూడా పనిచేయడం ఆగిపోయినపుడు మనిషి మరణించవలసిందే. మరణించిన మనిషితో పాటు బ్యాటరీ కూడా చితి మంటలలో కాలిబూడిదవవలసిందే.
26.06.2007
50. నేను మీకు రెండు కణుపుల చెఱకు గడను యిచ్చాను. వాటికణుపుల దగ్గర కోసి మీ పొలంలో నాటండి. ఆ చెఱుకు పంటపండించి ఆ పంటనుండి వచ్చే చెఱకురసంతో నాభక్తుల దాహం
తీర్చండి.
(తరువాతి సంచికలో మరికొన్ని సందేశాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment