24.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి
బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని మనందరికోసం.
శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 9వ.భాగం
08.09.2009
81. చిన్నపిల్లలు ఆ భగవంతునికి ప్రతిరూపాలు. ఆ
పిల్లలలోని అమాయకత్వం నీలో
ఉన్నా వారిలో నీవు భగవంతుని చూడగలవు.
05.05.2010
82. ఆధ్యాత్మిక రంగంలో ఉత్తీర్ణుడవటానికి ఈ రోజు నుండే సాధన ప్రారంభించు.
అంతే గాని ఎవరి సిఫార్సులు
మాత్రం కోరవద్దు.
16.05.2010
83. తన ఆకలి తీరలేదు. ఇంకా
భోజనం కావాలనే వ్యక్తికి నీవు తినబోయే భోజనము
అర్పించి నీవు ఉపవాసమున్నా నేను
నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాను.
26.05.2010
84. మానవ రూపంలో ఉన్న
భగవంతుడే నీ గురువు. సదా నీగురువు సేవలోనే
నీ జీవితాన్ని ముందుకు నడిపించు.
- --
సాయిబానిస
03.06.2010
85. నీవు ఆకాశంలొ (ఆధ్యాత్మిక
రంగంలో) ఎంతపెద్ద
భవనము కట్టినావు అన్నది ముఖ్యం కాదు. ఆ
భవనము నిలబడటానికి ఎంత మంచి పునాది
(సాధన) వేసినావు అనేదే ముఖ్యము.
31.08.2010
285. సామూహిక పూజలుచేసే కన్నా ఏకాంత పూజలు
చేయటం నాకిష్టము. నీవు
ఏకాంతముగా పూజలు చేసేకన్నా మానసికంగా
పూజలు చేయటం నాకు చాలా
ఇష్టము.
10.09.2010
86. నీవు ఒక మంచి
పని చేస్తున్న సమయంలో ఎవరయినా నీ ఆత్మాభిమానాన్ని దెబ్బ
తీసిన అతనితో దెబ్బలాడేకన్నా, నీవు చేస్తున్న మంచి
పనిని ఆపేసి వెళ్ళిపోయినా పాపము
లేదు.
15.09.2010
87. ప్రాపంచిక రంగంలో నీ తోటివాడికి సహాయం
చేయడం నీధర్మము. అదే
ఆధ్యాత్మిక రంగంలో నీ సహాయము ఎదుటివారు కోరినప్పుడు వినయంతో సహాయం చేయలేనని చెప్పు. ఆధ్యాత్మిక
రంగంలో ఎవరి కృషి వారే
చేసుకోవాలని గ్రహించాలి.
12.10.2010.
88. నీవు ఎదుటివాని యొక్క తప్పులను,
నేరాలను భగవంతుని ముందు ఏకరువు పెడుతున్నావే,
నీలాగే ఇంకొకడు నీవు వానికి చేసిన
అన్యాయాలను తప్పులను భగవంతునికి నివేదించుకుంటున్న విషయాన్ని మర్చిపోవద్దు.
16.10.2010
89. ప్రాపంచిక రంగంలో ఇరువురి మధ్య అయస్కాంత తరంగాలు
వేరువేరుగా ఉన్నా వారు కలుసుకుంటారు. అదే
ఆధ్యాత్మిక రంగంలో యిరువురి మధ్య అయస్కాంత తరంగాలు
ఒకటవుతేనే కలుసుకుంటారు.
08.11.2010
90. దూడవెనుక ఆవు ఉన్నట్లే, భక్తుడి
వెనుక భగవంతుడు ఉంటాడు.
(మరికొన్ని సందేశాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాఅధార్పణమస్తు)
No comments:
Post a Comment