27.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసకు సాయిబాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 10 వ. భాగమ్
11.11.2010
91. మనము ప్రాపంచిక రంగములో రోడ్డు మీద ప్రయాణంచేస్తున్నపుడు దారి తప్పిపోయినా రోడ్డు మీద బాటసారుల సాయంతోతిరిగి మనం నడక ప్రారంభించిన స్థలానికి చేరుకోగలము. అదేఆధ్యాత్మిక రంగంలో మనము దారి తప్పిపోయినచో యోగుల దగ్గరికివెళ్ళినపుడు వారు మనం గమ్యం చేరడానికి సరియైన మార్గంచూపిస్తారు.
22.11.2010
92. ఇటుకలు, సిమ్మెంటుతో పూజామందిరం నిర్మించడం కన్నానీమనసులో దేవాలయాన్ని నిర్మించు. అందువలననే దేహమేదేవాలయం అన్నారు.
03.12.2010
93. ఆకాశం శ్రీసాయి అయినపుడు (సాయి సర్వాంతర్యామి) సాయిభక్తులు భూమివంటివారు.
సాయి బానిస
13.12.2010
94. నా సేవలో నీ కోర్కెలను నెరవేర్చుకొనడానికి ఇతరుల దగ్గిరకు వెళ్ళవద్దు.
నేను నాభక్తుల సేవను గుర్తించి వారిని అనుగ్రహిస్తాను.
17.12.2010
95. మూగజీవులకు ఆహారం పెడుతున్నపుడు వాటియజమానుల జాతి,కుల తారతమ్యాలు చూడవద్దు. మూగజీవులకు ఆహారం పెడుతున్నపుడు వాటిలోని తారతమ్యాలుచూడవద్దు. మూగ జీవులకు ప్రేమతో ఆహారం పెట్టు.
28.12.2010
96. తల్లి ఆవు తన దూడ ఎన్ని దూడల మధ్య ఉన్నాగుర్తించగలదు. అలాగే శ్రీసాయి తన భక్తులు ఎన్ని వేల మంది మధ్యఉన్నా గుర్తించగలరు.
సాయిబానిస
02.01.2011
97. యుధ్ధాలు చేసి, విజయాలు సాధించిన యోధుడు(అశోకుడువంటివారు) కూడా ఆఖరికి వైరాగ్యంతో ప్రశాంత జీవితంకోసం అన్నిటినీ వదలుకొని దూరంగా వెళ్ళిపోయాడు.
15.03.2011
98. ప్రతివాడు జీవితంలో అందము ఆనందమె కోరతాడు. కానివికారంతో ఉన్న ఆకారాన్ని కోరడు. అదే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవ్యక్తి ఆ రెండింటినీ సమ దృష్టితో చూస్తాడు.
18.03.2011
99. ఈశావాస్యోపనిషత్తును పనిపిల్ల ద్వారా దాసగణుకుతెలియచేశారు బాబా. నాకు అదే పనిపిల్లతో సాయిపూజలోకులమతాలు అడ్డం కావు అని తెలియచేశారు బాబా
--- సాయిబానిస
31.03.2011
100. అయస్కాంతము ప్రాపంచిక జీవితంలో ఉపయోగపడేఇనుమును ఆకర్షించును. అలాగే నీలోని మంచితనం అనేఅయస్కాంతము ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుని కృపనుఆకర్షిస్తుంది.
(మరిలొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment