28.03.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు
మరికొన్ని
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్
15.04.2011
101. మనస్సుకు ప్రశాంతత కావాలని కోరుకునేవారు ఏకాంతవాసములో భగవంతుని పూజలు చేస్తారు.
ఈ ఏకాంతవాసంలో ఎటువంటి పూజా విధానం చేయాలనేది ఆ భక్తుడే నిర్ణయించుకోవాలి.
28.04.2011
102. ఆకాశ గంగ పరమశివుని జటాజూటములో మొదటి మజిలీ చేసి ఆతరవాతే భూమిపై ప్రవహించింది.
మన బాబా పరమశివుని అంశము.
అందుచేత మేఘుడు ఆయన శిరస్సుపై బిందెతో నీరు పోసినా శిరస్సు మాత్రమే తడిసినది.
శరీరము తడవలేదు.
సాయిబానిస
21.05.2011
103. హరిద్వారమునకు ముందు వుండే ద్వారమే గురుద్వారము.
అందుచేతనే ముందుగా గురుద్వారములోని గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆ తరువాతనే హరిద్వారములో ప్రవేశించాలి.
08.06.2011
104. నీవు అభిమానించే సినీనటుడిలోను, నీవు పెంచుతున్న నీ పెంపుడు కుక్కలోను, నీవు పనిచేస్తున్న నీ కంప్యూటర్ లోను ఉన్నది సాయి శక్తే.
ఈ సాయిశక్తి గతంలోను ఉంది, వర్తమానంలోను ఉంది, భవిష్యత్తులోను ఉంటుంది.
24.06.2011
105. బాబాకు నేను మాత్రమే అంకిత భక్తుడిని అనుకునేకన్నా, బాబాకు అనేకమంది అంకిత భక్తులున్నారు వారిలో బాబా నన్ను చేర్చుకోవడం నా అదృష్టము అని నేను భావిస్తున్నాను.
సాయిబానిస
16.07.2011
106. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగమా లేక రావణబ్రహ్మ ప్రతిష్టించిన శివలింగమా అనే ఆలోచన మాని మహాశివునిపై మనసు లగ్నం చేసి శివలింగాన్ని పూజించు.
03.09.2011
107. కాశీలో కాలభైరవరునికి పూజచేసి నైవేద్యము సమర్పించినా, యాదగిరి గుట్టలో నరసింహస్వామికి పూజచేసి నైవేద్యము సమర్పించినా అది నాకే చెందుతుంది.
23.11.2011
108. రైలు ఇంజను నడవడానికి శక్తి అవసరము.
భగవంతుని ప్రేమను పొందడానికి భక్తి అవసరము.
10.12.2011
109. నీవు గోదానం చేయలేకున్నా కనీసం గోవుకు తినడానికి ఆకు కూరను దానం చేయి.
18.12,2011
110. ఆధ్యాత్మిక రంగంలో నీవు నీ స్వధర్మాన్ని పాటించు.
అంతేగాని పర ధర్మాన్ని పాటించే విదేశీయులతో కలిసి జీవించినా అది నీకు తలనొప్పిని కలిగిస్తుంది.
అందుచేత నీవు నీ స్వధర్మాన్ని పాటించేవారితోనే కలిసి ప్రయాణం చేయి.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment