01.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు, సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని తెలుసుకుందాము.
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 12వ.భాగమ్
19.12.2011
111. ఎదుటివాని మతంలోనివారు తమ పూజలు తాముచేసుకుంటు ఉంటే నీవు వారి పూజా విధానాన్ని గౌరవించాలి. అదేవిధంగా వారు నిన్నూ నీధర్మాన్ని గౌరవించాలి. అపుడు ఈసమాజంలో గొడవలే ఉండవు.
11.01.2012
112. భగవంతుని అనుగ్రహం అనేది చల్లని పిల్లగాలిలా ఉంటుంది. అదే భగవంతుని ఆగ్రహం పెను తుఫాను గాలిలా ఉంటుంది. అందుచేత నీ జీవితంలో పిల్లగాలి వీచినపుడు భగవంతునికికృతజ్ఞతలు తెలియజేయి.
19.02.2012
113. భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇవిపంచభూతాలు. వీటి కలయికే ఈ శరీరము. ఈ శరీరంలో ఏఒక్కటితీసి వేసినా శరీరములోని ప్రాణము పోతుంది.
114. ప్రతి గురువారము, శుక్రవారాలలో విష్ణుసహస్రనామము,లలితాసహస్రనామాలను మందిరంలో సామూహికంగా పఠించి దేవీ పూజ చేసిన దేవీ దేవతల అనుగ్రహం పొందవచ్చును.
--- సాయిబానిస
16.05.2012
115. ఈ లోకంలో నీ కంటికి కనిపించేదంతా మాయ. నీవు కళ్ళుమూసుకుని మనో నేత్రంతో చూడగలిగిందే శాశ్వతము. అందుచేతమాయను మర్చిపోయి శాశ్వతమయిన భగవంతుని అనుగ్రహాన్నిపొందు.
02.06.2012
116. తారాబలం, చంద్రబలం కన్నా, దైవబలం గొప్పదని నేనుభావిస్తున్నాను.
27.06.2012
117. పరమశివుడు రామారక్షాస్తోత్రమును బుధకౌశికఋషికికలలో చెప్పినాడు కదా! శ్రీసాయి తన భక్తులకు కలలలో అనేకసందేశాలు యిచ్చినారని సాయి సత్ చరిత్రలో చెప్పబడింది. ఈనాడు సాయి శరీరంతో లేకపోయినా తన అంకిత భక్తులకుస్వప్నాలలో సందేశాలు ఇచ్చి, తన భక్తులను సన్మార్గంలోనడిపిస్తున్నారు.
--- సాయిబానిస
https://www.youtube.com/watch?v=5A26_QtIjtw
09.07.2012
118. నీ ఆధ్యాత్మిక ప్రయాణము నీ యింటినుంచే ప్రారంభించాలి . తిరిగి నీ ఇంటిలోనే పూర్తిచేసుకోవాలి. బయటి ప్రపంచంలోని వారితోకలిసి ఆధ్యాత్మికంలో పయనిస్తే నీకు మిగిలేది తల నెప్పులే. నీమనసుకు అశాంతి మాత్రమే మిగులుతుంది. నీ గమ్యాన్ని చేరలేవుజాగ్రత్త.
11.07.2012
119. నాదగ్గిర పగ అనే పాముండేది. దానిని అడవిలోవిడిచిపెట్టాను ఆ తరువాత పగను ప్రేమగా మార్చుకున్నాను. అపుడు అదే పాము తిరిగివచ్చి నా మెడలో హారమయింది. పరమశివుడు నా హృదయంలో నివసించసాగాడు.
13.07.2001
120. భగవంతుని ఆదేశానుసారము భగవంతుడు చూపినకక్ష్యలోనే సూర్యచంద్రులు పరిభ్రమిస్తున్నారే అలాగే మన పాలిటభగవంతుడయిన మన గురువు చూపిన మార్గంలో మనంపయనిస్తూ భగవంతుని పాదాల వద్దకు చేరుకుందాము.
(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు మరుసటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment