18.04.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన జీవితమ్ గురించి ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని తెలుసుకుందాము.
శ్రీ సాయి పుష్పగిరి – జీవితమ్ -3 వ.భాగమ్
29.12.2001
21) నిండు నూరు సంవత్సరాలు నీవు జీవించాలి అని ఇతరులునిన్ను దీవించే విధంగా నీవు జీవించు.
31.12.2001
22) అంతులేని జీవిత యాత్రలో రేపు అనే పదానికి అర్ధం లేదు. ప్రతి చిన్నవిషయం గురించి ఆలోచిస్తుంటే నీవు ముందుకుసాగలేవు. నీ ప్రయాణ వాహనాన్ని (శరీరాన్ని) మంచి స్థితిలోఉంచుకుంటూ దారిలోని ఎగుడు దిగుడులను అధిగమిస్తూ, నీశక్తియుక్తులను సద్వినియోగం చేసుకుంటూ ఓటమిలో కూడాగెలుపును చూడగలగటం అలవాటు చేసుకో. జీవిత గమ్యం(భగవంతుని చేరటం) చేరి అంతులేని ఈ యాత్రను కొనసాగించు.
31.01.2002
23) మనిషి జీవితంలోని కష్టాలకు ఎదుటివాడు కారణం అనిఆలోచించడం అవివేకము. మన అజాగ్రత్తయే ముఖ్య కారణం అనిగ్రహించడం వివేకము.
24) సాగరానికి ఆటుపోట్లు ఉన్నట్లే మన జీవిత సాగరానికి కష్టాలుసుఖాలు ఉంటాయని గ్రహించిననాడు మన జీవితంలోసుఖదుఃఖాలకి తావే లేదు.
31.03.2002
25)యోగి దృష్టిలో శాశ్వతపరమయిన ఆరోగ్యము భగవంతుడిచ్చినవరము. భోగి దృష్టిలో ఆరోగ్యము వైద్యుడిచ్చిన వరము. నీ జీవితంలో ఆరోగ్యం కోసం మంచి మార్గములో పయనిస్తూభగవంతుని ఆశ్రయించదలిచావా? లేక చెడుమార్గంలో పయనిస్తూవైద్యుడిని ఆశ్రయించదలిచావా అని నిర్ణయించుకోవలసింది నీవే.
25)యోగి దృష్టిలో శాశ్వతపరమయిన ఆరోగ్యము భగవంతుడిచ్చినవరము. భోగి దృష్టిలో ఆరోగ్యము వైద్యుడిచ్చిన వరము. నీ జీవితంలో ఆరోగ్యం కోసం మంచి మార్గములో పయనిస్తూభగవంతుని ఆశ్రయించదలిచావా? లేక చెడుమార్గంలో పయనిస్తూవైద్యుడిని ఆశ్రయించదలిచావా అని నిర్ణయించుకోవలసింది నీవే.
29.04.2002
26)గత జీవితము గత స్మృతులు పాడుపడిన రాజమహల్వంటిది. అందులో నీఆలోచనలు పనికిరాని గబ్బిలాలలాగఎగురుతూ ఉంటాయి. అందుచేత పనికిరాని గత జీవితము, గతస్మృతుల జోలికి పోవద్దు. నీ నిజ స్థితిలో జీవిస్తూ మంచి భవిష్యత్తు కోసం కృషి చేయి.
24.07.2002
27) నీ చిన్ననాటి స్నేహాలు, స్నేహితులను గుర్తు చేసుకుంటూవారితో కలిసి విందులు వినోదాలు సాగించేకన్నా సమాజంలో దిక్కులేని అనాధపిల్లలకు నీ ప్రేమను పంచి నీ చిన్నతనాన్ని గుర్తు చేసుకోవటం నీవు నీ స్నేహితులకిచ్చే గౌరవము అని గుర్తించు.
16.01.2003
28) సాయి సాగరం ఒడ్డున ఇసుకలో నడిచేటప్పుడు జాగ్రత్తగానడవటం నేర్చుకో. అసూయాపరులు సముద్రపు ఒడ్డున గోతులుత్రవ్వి ఉంచుతున్నారు.
29)ఒకసారి నీ జీవితము నీ గురువు పాదాలకు అర్పించినపిదప, నీకు నీ జీవితములో జరిగే ప్రతి పని నీ గురువు ఇచ్చానుసారముగా జరుగుతున్నదని గ్రహించి,
ఆ నిజాన్నిఅంగీకరించిన నీ జీవితము ఉత్తమ జీవితముగా వెలుగొందుతుంది.
31.01.2004
30) జీవితంలో శత్రువుతో పోరాటము అనివార్యమయినపుడుయుధ్ధం చేయక తప్పదు. అప్పుడు నీ శక్తి యుక్తులను పూర్తిగాఉపయోగించవలెను. శక్తి తగ్గిపోయినపుడు యుక్తిగా నీ శత్రువునిసంహరించాలి.
(మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment