13.04.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావాఅరి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన జీవిత సందేశాలనుండి కొన్ని సందేశాలు తెలుసుకుందాము.
శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్
31.07.2001
11) మన ఇంటిలో ఈగల బాధ ఉన్నట్లే, అదే విధంగా ప్రాపంచిక జీవితంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను అసూయాపరుల నుండిబాధలు ఉంటాయి.అవి క్షణికమయినవి. ఆ బాధలను మనం ఓరిమితో భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకోవాలి.
31.08.2001
12) తన పిల్లల పోషణ కొరకు కన్నతల్లి ఎన్ని కష్టాలు పడుతుందిఅన్నది మీరు కళ్ళారా చూశారు. మరి నేను నా పిల్లల పోషణకొరకు ఎన్ని కష్టాలు పడుతున్నాను అన్నది ఆ భగవంతుడుమాత్రమే
చూడగలడు.
12.10.2001
13) తన ప్రాణ రక్షణ అనేది ప్రతి జీవికి భగవంతుడిచ్చిన వరం. తన ప్రాణ రక్షణ కోసం ఎదుటి జీవిని
చంపడం పాపం కాదు.
16.10.2001
14). లాటరీలో బహుమతి అందరికీ రాదు. ఏనాడో ఒకనాడుబహుమతి వస్తుంది అనే ఆశతో జీవించాలి. ఆశ మనిషి బ్రతకడానికికావలసిన శక్తినిస్తుంది. ఆశక్తితోనే ఎన్ని చికాకులు వచ్చినా వాటినిజయించగలము.
15) మధ్యతగతి కుటుంబంలో అసంతృప్తి కలగటం సహజము. ఆఅసంతృప్తిని దూరం చేసుకోవటానికే సాయి కధలు చదవాలి, వినాలి.
16) ఈనాటి కష్టము రేపటి రోజున సుఖానికి మొదటి మెట్టు, అనిగ్రహించి నిజ జీవితంలో పయనించు.
17) జీవితంలో భగవంతునిపై శ్రధ్ధ మరియు వారి అనుగ్రహం కోసంసబూరి కలిగి ఉండమని నేను అనేకసార్లు చెప్పాను. కాని నేటిమానవులు భగవంతునిపై శ్రధ్ధను చూపుతూ వాని అనుగ్రహం
పొందటంలో సబూరీని (ఓరిమి) మరచి జీవితాన్ని నాశనముచేసుకుంటున్నారు. మరి దీనికి
బాధ్యులు ఎవరు అనిఆలోచించుకోవాలి.
31.10.2001
18) నీ గత జీవిత అనుభవాలు, జ్ఞాపకాలు, నేటి నీ జీవితప్రయాణానికి ఆఖరి మైలురాయి మరియు నీ నూతన జీవితప్రారంభానికి మొదటి మైలు రాయి అని గుర్తించి జీవించు.
19) నీతోటి మానవులలో కొందరిని నీవు అంటరానివాడనిభావించి వారిని అన్ని రంగాలలోను దూరంగా ఉంచుతున్నావే, మరినీప్రాణ రక్షణకోసము నీవు వారి రక్తాన్ని దానంగాస్వీకరించుతున్నపుడు వారిని నీవు అంటరానివారు అని అనడంలోఅర్ధం లేదు.
22.10.2001
20) ఒక చెట్టుకాయను పరిపక్వము కానీయకుండానే నీవుకోసుకొని తింటున్నావే. అపుడా చెట్టు నిన్ను దూషించలేదే. భగవంతుడు అల్పాయుష్షుతో జన్మించిన నీబిడ్డను తీసుకుంటే నీవుఆభగవంతుని దూషించవచ్చునా ఒక్కసారి ఆలోచించు.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment