Saturday, 23 April 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -5 వ.భాగమ్

23.04.2016  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం మీద మరికొన్ని సందేశాలు.
Image result for images of saibanisa
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -5 వ.భాగమ్

  18.01.2005

41.  ఏదయినా మంచిపని పూర్తి చేయవలసివచ్చినపుడుమధ్యవర్తుల జోక్యమునకు దూరంగ ఉండటము మంచిది.  మనమేముఖాముఖీ మనకు కావలసినవారితో మాట్లాడుకుని ఆ పనినిపూర్తి చేసుకోవడం మంచిది 

                Image result for images of man thinking
42.  కాల  చక్రంలో నలిగిపోయి కాలగర్భంలో ఎందరో కలిసిపోయారునీవు వారందరి గురించి ఆలోచిస్తున్నావాఒకనాడు నేటి వర్తమానంలోని నీవు, నీ వాళ్ళు కూడా ఇదే విధంగా కనుమరుగవుతారుఅందుచేత వర్తమానాన్నే నమ్ముకుని ప్రశాంతంగా జీవించు




30.01.2005

Image result for images of good work

43.  చెడ్డతనాన్ని గుర్తించడానికి చెడు సహవాసాలు చేయనవసరంలేదు.   చెడు లక్షణాలు ఉన్నచోట దూరంగా ఉంటూ చెడు ప్రవర్తనకలిగినవారి నుండి జాగ్రత్తపడవచ్చు.  చెడును దూరం నుంచే గుర్తించిమంచిని దగ్గరనుంచే అనుభవించాలి.  

44.  ముళ్ళబాటలో (నల్లేరుమీదబండి మీద ప్రయాణం చేస్తే నీకుకష్టాలు తెలియవు.  అదే నీ కాలికి చెప్పులు లేకుండా ముళ్ళబాటలో ప్రయాణం చేసి చూడు.  కష్టాలంటే ఏమిటో తెలుస్తాయిఅందుచేత జీవిత ప్రయాణంలో బండిలో ప్రయాణం చేసేకన్నా నీకాలికి స్వయము రక్షణ అనె చెప్పులు ధరించి ప్రయాణం చేయటంమంచిది.     

17.03.2005

45.   సమస్యలువాటికి పరిష్కారాలు వెతకటంలో కాలమువ్యర్ధము చేసుకోవద్దు.  కొన్నిసార్లు మనము  సమస్య గురించిఆలోచించకుండా  సమస్య కలిగించినవారి నుండి దూరంగా ఉన్నా సమస్య పరిష్కరింపబడుతుంది.  

  
18.03.2005
                  
 46.   నీ వృత్తి ధర్మాన్ని పాటించే సమయంలో నిన్ను కొందరు పొగడవచ్చువాటికి చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలిఅలాగే కొందరు ఈర్ష్యా ద్వేషాలతో నిన్ను తిట్టవచ్చునువారికి కూడా నువ్వు చిరునవ్వుతోనే సమాధానం చెప్పాలి

Image result for images of man scolding


02.07.2005

                         Image result for images of man distributing prasadam

 47.  ఆకలి వేసినపుడు భగవంతుని పేర ఇచ్చే ప్రసాదం కడుపునిండా తింటాము.  అదే మామూలు పరిస్థితిలో ప్రసాదం మతం వారిచ్చారని  అని ఆరా తీస్తాము.  ఆకలికి కులమతాలు లేనపుడు కులమతాల పేరిట గొడవలు పడటంలో అర్ధమేమిటి?    


26.07.2005

48.  జీవిత ప్రయాణంలో మనకు తలనొప్పి కలిగించేవారుమనమనస్సుకు బాధ కలిగించేవారు ఎదురు పడినప్పుడు వారినిపలకరించవలసిన అవసరం లేదు.  నీవు వారిని చూడనట్లుగా నీమానాన నీవు ముందుకు సాగిపోవాలి

                   Image result for images of bride going to inlaws house

49.  ఆడపిల్లకు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపాలి.  అత్తవారింట పిల్ల వారి కుటుంబ అలవాట్లకు తగ్గట్లుగా మసలుకోవాలిఅత్తమామల ముందుభర్త ముందు సాంప్రదాయంగా ఉండాలిఅనికాబోయే పెళ్ళికూతుళ్ళకు చెప్పాను.  

25.08.2005

50.  ఉద్యోగాన్వేషణలో నీవు యితరుల సహాయం కోరడంలోతప్పులేదు.   అంతేకాని నిరుద్యోగిగా ఇంకొకరి ఇంట వుంటూఉద్యోగాన్వేషణ చేయవద్దు.  అది నరక ప్రాయమవుతుందనిగ్రహించు.  

Image result for images of helping orphan



**49.  జీవితప్రయాణంలో ఎపుడయినా ఎక్కడయినాఅనాధపిల్లవాడు ఎదురుపడితే  పిల్లవాడు భగవంతుని పిల్లవాడిగాభావించి ఒక్క క్షణము  పిల్లవానిని దగ్గరకు చేరదీసి సహాయంచేయి.  భగవంతుడు తృప్తిచెంది నీకు నీ జీవిత ప్రయాణంలో తోడుగానిలచి సహాయం చేస్తాడు.
Image result for images of helping orphan
** ఇప్పుడు దీనిని రాత్రి 10.30 తరువాత ప్రచురిస్తున్నాను.49 వ.నంబరు ఒక్కసారి చదవండి. ఇది ఈ రోజు ప్రచురించేముందు అంటే రాత్రి 9.30 కు అనాధ పిల్లలను చేరదీసి వారి అవసరాల నిమిత్తమై చందా వసూలు చేస్తున్నామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు.  ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారట. మీరు ఒక అమ్మాయిని స్పోన్సర్ చేయండి అని వచ్చారు.  వారు చెప్పిన  వివరాలన్నిటిని   విచారించాను.  వారికి నేరుగా సొమ్ము కూడా ఇవ్వనక్కరలేదని ఆన్ లైన్ లోనే పంపించవచ్చని చెప్పారు.  వారు చెప్పినదంతా వారు ఇచ్చిన వెబ్ సైట్ లో చూసి నిర్ధారించుకున్నాను.  ఒక అనాధ కు ఒక సంవత్సరానికి నా శక్తి కొలది సొమ్ము ఇచ్చాను.  (ఎంత ఇచ్చానన్నది అప్రస్తుతం కనుక చెప్పటంలేదు) ఇది ఎందుకని చెప్పానంటే బాబా ఇచ్చిన సందేశం ఈరోజు ప్రచురించటానికి ఈ సంఘటన జరిగినదానికి బాబా వారు చూపిన చమత్కారంగా భావించాను) అపాత్ర దానం చేయకూడదు కాబట్టి అన్ని వివరాలను నిర్ధారించుకున్నాను.  ఈ సందేశాన్ని  ప్రచురించి, నేనే ఆచరించకపోతే ఎలా?  సాయి సందేశాలను ప్రచురించేవన్ని నిరర్ధకమే కదా?   



50.  జీవన సమరంలో ఉద్యోగ పర్వము ఒకటి.   పర్వంలో నీ పైఅధికారితో నీకు శతృత్వం ఉన్నా  శతృత్వాన్ని అణచిపెట్టియుక్తితో యుధ్ధం చేయాలి.  నీ పైఅధికారి బలహీనతలను గ్రహించిఅర్ధం చేసుకుని వాటికి నీవు దూరంగా ఉంటూ  పైఅధికారి పతనంచెందినపుడు తగిన శాస్తి జరిగిందని భావించి నీవు ప్రశాంతముగాజీవించాలి.  ఎట్టి పరిస్థితిలోను ఓరిమిని వీడరాదు.    

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment