06.04.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు మన కోసం.
శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికమ్ – 14వ.భాగమ్
08.08.2012
131. నీకు జన్మనిచ్చిన నీ తల్లిని నీ జన్మస్థలాన్ని ఎప్పటికీమర్చిపోవద్దు. నీ తల్లికి చేసే సేవ సాయికి సేవగాను, నీ జన్మస్థలమును షిరిడీగాను భావించి జీవించు.
సాయిబానిస
10.08.2012
132. కుటుంబంలో అందరూ భగవంతుని భక్తులయినా మంచిదే. అలాగని పనిపాటలు మానివేసి, నిత్యము పూజలు, భజనలు చేస్తూఉంటే జీవనవిధానంలో అనేకమయిన తలనొప్పులు రాగలవు. అందుచేత భగవతునిపై భక్తిని జీవితంలో ఒక భాగము మాత్రముగానేచూడు.
19.08.2012
133. ఆధ్యాత్మిక రంగంలో నీ స్వయం కృషిని (ఒక తపస్సులాగ)భగవంతుడు చూసి ఆయన సదా నీకు తోడుగా ఉండి నిన్ను నీ గమ్యానికి చేర్చుతాడు.
20.08.2012
134. అణుశక్తి సూక్ష్మమయిన అణువునుండి వస్తుంది. అలాగేఆధ్యాత్మిక శక్తి సూక్ష్మమయిన ఆత్మనుండి ఉద్భవిస్తుంది.
26.08.2012
135. తల్లి కోడి తనపిల్లలకు ఆహారం తినడం నేర్పుతుంది. తనపిల్లలను కాపాడుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. తనపిల్లలపై దాడిచేయడానికి వచ్చే డేగతో కూడా దెబ్బలాడటానికిసిధ్ధపడుతుంది. తల్లికోడి నిజమయిన మాతృమూర్తిగా జీవిస్తుంది. అదే విధంగా సద్గురువు కూడా తన భక్తులను తల్లి కోడి లాగకాపాడుతారు.
20.09.2012
136. వానప్రస్థాశ్రమంలో దేవాలయాలకి, తీర్ధయాత్రలకి వెళ్లవలసినఅవసరము లేదు. నీ దేహమే దేవాలయము. భగవంతుడునీగుండెలోనే ఉన్నాడని భావించి జీవించు.
(శ్రీమతి పీ.సుశీల గానం చేసిన నా దేహమే నీదేవళం పాట వినండి..యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను)
https://www.youtube.com/watch?v=EVOIEiS6ch8
27.09.2012
137. వినాయకచవితినాడు పూజ అనంతరము పాలవెల్లికి కట్టినమొక్కజొన్నపొత్తులను వినాయకుని పేర నోరులేని జీవాలకిపెట్టడానికి ఎవరూ ముందుకు రావటల్లేదే అని బాధపడుతున్నాను. వాటిని కాల్చుకుని తిని నోరులేని పశువులకు పశు గ్రాసమునులేకుండా చేస్తున్నారు.
27.10.2012
138.మనిషి అంతిమ యాత్రలోఆఖరిస్నానంచేయించిఆ పార్ధివశరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అదే మనిషి ఆత్మ తిరిగిపునర్జన్మ ఎత్తినపుడు శిశువు బాహ్యప్రపంచములోనికి వచ్చినవెంటనే మొదటిస్నానం చేయిస్తారు.ఈ స్నానాలు శరీరానికిమాత్రమే కాని ఆత్మకు కాదు. పార్ధివశరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అదే మనిషి ఆత్మ తిరిగిపునర్జన్మ ఎత్తినపుడు శిశువు
బాహ్యప్రపంచములోనికి వచ్చినవెంటనే మొదటిస్నానం చేయిస్తారు.ఈ స్నానాలు శరీరానికిమాత్రమే కాని ఆత్మకు కాదు.
29.10.2012
139. నీ ఇంటి నిర్మాణము పూర్తయిన తరువాత ఈశాన్యంలోపూజా మందిరం నిర్మించాలి అని ఆలోచించేకన్నా జీవితానికిపనికివచ్చే ఈశావ్యాసోపనిషత్తు గురించి
తెలుసుకో.
03.11.2012
140. ఉదయం వేళలో నన్ను దర్శించడానికి నా మందిరాలకురానవసరం లేదు. నీ గ్రామంలోని పొలాల గట్ల మీద విహరిస్తూప్రకృతిలో నన్ను చూడు.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment